6tvnews

collapse
...
Home / అంతర్జాతీయం / ఇండియా-మాల్దీవుల మధ్య సంబంధాలు బెడిసికొట్టాయా ?

ఇండియా-మాల్దీవుల మధ్య సంబంధాలు బెడిసికొట్టాయా ?

2022-01-09  International Desk

India Maldievs
గత పదేళ్లలో భారత్- మాల్దీవుల ద్వైపాక్షిక సంబంధాల్లో ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకప్పుడు ఈ రెండు దేశాల సంబంధాలను ఎంతో శక్తివంతమైనవనిపటిష్టమైనవని భావించేవారు. కానీ ఇప్పుడు మాల్దీవులు ఇండియాకు ఒక విలన్ అనే అభిప్రాయం కలిగించారు. సంబంధాలు దూరం కావడం పదేళ్ల కిందటే ప్రారంభమైనా ముఖ్యంగా గత మూడేళ్ల నుంచీ అది తీవ్రతరంగా మారింది. భారతదేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. మనీ లాండరింగ్అపహరణ కేసులో మాల్దీవుల మాజీ అధ్యక్షుడు యమీన్ పై వచ్చిన నేరారోపణల్ని ఆ దేశ సుప్రీంకోర్టు 2021 నవంబర్ లో త్రోసిపుచ్చడంతో ఇండియా వ్యతిరేకత తీవ్రరూపం దాల్చింది. సుప్రీంకోర్టు క్లీన్ చిట్ యమీన్ బలం పుంజుకోడానికి, తిరిగి రాజకీయాల్లోకి రావడానికి దోహదపడింది.       

రాజకీయ ప్రచారం

ఇండియాకన్నా చైనాకే అనుకూలంగా ఉన్నారని పేరున్న యమీన్ హయాంలోనే భారత మాల్దీవుల మధ్య ద్వైపాక్షిక సంబంధాలలో మార్పులు ప్రారంభమయ్యాయి. యమీన్ సవతి సోదరుడుమాజీ అధ్యక్షుడుప్రస్తుతం మాల్దీవ్స్ రిఫార్మ్ మూవ్ మెంట్ పార్టీ (ఎంఆర్ ఎం) నాయకుడు మామూన్ అబ్దుల్ గయూమ్ మాత్రం భారత వ్యతిరేక ప్రచారాన్ని వ్యతిరేకించారు. 2013లో యమీన్ దేశాధ్యక్షుడైన తర్వాత కూడా గయూమ్ మారలేదు. అబ్దుల్లా యమీన్ నాయకత్వంలోని పీపుల్స్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ (పిపిఎం) పార్టీ 2013లో అధికారంలోకి వచ్చి అయిదేళ్లు పాలించింది. ఆ కాలంలోనే ఇండియా-మాల్దీవుల ద్వైపాక్షిక సంబంధాలు క్షీణించాయి. యమీన్ ప్రభుత్వంఅంతకు ముందు పాలించిన వహీద్ ప్రభుత్వం భారత వ్యతిరేకి అని పేరుపడినాయమీన్ ప్రభుత్వం చైనాకు అనుకూలం అని స్పష్టంగా తెలిసినామాల్దీవులకు ఇండియానే ముఖ్యం అనే చర్చలు దేశంలో సాగాయి. మాల్దీవుల్లో ఇతర రాజకీయ పక్షాలు కూడా భారత్ వ్యతిరేక ప్రచారాన్ని ఖండించాయి. మాజీ అధ్యక్షుడు  ప్రజల్లో ఇండియాపై ద్వేషాన్ని రెచ్చగొడుతున్నారని తీవ్రంగా విమర్శించాయి.  కానీ ఈ విమర్శల్ని ఖండిస్తూ ఇబ్రహీం సోలీహ్  ప్రభుత్వం … తాము భారతదేశంతో సత్సంబంధాలు కలిగి ఉండాలని, ముఖ్యంగా రక్షణరంగంలో అది అవసరమని భావిస్తున్నామని వెల్లడించింది.     

ఔట్ ఇండియా’ ప్రచారం:

భారత వ్యతిరేకతకు అనేక అంశాలు ఆజ్యం పోశాయి. గత మూడేళ్లుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు చాలా ప్రభావం చూపాయి. అందులో మొదటి అంశం: భారతదేశం మాల్దీవులకు 2010లోనూ, 2015లోనూ ఇచ్చిన రెండు తేలికగా ఉండే అడ్వాన్స్ డ్ లైట్ హెలికాప్టర్స్ (ఎఎల్ ఎఫ్) పై వివాదం.  సముద్ర విషయాల అన్వేషణకువాతావరణం సరిగా లేని పరిస్థితిలో  సహాయ కార్యక్రమాలకుప్రజల్ని ఒక దీవి నుంచి మరో దీవికి  తరలించేందుకుమానవతా కోణంలో  వీటిని ఉపయోగిస్తారు. అయితేయమీన్ పార్టీ పిపిఎం దీనిపై వివాదం లేవదీసే ప్రయత్నం చేసింది. ఈ హెలికాప్టర్లు సైన్యానికి చెందినవి కనుక. ఇండియా వీటిని  కానుకగా ఇచ్చి మాల్దీవుల్లో సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవాలని చూస్తోందని వివాదం లేవదీసింది.

రెండవది: రెండు దేశాలూ ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వాటిప్రకారం భారత అధికారులు మాల్దీవుల నేషనల్ డిఫెన్స్ ఫోర్స్ కు శిక్షణ ఇవ్వాలి. ఆ అధికారుల కమాండ్ లోనే ఈ హెలికాప్టర్లుంటాయి. ఇక మూడో అంశం: 2016లో యమీన్ ప్రభుత్వ హయాంలో ఇండియా- మాల్దీవుల మధ్య కుదిరిన ఒప్పందంలో  యుటిెఫ్ హార్బర్ ప్రాజెక్ట్ ఉంది. 2019లో అధికారంలోకి వచ్చిన సోలీహ్ ప్రభుత్వం దీన్ని కూడా రాజకీయం చేసింది. మీడియా వంతపాడింది. ఆ ప్రాజెక్ట్ ఇండియన్ నౌకా స్థావరంగా మారుతుందని పుకార్లు పుట్టించింది. ఈ ప్రాజెక్ట్ కింద ఇండియా మాల్దీవులకు ఒక కోస్ట్ గార్డ్ హార్బర్ఉతురూ థిలాఫాత్తులో ఒక డాక్ యార్డ్ నిర్మించినిర్వహించాలి. ఇవి వ్యూహాత్మకంగా మాల్దీవుల రాజధాని మాలేకి దగ్గరలో ఉంది. మాల్దీవుల అప్పటి రక్షణ దళాల అధిపతి మేజర్ జనరల్ అబ్దుల్లా మాట్లాడుతూ … ఈ ప్రాజెక్ట్ కు గ్రాంట్ ఇస్తానని ఇండియా చెప్పినప్పటికీ … దేశంలో భారత నౌకా స్థావరాన్ని ఏర్పాటు చేసే ఆలోచనేదీ లేదని ప్రకటించారు. ఆ ప్రకటన కూడా వివాదాస్పదమైంది. ఇక నాలుగో అంశం: హిందూ మహాసముద్ర ప్రాంతంలో రెండుదేశాల రక్షణ సహకారానికీ. వ్యూహాత్మక భాగస్వామ్యం. భద్రతా ప్రయోజనాలకూ 2016లో భారత్ -మాల్దీవులు ఒక కార్యాచరణ ప్రణాళికపై సంతకాలు చేశాయి. అయితే, ద్వైపాక్షిక సంబంధాలు క్షీణించడం, మాల్దీవుల్లో భారత దళాల ఉనికి విషయంలో భారత్ పట్ల వ్యతిరేకత పెరగడంతో … 2016లో అప్పటి యమీన్ ప్రభుత్వం … ఆ హెలికాప్టర్లను వెనక్కు తీసుకోమని ఇండియాను అడిగింది. భారత నౌకాదళం మాల్దీవుల్లో ఉండే కాలాన్నిపొడిగించేందుకు తిరస్కరించింది. అలాగేహెలికాప్టర్లను వెనక్కు తీసుకునేందుకు భారతదేశం వప్పుకోలేదనీ తెలిసింది. భారతదేశంపై మాల్దీవుల వ్యతిరేకతకు ఈ నాలుగు అంశాలే ప్రధానమని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగేమాలీ ప్రభుత్వాలు ఇండియాను పక్కన పెట్టిచైనా వైపు మొగ్గు చూపడం కూడా ద్వైపాక్షిక సంబంధాలు క్షీణించడానికి కారణాలని చెబుతున్నారు. 

2018లో ఇబ్రహీం మహమ్మద్ సోలీహ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వెంటనే ఈ ఒప్పందాలపై చర్చలు ప్రారంభించింది. హెలికాప్టర్లను వెనక్కు పంపకుండా దేశంలోనే వినియోగించుకోవాలని భావించింది. అయితేఇండియాతో సత్సంబంధాలకోసం సోలీహ్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు వ్యతిరేక ఫలితాలనే ఇచ్చాయి. ఇండియా వ్యతిరేకత అనే సెంటిమెంట్ కు అవి ఆజ్యం పోశాయనే చెప్పాలి. ద్వైపాక్షిక సంబంధాలుభౌగోళికతరెండు దేశాల ఆర్టిక అవసరాలతో ముడిపడి ఉన్నప్పటికీ మౌలికంగా ఈ అంశం మరీ అంత క్లిష్టమైంది కాదు. రెండు దేశాలూ పరిణతితోనే వ్యవహరించాయి. ఇండో-పసిఫిక్మాల్దీవుల ప్రాంతం వ్యూహాత్మకంగా కీలకం. అమెరికా ఈ ప్రాంతంపట్ల ఆసక్తి చూపుతోంది. అప్రమత్తంగా ఉండాలి. అదలా ఉంచితేతన రక్షణవాణిజ్య ప్రయోజనాలకు మాల్దీవులకు ఇండియా అండదండలు అవసరం.


2022-01-09  International Desk