collapse
...
Home / వినోదం / తెలుగు / ఏపీ నిర్ణ‌యాల‌తో బ‌డా నిర్మాత‌ల‌కు బీపీ - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu...

ఏపీ నిర్ణ‌యాల‌తో బ‌డా నిర్మాత‌ల‌కు బీపీ

2021-12-24  Entertainment Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

AP films
 

ఏపీలో సినిమా టికెట్లను ప్రభుత్వం ఆధ్వర్యంలోనే విక్రయించాలన్న నిర్ణయానికి చట్టబద్ధత కల్పించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ సినిమా నియంత్రణ చట్టసవరణ బిల్లు-2021ని అసెంబ్లీ ఆమోదించింది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరపున రాష్ట్ర సమాచారపౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కొందరు సినిమా షోలను ఇష్టానుసారంగా వేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.

అంతేకాకుండా స్పెషల్ షోల పేరుతో టికెట్ రేట్లు భారీగా పెంచేస్తున్నారని ఇలాంటి వాటిపై నియంత్రణ తీసుకురావడానికే చట్టంలో మార్పులు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. టికెట్ల విక్రయం కోసం ఇండియన్ రైల్వేస్ వినియోగిస్తున్న ఐఆర్సీటీసీ తరహాలోనే సినిమా టికెట్లను ఆన్ లైన్లో విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. తాము తీసుకొచ్చే ఈ విధంగా బ్లాక్ టికెట్ల దందాకు చెక్ పెడుతుందని.. అలాగే ప్రభుత్వానికి పన్ను ఎగవేసేవారి సంఖ్యను కూడా తగ్గిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే నిర్ణీత గడువులోగా జీఎస్టీసర్వీస్ ట్యాక్స్ వంటి పన్నులను వసూలు చేయడం మరింత సులభమవుతుందని ప్రభుత్వం బిల్లులో పేర్కొంది.

పలు మార్లు చర్చలు

సినిమా టికెట్ల ఆన్ లైన్ విక్రయంపై సినిమా పెద్దలతో ప్రభుత్వం పలుసార్లు చర్చించింది. దశలవారీగా నిర్మాతలుడిస్ట్రిబ్యూటర్లుఎగ్జిబిటర్లతో చర్చలు జరిపిన ప్రభుత్వం అందరూ అంగీకరించిన తర్వాత అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది.  సినిమా టికెట్ల ధరల తగ్గింపు విషయంలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. టికెట్ రేట్లు తగ్గిస్తూ ఇచ్చిన జీవోను ఉన్నత న్యాయస్థానం సస్పెండ్ చేసింది. పాత విధానంలోనే టికెట్ రేట్లు నిర్ణయించుకునేందుకు పిటీషనర్లకు వెసులుబాటు కల్పించింది. సినిమా టికెట్ రేట్లను తగ్గిస్తూ కొన్నాళ్ల క్రితం ఏపీ సర్కారు జీవో నెంబర్ 35 జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన థియేటర్ యజమానులు ప్రభుత్వం కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా జీవో ఇచ్చిందని పిటీషన్ లో పేర్కొన్నారు. 

కొత్త సినిమాలు విడుదలైన సమయంలో టికెట్ ధర పెంచుకునే అధికారం థియేటర్ యజమానులకు ఉంటుందని వారి తరఫున సీనియర్ లాయర్లు ఆది నారాయణ రావుదుర్గా ప్రసాద్ వాదనలు వినిపించారు. రేట్లు తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదని విన్నవించారు. పిటీషనర్ తరఫు లాయర్ల వాదనలతో ఏకీభించిన హైకోర్టు ప్రభుత్వం జారీ చేసిన జీవో 35ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీర్పుతో ఏపీలో ఇకపై పాత టికెట్ రేట్లే అమలుకానున్నాయి. ఏపీలో సినిమా టికెట్ల రేట్లు త‌గ్గించ‌డం అంటే ప్రేక్ష‌కులను అవ‌మానించిన‌ట్లే అని హీరో నాని బ‌హిరంగంగానే విమ‌ర్శించడం గ‌మ‌నార్హం. 

ఏపీ స‌ర్కార్ క‌క్ష సాధిస్తుందా ?

మ‌రి వీటిని దృష్టిలో పెట్టుకుని ఏపీ స‌ర్కార్ క‌క్ష సాధిస్తుందా అన్న చందంలో ప్ర‌స్తుతం ఏపీలోని థియేట‌ర్ల ప‌రిస్థితి నెల‌కొనింది. ఇది కేవ‌లం హైకోర్టు తీర్పు పై క‌క్ష‌గా త‌న‌ను కాద‌ని నిర్మాత‌లు కోర్టును ఆశ్ర‌యించ‌డం  ఏపీ స‌ర్కార్ అవ‌మానంగా భావిస్తోంది. గ‌త రెండు మూడు రోజుల థియేట‌ర్ల ప‌రిస్థితి చూస్తుంటే అలాగే ఉంది. ఇప్ప‌టికే 57 థియేట‌ర్ల‌ని అధికారులు సీజ్ చేశారు. మ‌రి ఇలాంటి చ‌ర్య‌ల వ‌ల్ల రాబోయే భారీ బ‌డ్జెజ్ సినిమాల ప‌రిస్థితి ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈ ఎఫెక్ట్ రాబోయే ట్రిపుల్ ఆర్‌బంగారాజురాధేశ్యామ్ చిత్రాల పైన కూడా ప‌డేట్టు ఉంది. 2021-12-24  Entertainment Desk