collapse
...
Home / తెలంగాణ / సరికొత్త రికార్డు దిశగా తెలంగాణ మద్యం విక్రయాలు - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News fo...

సరికొత్త రికార్డు దిశగా తెలంగాణ మద్యం విక్రయాలు

2021-12-24  News Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

Wine Shops in India
 

తెలంగాణ ఆబ్కారీ శాఖ రికార్డులను తిరగరాస్తోంది. గతంలో అత్యధిక విక్రయాల రికార్డును ఈ నెలలో బ్రేక్ చేయనుంది. ఒకనెలలో తెలంగాణలో అత్యధిక విక్రయాలు 2800 కోట్లు జరిగాయి. ఇదే ఇప్పటి వరకు ఉన్న రికార్డు. ఈ రికార్డును బద్దలు కొట్టే దిశగా ప్రస్తుతం అమ్మకాలు జరుగుతున్నాయి.

రాష్ట్రంలో టెంపరేచర్ లెవెల్స్ అత్యల్ప స్థాయికి పడిపోవడంతో మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. గత కొన్ని వారాల వరకు అప్పుడప్పుడు మద్యం సేవించేవారు కూడా ప్రస్తుతం రోజుకో పెగ్గు చెప్పున సేవిస్తున్నారు. దీంతో వైన్ షాపులన్ని జనాలతో నిండిపోతున్నాయి. కొన్నిచోట్ల క్యూలు కనిపిస్తున్నాయి. మద్యం అమ్మకాలు పెరగడంతో అబ్కారీ శాఖ ఆదాయం గణనీయంగా పెరిగింది.

డిసెంబర్ 23 వరకు జరిగిన విక్రయాలను చూస్తే తెలంగాణలో మద్యం ప్రియులు ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారో అర్ధమౌతోంది. డిసెంబర్ 23 నాటికి తెలంగాణలో మద్యం అమ్మకాలు 2320 కోట్లు దాటేశాయి. ఇక రానున్న వారం రోజుల్లో మద్యం ఏరులై పారుతుందని చెప్పడంలో సందేహం లేదు. కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం అమ్మకాలు యమ స్పీడ్ గా జరుగుతాయి. దీంతో ఈ ఒక్క డిసెంబర్ నెలలోనే తెలంగాణలో మద్యం అమ్మకాలు 3 వేల కోట్ల రూపాయలు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

తెలంగాణ ఏర్పడిన తొలి ఏడాదిలో మద్యం విక్రయాల ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి రూ.10,833 కోట్ల ఆదాయం లభించింది. ఆ అమ్మకాలు అలాగే కొనసాగింది. 2020-21లో ఈ అమ్మకాలు రూ.27,888 కోట్లకు చేరుకుంది.

 



2021-12-24  News Desk