రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్, రామోజీ ఫిల్మ్ సిటీ, పాన్ ఇండియా మూవీ, పూజా హెగ్డే, దర్శకుడు రాధా కృష్ణ కుమార్, జనవరి 14న విడుదల, చంద్రశేఖర్ యేలేటి,
రామోజీ ఫిలిం సిటీలో అభిమానులే అతిథులుగా రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అత్యంత ఘనంగా జరిగింది. ఈ వేడుకకు అతిరథ మహారథులు హాజరయ్యారు. బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న చిత్రం రాధేశ్యామ్. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జనవరి 14న విడుదల కానుంది.ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రాధా కృష్ణ కుమార్ ఈ సినిమాకు సంబంధించిన విశేషాలతో పాటు చిత్ర కథ ఎలా ఫుట్టిందనే విషయాలను పంచుకున్నారు.
కథ రాసుకోడానికి 18 ఏళ్లు
సినిమా చేయడానికి నాలుగేళ్లు సమయం పట్టిందన్నారు. ఈ కథ రాసుకోవడానికి 18 యేళ్లు పట్టిందన్నారు. మొట్ట మొదటిసారి ఈ పాయింట్‌ను నా గురువైన చంద్రశేఖర్ యేలేటి దగ్గర విన్నాను. దేశంలోని పెద్ద పెద్ద రైటర్స్‌ను పిలపించి రాయించాం. . కానీ, కథకు ఒక ముగింపు దొరకలేదు. ఆ సమయంలో యేలేటి గారు ఒకమాట అన్నారు. ‘ఈ కథ జాతకాల మీద చేస్తున్నావు. ఎవరికి ఈ కథ రాసి పెట్టి ఉందో అన్నారు. చివరకు ఈ కథ ప్రభాస్ దగ్గరకు చేరిందన్నారు. 18 ఏళ్ళ క్రితం రాసుకున్న కథ అని దర్శకుడు అన్నారు. అంటే ఇది పక్కా లవ్‌స్టోరీ ఇందులో ఫైట్లు ఉండవు అన్నారు. ఇందులో ప్రభాస్ క్యారెక్టర్ జాతకాలు చెప్పే టైప్‌లో ఉంటుంది. అమ్మాయి ప్రేమ కోసం సప్త సముద్రాలు దాటి వెళతాడు. ఇక ట్రైలర్ లో మధ్యలో బూకంపాలు అవీ..ఇవీ అన్నీ చూపిస్తాడు.
అంటే వీటన్నిటిని బట్టి చూస్తే ఈ సినిమా టైటానిక్ మూవీకి దగ్గరగా ఉండేట్టు ఉంది. ఇక ఈ సినిమా చూస్తుంటే టైటానికి కాస్త అటూ ఇటూ చేసి దర్శకుడు కథ రాసుకున్నాడా అనిపిస్తుంది. 18ఏళ్ళ క్రితం రాసుకున్న కథ అంటే దర్శకుడు చిన్నప్పుడు వచ్చిన కథని ఆధారంగా తీసుకుని రాసుకున్నాడేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాకపోతే టైటానిక్ అంత రేంజ్ లో అయితే కనిపించలేదు. ట్రైలర్ కాని, పాటలు కాని పెద్దగా ఆకట్టుకోవడం లేదు. సినిమా డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ ఇద్దరూ కూడా కొత్తవాళ్ళే. పాన్ ఇండియా మూవీ అని జాతీయ స్థాయిలో వారిని తీసుకువచ్చారు. ఇక ఇందులో టైటానిక్ ఫ్లేవర్లు అన్నీ అన్ని ఈ సినిమా తీసినట్లు అనిపిస్తుంది. ప్రభాస్‌ని హాలీవుడ్ రేంజ్ లో చూపిద్దామనుకుంటు న్నారు. మరి ఈ సబ్జెజ్ కాస్త అటో ఇటో అయితే మాత్రం మొత్తానికే మోసం వస్తది. మరి హాలీవుడ్ వాళ్ళని కూడా అలరించే స్థాయిలో ఈ సినిమా ఉంటుందా లేకపోతే టైటానిక్ షిప్ మునిగిపోయినట్లు ఈ సినిమా మునిగిపోతుందా అన్నది వేచి చూడాలి మరి.
కరోనా సమయంలో కూడా ఈ సినిమా కోసం చాలా మంది కష్టపడ్డారు. ముఖ్యంగా నిర్మాతలు ఖర్చుకు వెనకాడలేదు. సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని ఈ వేదిక పై ప్రభాస్ అన్నారు. పూజా హెగ్డే అందంగా ఉంది. అలాగే అద్భుతంగా నటించింది. రేపు మీరు సినిమాలో చూస్తారు. రాధాకృష్ణ కుమార్ మంచి విజన్ ఉన్న డైరెక్టర్. బాహుబలి అయిపోయిన తర్వాత సాహో టైంలో మొదలుపెట్టి ఆపేసి.. మళ్లీ కరోనా వచ్చిందని కొన్ని రోజులు ఆపి.. ఇలా పని చేయాలి అంటే ఫ్రస్టేషన్ ఉంటుంది. కానీ డైరెక్టర్ మాత్రం అద్భుతమైన అవుట్‌పుట్ ఇచ్చాడు అని అన్నారు.