collapse
...
Home / వినోదం / తెలుగు / సింగ‌రాయ్‌...ఓకే అనిపించావోయ్‌ - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu | News T...

సింగ‌రాయ్‌...ఓకే అనిపించావోయ్‌

2021-12-24  Entertainment Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

nani shyam singha roy

దాదాపు రెండేళ్ల తర్వాత థియేటర్స్ లోకి వస్తున్న నాని సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెంచుకున్నారు. నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంతో తెరకెక్కిన తాజా చిత్రం శ్యామ్‌ సింగరాయ్‌’. సాయిపల్లవికృతిశెట్టిమడోన్నా సెబాస్టియన్ హీరోయిన్స్‌గా నటించారు. ఈ మూవీలోనాని..  వాసుశ్యామ్‌ సింగరాయ్‌ అనే రెండు విభిన్న పాత్రలు పోషించారు. నిహారిక ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇప్పటికే విడుదలైన టీజర్‌పాటలకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడం.. దానికి తోడు మూవీ ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌గా చేయడంతో శ్యామ్‌ సింగరాయ్‌పై హైప్‌ క్రియేట్‌ అయింది. ఇప్పటికే కొన్ని చోట్ల ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది.. శ్యామ్‌ సింగరాయ్‌గా నాని ఏమేరకు ఆకట్టుకున్నాయిత‌దిత‌ర‌ అంశాలను ట్విటర్‌లో చర్చిస్తున్నారు.

హిట్ కొట్టిన నాని

రెండు విభిన్న పాత్రలో నాని ఒదిగిపోయాడని నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. మిక్కీజెమేయర్ సంగీతం ఎందుకో అంత‌గా ఆక‌ట్టుకోలేక‌పోయిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. సూప‌ర్ హిట్ అనిపించుకోద‌గ్గ సాంగ్స్ మాత్రం పెద్ద‌గా ఈ చిత్రంలో లేవు.ఫస్టాఫ్‌ కొంచెం స్లోగా ఉన్న‌ప్ప‌టికీ క్లైమాక్స్‌ కూడా అంతగా ఆకట్టుకోలేదని కొంత మంది కామెంట్ చేస్తున్నారు. రెండేళ్ల తర్వాత థియేటర్‌లోకి వచ్చిన నాని.. హిట్‌ కొట్టాడని ఎక్కువ మంది కామెంట్‌ చేశారు.

కథే సినిమాకు బలం

శ్యామ్ సింగరాయ్ సినిమాకు రచయిత సత్యదేవ్ జంగా అందించిన కథనే పూర్తి బలం. సత్యదేవ్ కథను డెవలప్ చేసిన విధానందేవదాసిల జీవితాన్ని కథకు ముడిపెట్టిన విధానం ఆకట్టుకొంటుంది. వాసుశ్యామ్ సింగరాయ్ పాత్రలో జీవించిన నాని నటన సినిమాకు అదనపు ఆకర్షణ. ఇక సాయిపల్లవి ఎమోషనల్‌గా ప్రేక్షకులను ఆకట్టుకొంటే.. కృతిశెట్టి గ్లామర్ పరంగా మెప్పించింది. మడోన్నా సెబాస్టియన్ ఓ కీలకపాత్రలో కథకు ఆకర్షణీయంగా మారింది. నటీనటులు పెర్ఫార్మెన్స్‌తోపాటు సినిమాటోగ్రఫిమిక్కి జే మేయర్ రీరికార్డింగ్ పాజిటివ్‌గా మారాయి. ఫస్టాఫ్‌గా సాఫ్ట్‌గా సాగిపొతే.. సెకండాఫ్‌లో ఒడిదుడుకులతో కాస్త ఇబ్బంది పెడతుంది.

ఇవే మైనస్సులు

శ్యామ్ సింగరాయ్ మైనస్ పాయింట్ల విషయానికి వస్తే.. ఇంటర్వెల్‌ తర్వాత సాయిపల్లవినాని మధ్య వచ్చే 20 నిమిషాల డ్రామా కాస్త సహనానికి పరీక్ష పెట్టినట్టు ఉంటుంది. కాకపోతే ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు వచ్చే ఎపిసోడ్స్ ఆ లోపాలను సవరించడం కాస్త ఉపశమనం. ఈ సినిమాకు పాటలు మైనస్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రేక్షకులను ఆకట్టుకొనే పాటలు లేకపోవడంతో సినిమాలో జోష్ తగినట్టు అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలుకథనంలో లాజిక్కులకు పొంతన ఉండదు. ఇక ఏది ఏమైన‌ప్ప‌టికీ నానికి ఆశించినంత హిట్ రాక‌పోయినా.. గ‌త చిత్రం ట‌క్ జ‌గ‌దీశ్ కంటే ప‌ర్వాలేద‌నిపించుకుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ మ‌ధ్య కాలంలో నానికి హిట్ లేక‌పోవ‌డంతో ఈ చిత్రం పెద్ద హిట్ గానే క‌నిపిస్తుంది.2021-12-24  Entertainment Desk