collapse
...
Home / వినోదం / తెలుగు / రామ్‌గోపాల్ వ‌ర్మ "ఆశ" నెర‌వేరేనా - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu | New...

రామ్‌గోపాల్ వ‌ర్మ "ఆశ" నెర‌వేరేనా

2021-12-24  Entertainment Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

RGVzoomin
Courtesy: twitter.com/RGVzoomin

శ్రీకాంత్ అయ్యంగార్సోనియా అకులవెంకట్శ్రీధర్మునినవీన్కళ్యాణ్ప్రవీణ్ప్రశాంతి నటీనటులుగా ఆనంద్ చంద్ర   రచనదర్శకత్వంలో అనురాగ్ కంచర్ల   నిర్మిస్తున్న చిత్రం   ఆశా ..ఎన్ కౌంటర్ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని నూతన సంవత్సర శుభాకాంక్షలతో జనవరి 1న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా  పెద్ద సినిమాలతో పాటు పాన్ ఇండియా సినిమాలు రావడం వలన ఈ చిత్రం విడుదల కావడం   ఆల‌స్య‌మ‌యింద‌ని చిత్ర నిర్మాత‌లు తెలిపారు. ఇప్పుడు నూతన సంవత్సర శుభాకాంక్షలతో   జనవరి 1న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాము అని అన్నారు. 

మరో మెట్టు ఎదుగుతాడు 

ఈ సినిమా గురించి ఆర్జివి చాలా విషయాలు చెప్పారని చిత్ర ద‌ర్శ‌కుడు అన్నారు.  జరిగిన అనేక వాస్తవ కథనాలతో ఈ సినిమా చేయడం జరిగింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఆశా ఎన్కౌంటర్ జరగడానికి కారకులు ఎవరుఅనేది ఈ చిత్రం లో దర్శకుడు చాలా బాగా చూపించాడని రామ్‌గోపాల్ వ‌ర్మ అన్నారు. మర్డర్ మూవీ తో తను ఎంతో మంచి దర్శకుడు అనిపించిన ఆనంద్ చంద్ర ఈ సినిమా ద్వారా మరో మెట్టు పైకి ఎదుగుతాడు అని అన్నారు.

హైదరాబాద్‌లో ఒక యువతిపై జరిగిన గ్యాంగ్ దాడి మరియు ఆ తర్వాత జరిగిన హత్య ఆధారంగా తెరకెక్కిన చిత్రం  ఆశ‌. నిజ జీవితాల ఆధారంగా సినిమాలు తీయగల దిట్ట ఆర్జీవీ. ఎక్కడైన కాంట్రవర్సీ కథనాలు ఉంటే అక్కడ రామ్​గోపాల్ వర్మ ఉంటాడని ప్ర‌త్యేకంగ చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. కేవ‌లం కాంట్ర‌వ‌ర్సీ సినిమాల పై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టాడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌. హైదరాబాద్​ నగర శివారులో జరిగిన దిశ హత్యాచారం అప్పట్లో దేశం మొత్తం సంచలనం రేకెత్తిచింది. అనంతరం నిందితులను పోలీసులు ఎన్​కౌంటర్ చేశారు. 

దిశ ఎన్​కౌంటర్​ పేరుతో సినిమా తీస్తానని ప్రకటించడంతో… దిశ తల్లిదండ్రులు హైకోర్టులో కేసు వేశారు. దీంతో ఆర్జీవీ దిశ్​ ఎన్​కౌంటర్​ పేరును కాస్తా ఆశ ఎన్​కౌంటర్​గా మార్చారు. సినిమా తీయడంలో తగ్గేదే లేదని చెప్పారు. ఆశ ఎన్​కౌంటర్ సినిమా ట్రైలర్​ విడుద‌ల‌యింది. ద‌ర్శ‌కుడు ట్రైల‌ర్‌లోనే మొత్తం సినిమాని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపించేశాడు. జ‌రిగిన యదార్ధ క‌థ‌ని చాలా క్లియ‌ర్‌గా స్పష్టంగా చూపించాడు ద‌ర్శ‌కుడు. వివాదాస్ప‌ద కాన్సెప్ట్స్ తీసుకుని వివాదం చూపించి చూపించ‌న‌ట్టుగా సినిమాలు తీయడం రామ్‌గోపాల్ వ‌ర్మ స్పెషాలిటీ. ఇక అందులో కొన్ని హిట్లు ఉంటాయి. కొన్ని ఫట్లు ఉంటాయి. హిట్ కాక‌పోయిన‌ప్ప‌టిటీ ఆర్జీవీ మాత్రం త‌న స్టైల్లో తాను వెళుతూనే ఉంటాడు. హిట్లుఫ‌ట్ల‌తోసంబంధం లేకుండా త‌న స్టైల్లో తాను సినిమాలు తీసుకుంటూ పోవ‌డ‌మే ఆర్జీవీ స్టైల్‌. 



2021-12-24  Entertainment Desk