6tvnews

collapse
...
Home / అంతర్జాతీయం / ఇమ్రాన్ సర్కార్ పై విపక్షాల ముప్పేట దాడి

ఇమ్రాన్ సర్కార్ పై విపక్షాల ముప్పేట దాడి

2022-01-08  News Desk

Imran khan
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఒక దొంగ , అబద్దాల కోరు , నిజాయితీ లేనివాడని పాక్ ప్రతిపక్షం తీవ్ర ఆరోపణలు చేసింది. పాకిస్తాన్ రాజ్యాంగం ప్రకారం ఒక దొంగ ప్రధాని కాలేడని తేల్చి ఎద్దేవా చేసింది. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత షెహబాజ్ షరీఫ్ పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు.పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ నియమించిన విచారమ కమిటీ సమర్పించిన నివేదిక ప్రకారం పాకిస్తాన్ పాలక పార్టీ కోట్లాది రూపాయల ఎన్నికల నిధులను అక్రమంగా తరలించినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రధాని ఇమ్రాన్‌పై విచారణ జరిపించాలని, రోజువారీ ప్రాతిపదికపై ఈ కేసును విచారించాలని షరీఫ్ డిమాండ్ చేశారు.    

దేశం మొత్తంగా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టులాడుతుండటంతో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరవుతోంది. కానీ ఎన్నికల నిధులను భారీ ఎత్తున తరలించాడని పాక్ ప్రతిపక్షం తీవ్ర ఆరోపణలు గుప్పిస్తోంది. పైగా ప్రధానిపై న్యాయపరమైన చర్యకు పూనుకుంటానని హెచ్చరించింది. దీంతో ఇమ్రాన్ ఖాన్ సమస్యలు మరింత పెరిగాయి.పాకిస్తాన్‌లో అధికార పార్టీ తెహ్రీక్ ఇ ఇన్సాప్ కోట్లాది నిధులను అక్రమంగా తరలించిందని ఎన్నికల కమిషన్ నియమించిన విచారణ కమిటీ నివేదించింది. దాంతో పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత షెహబాజ్ షరీఫ్ సాక్షాత్తూ ప్రధానిపై న్యాయ విచారణ చేపట్టి ఆయనపై రోజువారీ విచారణ కొనసాగించాలనిని తీవ్రంగా ఆరోపించారు.    

పాకిస్తాన్ రాజ్యాంగం ప్రకారం ఒక దొంగ దేశ ప్రధానిగా ఉండకూడదని ప్రతిపక్షనేత విమర్శించారు. చట్టం ప్రకారం ఇప్పటికే తనను తాను ఒక దొంగగా , అబద్దాలకోరుగా ఇమ్రాన్ ఖాన్ రుజవు చేసుకున్నారు. ఆయన తన పదవికి వెంటనే రాజీనామా చేయాలి. వాస్తవాలను తొక్కి పెట్టి దొంగిలించి , అబద్ధాలతో కాలం గడుపుతున్న వ్యక్తి రాజ్యాంగబద్దమైన ప్రభుత్వ లేదా రాజకీయ కార్యాలయంలో ఎలాంటి పదవినీ నిర్వహించజాలడు అని పాకిస్తాన్ ముస్లిం లీగ్ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు.పాక్ ప్రధానిపై ఆరోపణల నివేదిక మంగళవారం మీడియాలో ప్రచురితమవడంతో పాక్ ప్రభుత్వం చిక్కుల్లో పడింది. కానీ ఎన్నికల కమిషన్ నుంచి తాను ఏదీ దాచి ఉంచలేదని ప్రభుత్వం తన్ను తాను సమర్థించుకుంది.         

అయితే అవినీతిపరుడు రాజ్యాంగ పదవిలో ఉండకూడదన్న సూత్రం నాటి ప్రధాని నవాజ్ షరీఫ్‌కి వర్తించేటట్లయితే అదే సూత్రం ఇమ్రాన్ ఖాన్‌ విషయంలో ఎందుకు వర్తించదని షరీఫ్ ప్రశ్నించారు. నవాజ్ షరీఫై పనామా పేపర్ లీక్స్ పై విచారణ జరిగినప్పుడు , సుప్రీంకోర్టు గౌరవనీయ న్యాయమూర్తులే ఈ విచారణను స్వయంగా పర్యవేక్షించినప్పుడు ఇమ్రాన్ ఖాన్ విషయంలో ఇది ఎందుకు వర్తించదు అని షరీఫ్ నిలదీశారు.    

దేశ న్యాయ , రాజకీయ నియమావళిని రూపొందించిన పాక్ రాజ్యాంగం ప్రకారం పాక్ ప్రధాని పదవినుంచి ఇమ్రాన్ ఖాన్ వైదొలగాల్సి ఉంది. ఇమ్రాన్ ఖాన్ నిజాయితీ పరుడు కాదని , విశ్వసనీయ వ్యక్తి కానే కాడని సాక్షాత్తూ ఎన్నికల కమిషన్ విచారణ కమిటీ పేర్కొందని షరీఫ్ గుర్తు చేశారు. అందుకే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై న్యాయవిచారణ జరపాలని , అది కూడా రోజువారీ ప్రాతిపదికన కొనసాగించాలని పాక్ ప్రతిపక్ష నేత డిమాండ్ చేశారు.    

పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై ఇదేవిధమైన ఆరోపణలు వచ్చినప్పుడు ఆయనపై న్యాయ విచారణ కొనసాగి ప్రధాని పదవినుంచి వైదొలిగారని రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్క వ్యక్తి విషయంలోనూ సమాన ప్రాతిపదికను వర్తింపజేయాలని షరీఫ్ కోరారు.    


2022-01-08  News Desk