collapse
...
Home / క్రీడలు / క్రికెట్ / అశ్విన్ కామెంట్స్ పై రవిశాస్త్రి ఏమన్నాడంటే.. - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for...

అశ్విన్ కామెంట్స్ పై రవిశాస్త్రి ఏమన్నాడంటే..

2021-12-24  Sports Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

circle of cricket 3
Courtesy: twitter.com/circle of cricket

టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవి చంద్రన్ వ్యాఖ్యలపై భారత జట్టు మాజీ కోచ్ రవిశాస్ర్తి స్పందించాడు. అందరినీ బుజ్జగించడం తన పనికాదని తేల్చిచెప్పాడు. ఏ ఎజెండా లేకుండా నిజానిజాలు మాట్లడడమే తన బాధ్యత అన్నారు. తాను అప్పట్లో చేసిన వ్యాఖ్యల వెనక హేతుబద్ధత దాగి ఉందన్నారు. తన మాటలు అశ్విన్ ను మరింత బెటర్ గా ఆడేలా చేస్తాయన్న ఉద్దేశంతో చేసినవేనని సమర్థించుకున్నారు. సిడ్నీలో అశ్విన్ ఆడలేకపోయారుకుల్దీప్ కు అవకాశం రావడంతో అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. అందులో విదేశీ పిచ్ లపై తొలి సారి ఆడుతున్న యువ ఆటగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో అలాంటి వ్యాఖ్యలు చేయడం పరిపాటి. ఒక టెస్ట్ మ్యాచ్ లో మిగతా స్పిన్నర్లు ఎలాగైతే మంచి ప్రదర్శన ఇచ్చారో అతడు కూడా మొదట్లోనే మంచిగా బౌల్ చేశాడు’ అని రవిశాస్ర్తి పేర్కొన్నారు. తన వ్యాఖ్యలు అశ్విన్ ను గాయపరిచినా తనకు సంతోషమేనన్నారు. ఒక ఆటగాడికి అలాంటి మాటలు భవిష్యత్ లో మంచి ప్రదర్శనలకు పునాదిగా ఉపయోగపడతాయని ఒక కోచ్ గా తాను భావిస్తానన్నారు. 2019లో అశ్విన్ ఆటతీరుకు. 2021లో అతని ప్రదర్శనలో ఏంతో తేడా ఉందని అన్నారు. ప్రస్తుతం సౌతాఫ్రికా టూర్ లో ఉన్న అశ్విన్ ఆదివారంనాడు ప్రారంభం కానున్న మూడు టెస్టుల సిరీస్ కు సిద్ధమవుతున్నాడు. 

అసలు ఆ కామెంట్స్ ఏంటీ?

 టెస్ట్ మ్యాచ్ లకు భారత్ తరపున ప్రధాన స్పిన్నర్లలో కుల్దీప్ యాదవ్ ఒకడు అని రవిశాస్ర్తి ఆస్ర్టేలియా టూర్ నేపథ్యంలో రవిశాస్ర్తి ప్రకటన చేశారు. అప్పట్లో ఆయన చేసిన కామెంట్ ఇద్దరి నడుమ మాటల యుద్ధానికి దారి తీసింది. రవిశాస్ర్తి మాటలు తనను తీవ్రంగా బాధించాయని అశ్విన్ అన్నారు. 2018-19 ఆస్ర్టేలియా టూర్ లో కుల్దీప్ ఐదు వికెట్లు తీసి జట్టు ప్రదర్శనలో కీలక పాత్ర పోషించాడు. కుల్దీప్ అత్యుత్తమ ప్రదర్శన నేపథ్యంలో రవిశాస్ర్తి ప్రధాన స్పిన్నర్ గా అభివర్ణిస్తూ కామెంట్స్ చేశాడు. అది రవిచంద్రన్ కు ఆగ్రహం తెప్పించింది. రవి భాయి అంటే నాకు అత్యంత గౌరవం. మేం కలిసి పనిచేశాం. ఎన్నో అభిప్రాయాలు పంచుకుంటాం. వాటికి స్పందిస్తాం. కానీ అప్పట్లో ఆయన చేసిన కామెంట్స్ తనను కచ్చితంగా నలిపేసినట్లు అనిపించాయి’ అని ఇఎస్ పిఎన్ తో అశ్విన్ వ్యాఖ్యానించారు. 

సౌతాఫ్రికాలో సత్తా చాటుతాం : పుజారా

దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టులో టీమిండియా మెరుగైన ప్రదర్శన చేయడం ఖాయమని సీనియర్ బ్యాటర్ చటేశ్వర్ పుజారా జోస్యం చెప్పాడు. సఫారీ బౌలర్లను దీటుగా ఎదుర్కొనే సత్తా భారత బ్యాట్స్‌మెన్‌కు ఉందన్నాడు. సౌతాఫ్రికా బౌలర్లపై ఎదురుదాడి చేసేందుకు టీమిండియా బ్యాటర్లు సిద్ధంగా ఉన్నారన్నాడు. ప్రస్తుతం జట్టు బ్యాటింగ్ సమతూకంగా ఉందన్నాడు. సీనియర్లుజూనియర్ల కలయికతో బ్యాటింగ్ బలంగా మారిందన్నాడు. సఫారీ బౌలర్లను దీటుగా ఎదుర్కొని భారీ స్కోర్లు చేయడం తమకు కష్టం కాదన్నాడు. ఇటీవల కాలంలో పలు విదేశీ సిరీస్‌లలో భారత్ విజయాలు సాధిస్తున్న విషయాన్ని పుజారా గుర్తు చేశాడు. ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలంచే ఆస్ట్రేలియాఇంగ్లండ్‌లలో భారత్ సిరీస్‌లను సొంతం చేసుకుని సత్తా చాటిందన్నాడు. ఈసారి సౌతాఫ్రికా గడ్డపై కూడా టెస్టు సిరీస్ గెలిచి సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతామనే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. పేస్ బౌలింగ్‌కు అనుకూలించే సౌతాఫ్రికా పిచ్‌లపై తమ బ్యాటర్లు మెరుగ్గా రాణించే అవకాశాలున్నాయన్నాడు.2021-12-24  Sports Desk