collapse
...
Home / బిజినెస్ / ఫైనాన్స్ / Next Year: ఆసియా మార్కెట్లలో అతి పెద్ద ఐపీవోలు - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for...

Next Year: ఆసియా మార్కెట్లలో అతి పెద్ద ఐపీవోలు

2021-12-23  News Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

LG (2)


 కొత్త సంవత్సరంలో అడుగు పెట్టడానికి కేవలం కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది. వచ్చే ఏడాది 2022లో ఆసియాలో అతి పెద్ద కంపెనీలు ఇనిషియల్‌ పబ్టిక్‌ ఆఫరింగ్‌కు రాబోతున్నాయి.వాటిలో ప్రపంచంలోనే అతి పెద్ద బ్యాటరీ తయారు చేసే సియోల్ కు చెందిన కంపెనీ‌,భారత్‌కు చెందిన లైఫ్‌ ఇన్సూ రెన్స్ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ)లు ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఎల్‌ఐసీ విషయానికి వస్తే సుమారు 12లక్షల మంది ఏజంట్లు ఉన్నారు. ముంబైలోనే లక్ష మంది ఉద్యోగులు ఎల్‌ఐసీలో పనిచేస్తున్నారు.        

భారత్‌తో పాటు సియోల్‌లో ఈ ఏడాది రికార్డు స్థాయిలో కంపెనీలు ఐపీవోకు వచ్చి ప్రజల వద్ద నుంచి నిధులు సేకరించాయి. ఐపీవోకు వచ్చిన కంపెనీలు కూడా స్టాక్‌ మార్కెట్లో రికార్డు స్థాయిలో లిస్టింగ్‌ అయ్యి ఇన్వెస్టర్లు మంచి లాభాలను పంచి పెట్టాయి.     ఆసియా మార్కెట్ల విషయానికి వస్తే హాంకాంగ్‌         సంప్రదాయబద్దంగా ఐపీవో మార్కెట్లు హబ్‌గా చెప్పుకోవచ్చు. చైనా ప్రభుత్వం ఇక్కడ నిరసనకారులను ఉక్కుపాదంతో అణిచివేయడంతో ఇక్కడి మార్కెట్లు వెలవెలపోయాయి. దీంతో ఇక్కడి టెక్‌ గేమింగ్‌ఎడ్యూకేషన్‌ రంగానికి చెందిన కంపెనీలు తమ వాటాలను విక్రయించుకుని నిష్ర్కమించాయి.                 

ఇక భారత్‌,కొరియాల విషయానికి వస్తే వచ్చే ఏడాది మరింత వృద్దిరేటులో దూసుకుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని హాంకాంగ్‌కు చెందిన యూబీఎస్‌ గ్రూపు ఏజీ అంచనా వేస్తోంది. దక్షిణాసియాలో అతి పెద్ద కంపెనీలు లిస్టింగ్‌ రానున్నాయి. అవి స్థానిక మార్కెట్ల నుంచి లేదా అమెరికా మార్కెట్ల నుంచి అయినా రావచ్చునని అంచనా వేసింది.        

వచ్చే ఏడాది మార్కెట్లోకి వచ్చే ఐపీవోల వివరాలు        

ఎల్‌జీ ఎనర్జీ సొల్యూషన్స్‌.. దక్షిణ కొరియా        

ఎల్‌జీ ఎనర్జీ సొల్యూషన్‌ దక్షిణ కొరియా మార్కెట్‌ నుంచి 10.8బిలియన్‌ డాలర్లు సేకరించనుంది. జనవరి ద్వితీయార్థం నుంచి ఐపీవోకు వస్తోంది జన వరి 27న లిస్టింగ్‌ అవుతుంది. దీంతో పాటు దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ కన్స్‌స్ర్టక్షన్‌ కంపెనీ కూడా ఫిబ్రవరిలో మార్కెట్‌ నుంచి బిలియన్‌ డాలర్లు సేకరించనుంది. సౌదీ అరేబియా పెట్టుబడులు పెట్టిన హ్యుందాయ్‌ ఆయిల్‌బ్యాంకు కంపెనీ కూడా మార్కెట్‌ నుంచి 1.7బిలి యన్‌ డాలర్లు సేకరించనుంది.                 

లైఫ్‌ ఇన్యూరెన్స్‌ కార్పొరేషన్‌ - ఇండియా        

ప్రభుత్వరంగానికి చెందిన ఎల్‌ఐసీ ఐదు నుంచి పది శాతంవాటాలను ప్రభుత్వం విక్రయించనుంది. వచ్చే ఏడాది మార్చి నాటికి        ఐపీవోకు రానుంది. ప్రభుత్వం ఎల్‌ఐసీ కంపెనీ విలువ రూ.10లక్షల కోట్లుగా నిర్ధారించింది. స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ అయితే ప్రపంచంలోనే అతి పెద్దకంపెనీగా దీన్ని పేర్కొనవచ్చు.ఇండియాకు చెందిన మరో ఆన్‌లైన్‌ ఎడ్యూకేషన్‌ కంపెనీ బైజూస్‌ కూడా ఒక కంపెనీని టేకోవర్‌ చేయనుంది. మార్కెట్‌ నుంచి నాలుగు బిలియన్‌ డాలర్లు సేకరించాలనే ఆలోచనలో ఉంది. కాగా ప్రస్తుతం బైజూస్‌ కంపెనీ విలువ 48బిలియన్‌ డాలర్లుగా లెక్కగట్టింది.ఇవే కాకుండా భారత్‌కు చెందిన ఇతర కంపెనీలు ఎస్‌బీఐ ఫండ్స్‌ మేనేజ్‌మెంట్‌మ్యుచువల్‌ ఫండ్‌ కంపెనీ బిలియన్‌డాలర్లు,ఓలా ఒక బిలియన్‌డాలర్లు,ఢెల్లీవరీ లాజిస్టిక్‌ సప్లయి చెయిన్‌ బిలియన్‌ డాలర్లు,ఫ్యాబ్‌ ఇండియా రిటైల్‌ క్లాతింగ్‌ 500మిలియన్‌ డాలర్లు సేకరించనున్నాయి.                 

సెయిన్‌జెంటా గ్రూపు - చైనా        

చైనా నేషనల్ కెమికల్ కార్పొరేషన్‌ ప్రభుత్వరంగానికి చెందిన కంపెనీ 10.2బిలియన్‌ డాలర్లు సేకరించాలనే ఆలోచనలో ఉన్నట్లు ఈ ఏడాది జులైలో ప్రక టించింది.ఐపీవో ద్వారా2.79బిలియన్‌కొత్త షేర్లను విక్రయించాలని నిర్ణయించింది. దీంతో ప్రభుత్వం 20శాతం వాటాను విక్రయించనుంది. అయితే వచ్చే ఏడాది మార్కెట్లోకి ఎప్పడు వచ్చేది లిస్టింగ్‌ ఎప్పడు అయ్యే అంశాలను ఇప్పటి వరకు స్పష్టంగా వెల్లడించలేదు.        

ఇక హాంకాంగ్‌ విషయానికి వస్తే ఇక్కడ నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల వల్ల పెద్ద పెద్ద కంపెనీలు ఐపీవోకు రాలేకపోతున్నాయి. హాంకాంగ్‌పై చైనా పట్టు బిగించడంతో ఇక్కడి మార్కెట్లు డీలాపడ్డాయి. ఇక్కడి మార్కెట్‌ పరిస్థితులు మెరుగుపడ్డాకే కంపెనీలు ఐపీవోకు రావాలని నిర్ణయించుకున్నాయి        



2021-12-23  News Desk