6tvnews

collapse
...
Home / బిజినెస్ / ఫైనాన్స్ / కార్పొరేట్ల ఐటీఆర్‌ చెల్లింపు గడువు పొడిగింపు

కార్పొరేట్ల ఐటీఆర్‌ చెల్లింపు గడువు పొడిగింపు

2022-01-12  Business Desk

income tax-1
 

కేంద్రప్రభుత్వం కార్పొరేట్ల ఇన్‌కం టాక్స్‌ రిటర్న్స్‌ ఫైలింగ్‌ను మార్చి 15 వరకు పొడిగించింది.  అలాగే 2020-21 ఆర్థిక సంవత్సరానికి టాక్స్‌ ఆడిట్‌ ఫైల్‌ రిపోర్టును ఫిబ్రవరి 15లోగా ఫైల్‌ చేయాల్సి ఉంటుంది. కార్పొరేట్లకు ఫైలింగ్‌ డెడ్‌లైన్‌ అక్గోబర్‌ నుంచి వరుసగా ఇది మూడోసారి పొడిగించారు.


ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటి) ఒక ప్రకటనలో పన్ను చెల్లింపుదారులు, భాగస్వాములు కోవిడ్‌ వల్ల ఎలక్ట్రానిక్ ఫైలింగ్‌లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అందుకే 2020-21 ఆర్థిక సంవత్సరం .. మదింపు సంవత్సరం 2021-22 గడువును మార్చి 15 వరకు పొడిగించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చింది.  

కార్పొరేట్లు తమ ఐటీఆర్‌ ఫైల్‌ చేయడానికి డెడ్‌లైన్‌ను మార్చి 15 వరకు, ఆడిట్‌ రిపోర్టును ఫిబ్రవరి 15లోగా ఫైల్‌ చేయాల్సి ఉంటుంది. 

అయితే ఉద్యోగులకు కానీ. వ్యక్తిగత ఆదాయం పన్ను చెల్లింపుదార్లకు కానీ.. చిన్న వ్యాపారస్తులు, నాన్‌ ఆడిటబుల్‌, నాన్‌ కార్పొరేట్‌ వ్యాపారాలు చేసుకొనే వారికి ఇవి వర్తించవని సీబీడీటి స్పష్టం చేసింది.  

 


2022-01-12  Business Desk