collapse
...
Home / బిజినెస్ / ఫైనాన్స్ / పెట్రోల్‌, డిజిల్‌ రేట్లు తగ్గేదే లేదు - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu...

పెట్రోల్‌, డిజిల్‌ రేట్లు తగ్గేదే లేదు

2021-12-22  News Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

Petrol pump (3)
 

ప్రస్తుతం దేశంలో పెట్రోల్‌, డిజిల్‌ ధరలు మండిపోతున్నాయి. లీటరు పెట్రోల్‌   కొన్ని రాష్ర్టాల్లో రూ.110 , డిజల్‌ వంద దాటేసింది. రోజు వారి ఆఫీసులకు వెళ్లాలన్నా.. చిరు వ్యాపారులు ప్రతి ఒక్కరు ద్విచక్ర వాహనమో .. లేదా కార్లో వినియోగించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. పెట్రోల్‌, డిజిల్‌ ధర పెరిగితే దాని ప్రభావం ప్రతి వస్తువు మీద పడి ప్రతి వస్తువు ధర పెరుగుతుందనేది అందరికి తెలిసిన విషయమే. దేశంలో ప్రతి వస్తువు జీఎస్టీ పరిధిలోకి తెచ్చినప్పుడు పెట్రోల్‌, డిజిల్‌తో పాటు మద్యాన్ని కూడా తీసుకురావాలి. కానీ రాష్ర్టప్రభుత్వాలు మాత్రం దీనికి ససేమిరా అంటున్నాయి. పెట్రోల్‌, డిజల్‌తో పాటు మద్యం ద్వారా వచ్చే ఆదాయం కోల్పోతామని ఆందోళన చెందుతున్నాయి రాష్ర్టప్రభుత్వాలు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఈ రెండు ఇందనాల ధరలు పెరిగిపోవడంతో .. సామాన్యుడికి ఊరట కలిగించేందుకు   ఈ రెండు ఇంధనాలను జీఎస్టీ పరిధిలోకి తస్తే ధర కాస్తా తగ్గుతుంది. కానీ దిశగా ఎలాంటి ప్రయత్నాలు జరగడం లేదు. 

పార్లమెంటులో దీనికి సంబంధించి ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌ చౌదరి స్పష్టంగా తేల్చి చెప్పారు. ఇటీవల జరిగిన జీఎస్టి కౌన్సిల్‌ సమావేశంలో పెట్రోలియం ప్రొడక్టులను జీఎస్టీ పరిధిలోకి తేవాలంటూ కేంద్రానికి ఎలాంటి సిఫారసు అందలేని స్పష్టం చేశారు.  

పెట్రోలియం ఉత్పత్తులపై రోజు వారి ఎక్సైజ్‌ సుంకాన్ని అంతర్జాతీయ మార్కెట్లో ధరలను బట్టి సవరిస్తుంటారు. అదనంగా వచ్చే ఆదయాన్ని దేశంలో మౌలికరంగంపై వ్యయం చేస్తున్నామంటున్నారు పంకజ్‌ చౌదరి.   సుంకాల విషయానికి వస్తే.. అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోలియం ధరలు, డాలర్‌ మారకంతో రూపాయి విలువ.. పన్ను విధానం.. ద్రవ్యోల్బణం తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని ధర నిర్ణయిస్తామని ఆర్థిక శాఖ సహాయమంత్రి రాజ్యసభలో వివరించారు. 

ఇప్పటికే పలువర్గాల నుంచి పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టి పరిధిలోకి తేవాలన్న డిమాండ్లు ఉన్నాయి. అయితే దీనికి జీఎస్టి   కౌన్సిల్‌ సిఫారసు తప్పనిసరి. ఇప్పటి వరకు జీఎస్టీ కౌన్సిల్‌ మాత్రం పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టి పరిధిలోకి తేవాలని తమ సిఫారసు చేయలేదంటున్నారు ఆర్థికమంత్రి. కాగా ఈ జీఎస్టి కౌన్సిల్‌లో దేశంలోని అన్నీ రాష్ర్టాల ఆర్థికమంత్రులు ప్రతినిధులుగా ఉంటారు.  

అంతర్జాతీయ మార్కెట్లు పెట్రోలియం ధరలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటామని, అవసరమైనప్పుడు జోక్యం చేసుకొని సంకాన్ని తగ్గిస్తుంటామని ఆయన చెబుతున్నారు. దీనికి ఆయన ఒక ఉదాహరణ కూడా చెప్పారు. కేంద్రప్రభుత్వం గత నెల అంటే నవంబర్‌ 1న సెంట్రల్‌ఎక్సైజ్‌ డ్యూటీ.. దీంట్లోనే సెస్‌కూడా కలిసి ఉంది. పెట్రోల్‌పై రూ.5డిజిల్‌పై రూ.10తగ్గించామని గుర్తు చేశారు. దీంతో వినియోగదారుడికి   కాస్తా ఊరట లభించిందని చెప్పారు.  

కానీ వాస్తవానికి ఇది మాత్రం నిజం కాదు. ఇటీవల జరిగిన కొన్ని రాష్ర్టాల్లోని శాసనసభకు జరిగిన ఎన్నికల్లో అధికార బీజేపీ ఓడిపోయింది. దీనికి కారణం ఆయా రాష్ర్టాల్లో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోవడంమేనని సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు ఆగ్రహంతో ఉన్నారు. తమ ఆగ్రహాన్ని వారు ఓట్ల లోపంలో చూపించే సరికి జనాగ్రహాన్ని తగ్గించేందుకు స్వల్పంగా పెట్రోల్‌, డిజల్‌పై రేట్లు తగ్గించారు. వచ్చే ఏడాది కొన్ని రాష్ర్టాల్లో ఎన్నికలున్నాయి. అప్పుడు కూడా ఇదే సీన్‌ రీపిల్‌ అవుతుంది. 

తాత్కాలికంగా ధరలు పెంచకుండా నిలుపుదల చేస్తారు. ఎన్నికలు ముగిసిన తర్వాత యాదాతథంగా బాదుడే బాదుడు ఉంటుంది. సామాన్యుడి మాత్రం ఈ భారాన్ని భరించక తప్పదు.  

 2021-12-22  News Desk