డార్లింగ్ హీరో ప్రభాస్, పూజా హెగ్జె కథానాయికులుగా నటించిన సినిమా రాధే శ్యామ్. భారీ బడ్జెట్‌తో తెలుగుతో పాటు హిందీలోనూ ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకుంది. అన్ని భాషల్లో ఈ చిత్రం డబ్బ్ అయ్యింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంక్రాతి సందర్భంగా జనవరి 14న విడుదల కానుంది.ఇటీవేల విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది.
విడుదలైన 24 గంటల్లోనే రెండు కోట్ల వ్యూస్‌ని దక్కించుకుంది రాధేశ్యామ్ ట్రైలర్. మరి కేవలం ట్రైలర్‌కే ఇంత అద్భుతమైన స్పందన వస్తే ఇక సినిమా విషయానికి వచ్చే సరికి ప్రత్యేకంగా చెప్పేదేముంది. అందులోనూ ప్రభాస్ సినిమా అంటేనే ప్రేక్షకుల్లో ఉండే క్రేజే వేరు.
ముఖ్యంగా ప్రభాస్ సినిమా అంటేనే భారీ అంచనాలు ఉంటాయి. బాహుబలితో ఆ అంచనాలు మరింత పెరిగాయి. అందుకే ప్రభాస్ నుంచి సినిమా వస్తుందంటే.. ప్రేక్షకుల్లో చాలా ఊహాగానాలు ఉంటాయి. అందులోనూ అన్నీ భారీ బడ్జెట్‌తో పాటు సినిమాలో యాక్షన్ సీన్లు ఉంటాయనేది ప్రతి ఒక్కరి అభిప్రాయం. అందుకు తగ్గట్లుగానే బాహుబలి తర్వాత సాహోలో భారీ యాక్షన్ సీన్లు పెట్టారు. అయితే రాధేశ్యామ్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రభాస్ లవర్ బాయ్‌గా, అమ్మాయిలను ఫ్లర్ట్ చేసే క్యారెక్టర్ పోషించినట్లు తెలుస్తోంది. ట్రైలర్ చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ట్రైలర్లో ఒక్క ఫైట్ సీన్ కూడా లేదు. అంటే ఈ సినిమా పూర్తిగా లవ్ స్టోరీ, ఏమోషన్స్తోనే నడుస్తుందని తెలుస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఇదో భిన్నమైన కథ అని.. లవ్‌స్టోరీ అయినప్పటికీ అంతకుమించి ఈ సినిమా ఉంటుందని ఇందులో చాలా ట్విస్ట్‌లు ఉంటాయని చెప్పి ప్రేక్షకుల్లో మరింత అంచనాలు పెంచేశారు. క్లైమ్యాక్స్ కొత్తగా ఉంటుందని తెలిపారు.
జనవరి 14 వరకు ఆగాల్సిందే
ప్రభాస్ లవర్ బాయ్ గా ఇంతకు ముందు కూడా కనిపించారు. డార్లింగ్, మిర్చి లాంటి సినిమాల్లో ఇలాంటి క్యారెక్టర్ చేశారు. అయితే ఆయా సినిమాల్లో యాక్షన్ సీన్లు, ఫైట్లు కూడా ఉంటాయి. మొదటి సారి పూర్తి స్థాయి లవ్‌స్టోరీ చేస్తున్నారు ప్రభాస్. ఇన్ని రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ లవ్‌స్టోరీలో నటిస్తున్నారు కాబట్టి మరి ఈ సినిమాను ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారో తెలియాలంటే.. జనవరి 14వరకు ఆగాల్సిందే.