collapse
...
Home / వినోదం / తెలుగు / కామెడీ హీరోతో యాక్ష‌న్ సినిమానా? - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu | New...

కామెడీ హీరోతో యాక్ష‌న్ సినిమానా?

2021-12-22  News Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

Shakalaka Shankar

కమెడియ‌న్ గాకామెడి హీరోగా ఎన్నో చిత్రాల్లో ప్రేక్ష‌కుల్ని అల‌రించిన ష‌క‌ల‌క శంక‌ర్ హీరోగా ఎన్నోచిత్రాల్లో న‌టించారు. ప్ర‌స్తుతం ఆయ‌న‌ ఒక భాద్య‌తాయుత‌మైన మంచి పాత్ర‌లో హీరోగా క‌నిపిస్తున్న చిత్రం ధ‌ర్మ‌స్థ‌లి. ఈ చిత్రాన్ని రొచిశ్రీ మూవీస్ బ్యాన‌ర్ లో ప్ర‌ముఖ నిర్మాత ఎం ఆర్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మాస్ క‌మ‌ర్షియ‌ల్ విలువ‌లు తెలిసిన ర‌మ‌ణ మోగిలి ద‌ర్శ‌కుడు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేసారు చిత్ర యూనిట్. పక్కా మాస్ ఎంటర్ టైనర్ గా వస్తుంది ధర్మస్థలి. పావ‌ని హీరోయిన్ గా శంక‌ర్ కి జోడిగా న‌టిస్తుంది. వినోద్ యాజ‌మాన్య సంగీతాన్ని అందిస్తున్నారు. ధ‌ర్మ‌స్థ‌లి టైటిల్ వెన‌క క‌థ స‌మాజంలో జ‌రిగే విషం లాంటి ఒక విష‌యాన్ని అంద‌రికి అర్ధ‌మ‌య్యేలా ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ మోగిలి తెర‌కెక్కిస్తున్నారు. ఎంట‌ర్‌టైన్ చేస్తూనే ఈ విష‌యాన్ని అంద‌రికి అర్ద‌మ‌య్యేలా వుంటుంది. అందుకే ఈ చిత్రానికి ధ‌ర్మ‌స్థ‌లి టైటిల్ ని ఖ‌రారు చేశారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని జనవరిలో ప్రపంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుదల చేయ‌డానికి చిత్ర నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.    

ఈ సంద‌ర్బంగా ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ మోగిలి మాట్లాడుతూ.. 'ష‌క‌ల‌క శంక‌ర్ తో ఇప్ప‌టివ‌ర‌కూ ఇలాంటి చిత్రాన్ని ఇలాంటి కాన్సెప్ట్ ని ఎవ‌రూ తెర‌కెక్కించ‌లేదు. ఆయ‌న‌లో వున్న కామెడి టైమింగ్ చూసిన వారికి ఆయ‌న‌లో వున్న ఇంటెన్సిటి ఈ చిత్రం ద్వారా అర్ద‌మ‌వుతుంది. ప్ర‌తిరోజు మ‌న జీవితాల‌తో ముడి ప‌డిన ఓ విష‌యాన్ని అలాగే మ‌న జీవితాల‌తో ఆడుకుంటున్న అంశాన్ని ఆయ‌న పాత్ర ద్వారా తెలియ‌జేస్తున్నాం. ఆయ‌న‌లో వున్న కామెడి టైమింగ్ మిస్ కాకుండా ఇంటెన్సిటిని తెర‌పైకి తీసువ‌స్తున్నాం అన్నారు. శంక‌ర్ కి జోడి గాద పావ‌ని న‌టిస్తున్నారు. ప‌క్కా మాస్ క‌మ‌ర్షియ‌ల్ చిత్రం గా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని అల‌రించే అంశాలు ఈ చిత్రం లో వున్నాయి. ఇంత మంచి చిత్రానికి ద‌ర్శ‌స్థలి అనే టైటిల్ ని ఖ‌రారు చేశాము. ఈ టైటిల్ ని ఎనౌన్స్ చేయ‌గానే భారీ బ‌డ్జెట్ చిత్రాల‌కి వ‌చ్చిన రెస్పాన్స్ రావ‌టం విశేషం. మ‌రిన్ని వివ‌రాలు అతి త్వ‌ర‌లో తెలియ‌జేస్తాము..అని తెలిపారు.    

ఇప్ప‌టి వ‌ర‌కు శంక‌ర్ న‌టించిన చిత్రాల‌కి భిన్నంగా ఉన్న పాత్ర అని అన్నారు. అంటే ద‌ర్శ‌కుడు ఇంత‌కీ ఇన్‌టెన్సిటీ అన్నారు కానీ ఏమి చెప్ప‌ద‌లుచుకున్నాడు అనే పాయింట్ మాత్రం లీక్ చెయ్య‌లేదు. అలాగే ఎన్నో పాత్ర‌ల్లో ఎంతో క‌ష్ట‌ప‌డి షక‌ల‌క‌శంక‌ర్ న‌టిస్తున్న‌ప్ప‌టికీ ఎందుకో ఆశించినంత పేరు మాత్రం ఇంకా రాలేదు. మ‌రి ఈ చిత్రంతోనైనా మంచి పేరు వ‌స్తుందేమో చూడాలి.  ఈ చిత్ర ట్ర‌లైర్ చూస్తే శంక‌ర్ క్యారెక్ట‌ర్ చాలా సీరియ‌స్‌నెస్ ఉన్న పాత్ర‌లా క‌నిపిస్తుంది. మ‌రి కామెడీ హీరోతో ఇంత సీరియ‌స్ నెస్ ఉన్న క్యారెక్ట‌ర్ చేస్తే  ప్రేక్ష‌కులు ఆద‌రిస్తారా లేదా అనేది వేచి చూడాలి. అలాగే ట్రైల‌ర్ చూస్తుంటే శంక‌ర్ కి ఎందుకో అంత సీరియ‌స్ నెస్ సెట్ అయిన‌ట్లు క‌నిపించ‌డం లేదు. మ‌రి క‌థలో ఏద‌న్న కొత్త‌ద‌నం ఉంటే  దాని ప్ర‌కారం చూసుకుంటే ప్రేక్ష‌కులు ఏమ‌న్నా ఈ చిత్రాన్ని ఆద‌రించే అవ‌కాశం ఉంది.    
 

 



2021-12-22  News Desk