6tvnews

collapse
...
Home / చదువు / ఒక్క NITలోనే ఎంతమందికి కరోనా వచ్చిందంటే...?

ఒక్క NITలోనే ఎంతమందికి కరోనా వచ్చిందంటే...?

2022-01-08  Education Desk

NIT HAMIRPUR

విద్యాలయాల్లో కూడా కొవిడ్ ప్రతాపాన్ని చూపెడుతోంది. ఒక్క హమీర్పూర్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లోనే మరో 59మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చింది. నిట్ అధికార ప్రతినిధి ఈ మేరకు వెల్లడించారు. 726 మందిని శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపగా వారిలో 59మంది మహమ్మారి బారిన పడ్డట్లు వెల్లడైందన్నారు. అందరికి చికిత్స అందజేస్తున్నట్లు నిట్ అధికారులు వెల్లడించారు. విద్యార్థులు ఎవరూ భయపడవద్దని, ఇళ్లకు వెళ్లిన వారు తిరిగి రావాలని, వారి కోసం జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని భరోసా ఇచ్చారు. 


2022-01-08  Education Desk