Courtesy: twitter.com/Chrissuccess
కేరళ బ్యూటీ సంయుక్త మీనన్ జోరు పెంచింది. మలయాళ సినిమా పాప్ కార్న్ సినిమాతో సినీ రంగంలో ప్రవేశించిన ఈ ముద్దుగుమ్మ తక్కువ సమయంలోనే క్రేజ్ సంపాదించుకుంది. సినీ నిర్మాతలు తనవైపు చూసేవిధంగా కెరీర్ ను మలచుకుంది.
పాప్ కార్న్ తర్వాత కలరి అనే సినిమాతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కన్నడలోనే గాలిపట అనే మూవీతో నటించింది.
తెలుగులో పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమాలో కూడా సంయుక్త మీనన్ ఓ ప్రధాన పాత్రలో నటించింది.తాజాగా తమిళ, తెలుగు భాషల్లో హీరో ధనుష్ చేస్తున్న సార్ అనే సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది.