ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరిగిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కేసులను వర్చువల్ విధానంలో విచారించాలని నిర్ణయించింది. కరోనా వ్యాప్తి అధికమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. సంక్రాంతి పండుగ సెలవుల తరువాత ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ఈ నెల 17 నుంచి వర్చువల్ విధానంలోనే కేసులను విచారించాలని అన్ని కోర్టులకు ఆదేశాలు జారీ చేసింది. కరోనా ఉధృతి తీవ్రంగా ఉన్నప్పుడు గతంలోనూ ఇదే తరహాలో ఆన్ లైన్ లోనే కేసుల విచారణ జరిగింది.