6tvnews

collapse
...
Home / వినోదం / తెలుగు / బోయపాటితో డిస్కషన్స్ ఉండవు

బోయపాటితో డిస్కషన్స్ ఉండవు

2022-01-12  Entertainment Desk

manabalayya

నటసింహ నందమూరి బాలకృష్ణసెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన సినిమా అంటే మాములు హ‌డావిడి కాదు. అందులోని హిట్ అయిన సినిమా అంటే మాములు విష‌యం కాదు. అలా ఈ మ‌ధ్య కాలంలో వ‌చ్చిన అఖండ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. డిసెంబర్ 2వ తేదీన ప్రారంభమైన ఈ చిత్రం ఇంకా థియేటర్లలో ప్రదర్శించబడుతూ.. 50 రోజుల పండుగను ఎంతో స‌క్సెస్‌ఫుల్‌గా జరుపుకొనేందుకు పరుగులు పెడుతోంది. ఇలాంటి పండుగ లాంటి వాతావరణంలో అఖండ చిత్ర యూనిట్ థ్యాంక్యూ మీట్ జరుపుకుంది.. ఈ సందర్భంగా బాలకృష్ణ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.బోయపాటి శ్రీనుతో సినిమా అంటే డిస్కషన్స్ ఉండవు. కట్టె.. కొట్టె.. తెచ్చే అనే విధంగా ఉంటుందని బాలయ్య అన్నారు.

బోయపాటి వచ్చి కథ చెప్పడం, వినడం ఇవ‌న్నీ ఉండ‌వు. ఇక సీన్లుసన్నివేశాల గురించి ప్ర‌త్యేక‌మైన చర్చ ఉండదు. బోయపాటి కథ చెప్పడానికి వస్తున్నాడంటే నేను తప్పించుకొని తిరుగుతాను. అందుకు కారణం ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకం. ఆ నమ్మకమే అఖండ లాంటి విజయాన్ని అందించింది అని బాలకృష్ణ అన్నారు. సినిమా చూసిన ప్రతీ ఒక్కడు కంటతడి పెట్టకుండా థియేటర్ నుంచి బయటకు రాలేదు. అఖండ చిత్రం ధర్మం గురించి చెప్పిన సినిమా. ఒక పాత్ర ధర్మాన్ని బోధిస్తే.. మరో పాత్ర ప్రకృతికి అండగా నిలుస్తుంది. అఖండ సినిమాను ఎలాగైనా థియేటర్లలో రిలీజ్ చేయాలని సాహోసోపేతమైన నిర్ణయాన్ని తీసుకొన్న నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేయాలి. సంక్రాంతి పండుగ సంబురాల్లో ఈ సినిమా భాగమైనందుకు చాలా హ్యాపీగా ఉంది అంటూ బాలకృష్ణ అన్నారు.

మ‌నం చెప్పినా వాళ్లు వినరు

అలాగే టికెట్ల విష‌యంలో కానీ ఎలాంటి స్పంద‌న లేని బాల‌య్య ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అఖండ మూవీ థ్యాంక్స్ మీట్‌లో ఓ విలేఖ‌రి అడిగిన ప్ర‌శ్న‌కి అస‌హ‌నంగా స‌మాధాన‌మిచ్చారు. టికెట్ల విష‌యంలో మీరు మ‌ధ్య‌వ‌ర్తి వ‌హించొచ్చుగా అన్న ప్ర‌శ్న‌కు మ‌నం చెప్పినా అక్క‌డ వినే నాధులులెవ్వ‌రు అని ఆయ‌న స‌మాధాన‌మిచ్చిరు. ఒక వేళ పెద్ద‌రికం తీసుకుని స్పందినప్ప‌టికీ ఎవ్వ‌రూ కూడా కేర్ చెయ్య‌రని ఆయ‌న స్పష్టంగా చెప్ప‌క‌నే చెప్పారు. మ‌రో విలేఖ‌రి ఏపీ మంత్రి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల పై మీరేమంటారు అని అడ‌గ‌గా.. దానికి అది ఇప్పుడు మాట్లాడే స‌మయం కాదు ఇది స‌రైన వేదిక కాదని సింపుల్గా తేల్చేశారు. కాగా అఖండ చిత్రం అన్ని చోట్ల బ‌య్య‌ర్ల‌కి మంచి లాభాలు తెచ్చిపెట్టి 2021లో ఒన్ ఆఫ్ ది హైయ్య‌స్ట్ గ్రాస్ ఆఫ్ క‌లెక్ష‌న్స్ మూవీగా బాల‌కృష్ణ కెరియ‌ర్‌లో ఈ చిత్రం నిలిచిపోయింది. చాలా చోట్ల అర్ధ శ‌త దినోత్స‌వం జ‌రుపుకునేందుకు రెఢీ అవుతుంది.

కరోనావైరస్ విలయతాండవం చేస్తున్న విపత్కర పరిస్థితుల్లో కూడా ఏపీలో టికెట్ రేట్ల వివాదం మధ్య ఎవరూ సినిమాలను విడుదల చేయాడానికి సాహసించని నేపథ్యంలో అఖండ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అఖండ సినిమాను ఎలాగైనా థియేటర్లలో రిలీజ్ చేయాలని సాహోసోపేతమైన నిర్ణయాన్ని తీసుకొన్న నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేయాలి.


2022-01-12  Entertainment Desk