collapse
...
Home / బిజినెస్ / ఫైనాన్స్ / బక్క చిక్కుతున్న రూపాయి - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu | News Telugu

బక్క చిక్కుతున్న రూపాయి

2021-12-22  Business Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

rupee (2)
 

ఏ దేశానికైనా ఆ దేశం కరెన్సీ బలంగా ఉంటే.. ఆర్థికంగా బలంగా ఉన్నట్లు లెక్క. లేదంటే ఆ దేశం ఆర్థికంగా బలహీనంగా ఉందనేది మన ఆర్థిక శాస్ర్తం చెబుతోంది. ఇక ఈ ఏడాది ముగియడానికి కొన్ని రోజులే మిగిలి ఉంది. త్వరలోనే కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. మన దేశ కరెన్సీ రూపాయినే తీసుకుంటే ఈ ఏడాది  చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఆసియాలోనే అత్యంత బలహీనమైన కరెన్సీగా నిలిచింది. దీనికి ప్రధాన కారణం దేశీయస్టాక్‌ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున తమ పెట్టుబడులు తరలించుకుపోవడమే. 

దేశీయ స్టాక్‌ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు  4.4బిలియన్‌ డాలర్లు పెట్టుబడులు తరలించుకుపోయారు.దీంతో సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలోనే మన కరెన్సీ విలువ 2.2శాతం క్షీణించింది.  

నిపుణులు ఏమంటున్నారు.... 

గోల్డ్‌మన్‌ సాచెస్‌, నోమురా హోల్డింగ్స్‌ మన దేశీయ ఈక్విటీ మార్కెట్‌ రేటింగ్‌ను తగ్గించాయి. దీంతో విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులు తరించుకుపోయారు. ఈరెండు కంపెనీలు చెప్పేదేమిటంటే.. ప్రపంచంలోని ఇతర దేశాలతో పాటు మన దేశంలో కరోనా.. ఒమిక్రాన్‌లతో సతమతమవుతుంటే.. గ్లోబల్‌ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నా ఇక్కడ మాత్రం షేర్ల ధరలు   వాస్తవ ధర కంటే చాలా ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నాయి. రికార్డు స్థాయిలో వాణిజ్యలోటు ఉంది. దీంతో పాటు అమెరికాలోని ఫెరడల్‌ రిజర్వు పాలసీతో భారతీయ సెంట్రల్‌ బ్యాంకు విధానాల్లో   చాలా వ్యత్యాసం ఉండటం కూడా   రూపాయి బలహీనపడ్డానికి కారణంగా చెబుతున్నారు.  

ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధానం వల్లే... 

రిజర్వుబ్యాంకు ఆఫ్‌ ఇండియా ప్రతి రెండు నెలలకు ఒకసారి నిర్వహించే ద్వైమాసిక ద్రవ్యపరపతి సమీక్షలో తీసుకొనే నిర్ణయాల వల్ల కరెంటు ఖాతాలోటు విపరీతంగా పెరిగిపోతోంది. దీని ప్రభావం వల్ల స్వల్ప కాలానికి రూపాయి బలహీనపడిపోతోందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రూపాయి బలహీనపడ్డం అంటే రిజర్వుబ్యాంకుకు రెండు పక్కల పదును ఉన్న కత్తితో సమానం. రూపాయి బలహీనపడితే ఎగుమతి దార్లకు పండుగే..   ఎందుకంటే ప్రస్తుతం కరోనా మహమ్మారి వల్ల ఆర్థిక వ్యవస్థ బలహీనపడింది. ఆర్థికంగా కోలుకోవాలంటే ఎగుమతులు పెంచుకోవాల్సిందే. అదే సమయంలో దిగుమతులు ఖరీదైన వ్యవహారంగా మారిపోతాయి. దీంతో ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటుతుంది. ఇలాంటి సమయంలో రిజర్వుబ్యాంకు వడ్డీరేట్లు తగ్గించాలంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది.  

ఇక... వచ్చే మార్చి చివరి నాటికి డాలర్‌ మారకంతో రూపాయి 78మార్కుకు దిగివచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. గత ఏడాది ఏప్రిల్‌ 2020లో డాలర్‌ మారకంతో రూపాయి 76.9088కి పడిపోయింది. ఇటీవల బ్లూమ్‌బర్గ్‌ నిర్వహించిన సర్వేలో ట్రేడర్స్‌, విశ్లేషకులు మాత్రం 76.50వద్ద స్థిరపడవచ్చునని   అంచనా వేశారు. మొత్తానికి డాలర్‌ మారకంతో రూపాయి ఈ ఏడాది నాలుగు శాతం క్షీణించింది. వరుసగా నాలుగు సంవత్సరం కూడా రూపాయి నష్టపోయింది.  

డిసెంబర్‌ త్రైమాసికంలోనే బాండ్‌ మార్కెట్ల నుంచి 587మిలియన్‌ డాలర్ల విదేశీ పెట్టుబడులు తరలిపోయాయి. రూపాయి బలహీనపడ్డంతో వాణిజ్యలోటు రికార్డు స్థాయిలో నవంబర్‌లో 23బిలియన్‌ డాలర్లకు ఎగబాకింది. దీనికి కారణం రికార్డు స్థాయిలో దిగుమతులు జరిగాయని చెప్పవచ్చు. బ్యాంకింగ్‌ వ్యవస్థలో నగదు నిల్వలు పుష్కలంగా ఉండాలని రిజర్వుబ్యాంకు   పెద్ద ఎత్తున డాలర్లు కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది 2022లో ఒక వేళ రూపాయి బలహీనపడ్డ మార్కెట్లో డాలర్లు వెచ్చించి రూపాయి కొనుగోలు చేసే అవకాశం కూడా లేదని గోల్డ్‌మన్‌ సాచెస్‌ చెబుతోంది.  

అయితే విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి భారత్‌ మార్కెట్లకు వచ్చే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. దీనికి కారణం త్వరలోనే లైఫ్‌ ఇన్యూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా దేశంలోనే అతి పెద్ద బీమా కంపెనీ ఐపీవోకు వస్తున్నందున దేశంలోకి పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు (డాలర్లు) వస్తాయి కాబట్టి రూపాయి కాస్తా నిలదొక్కుకొనే అవకాశం కూడా ఉంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.  

 2021-12-22  Business Desk