6tvnews

collapse
...
Home / ఆంధ్రప్రదేశ్ / కడప / మగవారే పొంగళ్లు పెట్టే ఆచారం ఎక్కుడుందో తెలుసా ?

మగవారే పొంగళ్లు పెట్టే ఆచారం ఎక్కుడుందో తెలుసా ?

2022-01-09  News Desk

Kadapa Temple 2
కడప జిల్లాపుల్లంపేట మండలం తిప్పాయ పల్లె సంజీవరాయ స్వామి ఆలయంలో మగవారి పొంగల్లు వేడుకలు ఘనంగా జరిగాయి.  ఈ వేడుకకు స్థానికులే కాకుండా వృత్తి రీత్యా వివిధ రాష్ట్రాలువివిధ దేశాల్లో స్థిర పడిన మగవారు కూడా పొంగల్లు పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు 

పూర్వం తిప్పాయ పల్లె గ్రామంలో ఓ వృద్ద సన్యాసి తిరిగేవాడని ఆయన మహిళలు పెట్టె ఆహారం తినేవాడు కాడని అక్కడి గ్రామస్థులు చెబుతున్నారు.  ఈ గ్రామంలో విడిచి వెళుతూ ఆంజనేయస్వామిని సంజీవరాయ స్వామిగా నామకరణం చేసి ప్రతిష్ఠించినట్టు పెద్దలు చెబుతారు. ఆయన సూచనల మేరకు ఆలయం గోపురం నిర్మించకుండా ప్రహరీ గోడ నిర్మాణం కూడా జరిగిందని అక్కడి పెద్దలు చెబుతున్నారు. మహిళలు పొంగల్లు పెట్టె సమయంలో ఆలయ ప్రవేశం చేయకుండా ప్రహరీ బయటనుంచి స్వామి వారిని దర్శనం చేసు కోవచ్చుననిమగవారు మాత్రమే ఆలయ ఆవరణంలో పొంగల్లు పెట్టి ఆ ప్రసాదాన్ని మగవారు మాత్రమే తినాలనే ప్రతీతి.

Kadapa Temple 1
స్వామి సూచనలను నేటికి ఆచరించడం మూలంగా గ్రామంలో అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారనిదేశ విదేశాలల్లో వృత్తివ్యాపార రీత్యా స్థిర పడినారని భక్తులు తెలిపారు.  ఇందులో భాగంగానే గ్రామంలోని వారే కాకుండా జిల్లా నలుమూలల నుంచి భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించు కొని పూజలు నిర్వహించారని ఆలయ సభ్యులు తెలిపారు.


2022-01-09  News Desk