6tvnews

collapse
...
Home / లైఫ్ స్టైల్ / కళలు & సంస్కృతి / మరణించే అమ్మతోడు.. ఈ బిడ్డకు కావాలి జోడు..

మరణించే అమ్మతోడు.. ఈ బిడ్డకు కావాలి జోడు..

2022-01-12  Lifestyle Desk

date my daughter
 

ఆమెను మృత్యువు పిలుస్తోంది.. అత్యంత సమీపంలో ఉంది.. తాను మరణిస్తే తన కూతురు ఒంటరి అవుతుంది.. అలా కాకూడదు.. నా కూతురికి ఒక తోడు కావాలి.. ఆ తరువాతే నేను ప్రశాంతంగా చావాలి.. ఇది ఓ కన్నతల్లి ఆలోచన.. దీనిని ఆచరణలో పెట్టింది.. సామాజిక మాధ్యమాల తలుపు తట్టింది.. కూతురి కోసం తల్లి పడే తపన ప్రస్తుతం ఆసక్తి రేపుతోంది.. వివరాల్లోకి వెళితే..

మా ఇద్దరి కథ.. 

న్యూయార్క్ కు చెందిన బెత్ డే విస్ (61), మోలీ(30) లు తల్లీకూతుళ్లు. తల్లి డేవిస్ గత 14 ఏళ్లుగా రొమ్ము క్యాన్సర్ తో బాధ పడుతుంది. క్రమంగా ఆమె లో క్యాన్సర్ ముదిరి నాల్గవ దశకు చేరింది. కూతురు అంటే తనకు ప్రాణం. ఇంతకాలం తన కూతురిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది. అయితే ఆమె ఆవేదన ఒకటే.. జీవితానికి చివరి దశలో, మరణానికి అత్యంత చేరువలో ఉన్న తాను చనిపోతే తన కూతురికి దిక్కెవరు. ఈ ఆలోచన తనను క్యాన్సర్ కంటే ఎక్కువగా బాధించ సాగింది. దీనితో ఎలాగైనా తాను మరణించే లోపు తన కూతురికి ఒక తోడు చూడాలని నిర్ణయించుకుంది. తన ఆలోచనను వెంటనే ఆచరణలో పెట్టింది. ఇందులో భాగంగా వింగ్ మ్యాన్ అనే డేటింగ్ యాప్ ను  సంప్రదించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చెబుతూ తన కూతురికి తన తరువాత జీవిత కాలం తోడుంటే వ్యక్తి కావాలంటూ కోరింది.

కదిలించిన కథ.. 

 యాప్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ తల్లీకూతుళ్లు కథ యాప్ సి ఈఓ టీనా విల్సన్ ను కూడా తగిలింది. దీనితో ఈ కథకు మరింత ప్రచారాన్ని కల్పించి తన వంతు సహకారం అందించాడు. ఫలితంగా ఈ కథ చూపరులను కూడా కదిలించింది. మరణించే దశలో కూడా ఓ తల్లికి తన కూతురిపై మమకారానికి ప్రతీక గా ఈకథ నిలుస్తుంది. అమ్మ ఎవరికైన అమ్మే.. దీనికి దేశంవిదేశం అనే తేడా లేదు. మనిషిజంతువు అన్న మార్పులేదు. ప్రపంచంలో ఏ మూలన వెతికిన నిస్వార్ధంగా కనిపించేది ఒక అమ్మ ప్రేమ. ఈ కథ ద్వారా ఇది మరో సారి రుజువైంది. మరణించే ముందు ఈ అమ్మ కోరిన కోరిక తప్పకుండా నెరవేరాలనికూతురికి తగిన తోడు దొరకాలని ఈ కథను చదివిన ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.


2022-01-12  Lifestyle Desk