6tvnews

collapse
...
Home / ఆంధ్రప్రదేశ్ / ఏపీలో కరోనా కట్టడికి కఠిన చర్యలు

ఏపీలో కరోనా కట్టడికి కఠిన చర్యలు

2022-01-10  News Desk

CORONA VIRUS 2
ఏపీలో నైట్ కర్ఫ్యూ విధించింది ప్రభుత్వం. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్ననేపథ్యంలో జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. త్వరలో వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు జారీ చేయనుంది. థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీకి మాత్రమే అనుమతి ఇచ్చింది. సీటు మార్చి సీటుకు అనుమతించాలని చెప్పింది. మాస్క్‌ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

మాస్కులు ధరించకపోతే జరిమానాలు విధించాలని, కొవిడ్‌ నివారణ చర్యలను సమర్థంగా అమలు చేయాలని తెలిపింది. వ్యాపార సముదాయాల్లో కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, బస్సుల్లో ప్రయాణికులు మాస్కు ధరించేలా చూడాలని ఆదేశించింది. బహిరంగ కార్యక్రమాల్లో 200 మందికి.. ఇండోర్‌ కార్యక్రమాల్లో 100 మందికి మించకూడదని నిబంధనలు విధించారు.


2022-01-10  News Desk