collapse
...
Home / వినోదం / తెలుగు / క‌మ‌ల్ మ‌ళ్ళీ మొదలెట్టేశాడుగా? - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu | News T...

క‌మ‌ల్ మ‌ళ్ళీ మొదలెట్టేశాడుగా?

2021-12-23  Entertainment Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

kamal Hassan 2 (2)
Courtesy:Twitter/@Kamalhassan_

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ 232వ చిత్రం విక్రమ్. ఈ చిత్రం డిసెంబర్ 10 నుంచి ఫుల్ స్వింగ్‌లో ఉంది. నేడు కమల్ హాసన్ షూటింగ్ సెట్‌లో అడుగుపెట్టారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రంలో సౌత్ ఇండియన్ స్టార్స్ అయిన ఫాహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి, నరైన్, కాళిదాస్ జయరాం వంటి వారు నటిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఆగస్ట్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఎన్నో షెడ్యూల్స్ పూర్తయ్యాయి. కమల్ హాసన్‌కు కరోనా సోకడంతో ఒక్క‌సారిగా షూటింగ్‌కు బ్రేక్ పడింది. అలా కాస్త బ్రేక్ ఇచ్చిన కమల్ హాసన్  షూటింగ్ సెట్‌లో అడుగుపెట్టేశారు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ తరుణంలో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ వంటి ప్రముఖ తారాగణంపై కీల‌క‌ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

ఈ సినిమాకు జాతీయ అవార్డు గ్రహీత కెమెరామెన్ గిరీష్ గంగాధరణ్, ఎడిటర్ ఫిలోమిన్ రాజ్, ఆర్ట్ డైరెక్టర్ సతీష్, కొరియోగ్రఫర్ శాండీ, యాక్షన్ డైరెక్టర్ అంబరివ్‌.రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్ మహేంద్రన్, కమల్ హాసన్ సంయుక్తంగా విక్రమ్ సినిమాను నిర్మిస్తున్నారు. కమల్‌ దర్శకుడి లోకేశ్‌తో ముచ్చటిస్తోన్న ఫొటోను షేర్‌ చేస్తూ సినిమా ‘యాక్షన్‌ ఫ్రం ది సెట్స్ ఆఫ్ విక్రమ్‌’ అని క్యాప్షన్‌ పెట్టింది. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

చెన్నైలోనే కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారట యూనిట్‌. ఇందులో కమల్‌తోపాటు విజయ్‌ సేతుపతి కూడా పాల్గొంటున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, ఫస్ట్ లుక్‌ సినిమాపై అంచనాలను పెంచుతోంది. కమల్‌ నుంచి వస్తోన్న మరో డిఫరెంట్‌ చిత్రమని అర్థమవుతుంది. దీన్ని పొలిటికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌. తాజాగా ప్రారంభమైన నయా చిత్రీకరణ సింగిల్‌ షెడ్యూల్‌లో పూర్తి చేయాలని భావిస్తున్నారట. ఈ సినిమాకి మొదటగా సత్యన్‌ సూర్యన్‌ కెమెరామెన్‌గా పనిచేశారు. ఆయనకు ఇతర సినిమాలతో `విక్రమ్‌` షూటింగ్‌ డేట్స్ క్లాష్‌ కావడంతో ఆయన స్థానంలో గిరీష్‌ గంగాధరన్‌ని ఎంపిక చేశారు. 

ఇక క‌మ‌ల్ చాలా గ్యాప్ త‌ర్వాత ఈ సినిమాలో న‌టిస్తున్నారు. కాబ‌ట్టి అభిమానులంతా కూడా ఎంతో ఆశ‌క్తిగా ఎదురు చూస్తున్నారు. మ‌రి ఇందులో చాలా డిఫ‌రెంట్ పాత్ర‌లో క‌మ‌ల్ మ‌న‌కు క‌నిపించ‌ను న్నారు.  అందులోనూ ఈ చిత్రంలో స్టార్ క్యాస్టింగ్ చాలా హై లెవెల్‌లో ఉంది. చాలా మంచి న‌టీన‌టులంద‌రూ ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. 



2021-12-23  Entertainment Desk