శ్రీశైలం పుణ్యక్షేత్రంలో భద్రతా వైఫల్యం మరోసారి బయటపడింది. ఆలయం పక్కన ఉన్న పుష్కరిణి వద్ద డ్రోన్ ఎగరడం చర్చనీయాంశంగా మారింది. భక్తులు ఇచ్చిన సమాచారంతో సెక్యూరిటీ అధికారులు అప్రమత్తం అయ్యారు. డ్రెన్ వెంట పరుగులు తీసి టెక్నాలజీతో కిందికి దించివేసి దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలోనే రిమోట్ తో డ్రోన్ ను ఆపరేట్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆలయ భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారించారు. డ్రోన్ ఎందుకు ఎగరవేశారు..? ఆలయం వద్దకు ఎలా తీసుకొచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించారు.పట్టుపడ్డ ఇద్దరు వ్యక్తులు గుజరాత్ కు చెందిన వారుగా గుర్తించారు. శ్రీశైలం ఎందుకు వచ్చారన్న కోణం ఆరా తీసున్నారు. అనంతరం వాళ్లిద్దరిని పోలీసులకు అప్పగించారు. గతంలో శ్రీశైలం ఆలయంలో రాత్రిపూట డ్రోన్లు ఎగరడం కలకలం రేపింది. దీంతో ఆ ప్రాంతంలో డ్రోన్స్ ను నిషేదించారు.