6tvnews

collapse
...
Home / బిజినెస్ / ఆటోమొబైల్ / ఆ కార్లకు ఎందుకంత డిమాండ్ ?

ఆ కార్లకు ఎందుకంత డిమాండ్ ?

2022-01-13  Business Desk

 

second hand
 

ప్రపంచాన్ని మళ్లీ కరోనా గడగడ లాడిస్తోంది. ప్రస్తుతం ఒమిక్రాన్‌ రూపంలో పలు అగ్రరాజ్యాలను వణికిస్తోంది. మనదేశంలోని మెట్రోనగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు నగరాలను కరోగా గడగడ లాడిస్తోంది. రోజు రోజుకు కేసులు పెరగడమే తప్ప తగ్గముఖం పట్టిన దాఖలాల్లేవు.   

కరోనా మహమ్మారితో ప్రజల జీవన విధానాలు కూడా పూర్తిగా మారిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా సెకండ్‌ హ్యాండ్‌ కార్ల అమ్మకాలకు డిమాండ్‌ బాగా పెరిగిపోయింది. ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణిస్తే కరోనా సోకుతుందన్న ఆందోళనతో ప్రైవేట్‌ కార్లను కొనుగోలు చేస్తున్నారు. ఇక మన భారతదేశానికి వస్తే ఇక్కడ వినియోగదారులు సెకండ్‌ హ్యాండ్‌ కార్లు కొనుగోలు చేయడానికి మొగ్గుచూపుతున్నారు. దీంతో ఈ సెకండ్‌ హ్యాండ్‌ కార్లు విక్రయించే కంపెనీలు బిలియన్‌ డాలర్ల కంపెనీలుగా అవతరించాయి. ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే సెకండ్‌ కార్ల అమ్మకాలు తగ్గేదేలే అనే స్థాయిలో కొనసాగుతున్నాయి.   

  కరోనా తర్వాత పెరిగిన సెకండ్‌ హ్యాండ్‌ కార్ల అమ్మకాలు  

కరోనా తర్వాత ప్రజల అభిరుచుల్లో పెను మార్పులు వచ్చాయి. వాస్తవం చెప్పాలంటే గతంతో పోల్చుకుంటే సెకండ్‌ హ్యాండ్‌  కార్ల అమ్మకాలు బాగా పెరిగాయని స్పిన్నీ వ్యవస్థాపకుడు సీఈవో నీరజ్‌ సింగ్‌ చెప్పారు.సెకండ్‌ హ్యాండ్‌ కార్లు అమ్మే కంపెనీలు గత డిసెంబర్‌ నాటికి ఇండియా యూనికార్న్‌ క్లబ్‌లో చేరాయని (యూనీకార్న్‌) అంటే బిలియన్‌డాలర్ల కంటే ఎక్కువ వ్యాపారం చేసే కంపెనీలు లేదా రూ.7,500 కోట్ల వ్యాపారం చేసే కంపెనీలను యూనీకార్న్‌గా సంబోధిస్తారు. కోవిడ్‌ నిబంధనలు కఠినతరం చేయడంతో సెకండ్‌ హ్యాండ్‌ కార్లకు డిమాండ్‌ బాగా పెరిగిందని సింగ్‌ అన్నారు.   

ఈ ఏడాది కూడా కార్ల అమ్మకాలు జోరే!  

ఈ ఏడాది కూడా యూజ్డ్‌ కార్ల అమ్మకాలు ఊపందుకుంటాయని సింగ్‌ అంచనా వేశారు. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది కస్టమర్లు సొంత వాహనం ఉంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో  బాగా అర్ధం చేసుకున్నారని చెప్పారు.   

విస్తరణ బాటలో స్పిన్ని  

ఇదిలా ఉండగా స్పిన్నిని మరింత విస్తరించాలనుకుంటున్నట్లు సింగ్‌ చెప్పారు. పట్టణాలతో పాటు చిన్న నగరాలకు తమ కంపెనీని విస్తరించాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది దీనికి శ్రీకారం చుట్టబోతున్నట్లు పేర్కొన్నారు. స్పిన్నిని 2015లో ప్రారంభించానని చెప్పారు సింగ్‌. ప్రస్తుతం 15 నగరాల్లో తన సెకండ్‌హ్యాండ్‌ కార్ల వ్యాపారం కొనసాగుతోందన్నారు. ఢిల్లీ, ముంబైల్లో కూడా తన షోరూంలున్నాయన్నారు.   

ఆటో మొబైల్‌ ఈ -కామర్స్‌ ప్లాట్‌పాం చీఫ్‌ స్ర్టాటజీ ఆఫీసర్‌ అక్షయ్‌ సింగ్‌కు చెందిన డ్రూమ్‌ .. ఇది కూడా యూనీకార్న్‌ కంపెనీ మాట్లాడుతూ ఈ ఏడాది కూడా సెకండ్‌ హ్యాండ్‌ కార్ల అమ్మకాల్లో జోరు తగ్గందని స్పష్టం చేశారు. దేశంలో  ప్రస్తుం కోవిడ్‌ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు వ్యక్తిగత రవాణా సాధనాల వైపే మొగ్గు చూపుతారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు షేరింగ్‌ ఆటోలు, స్కూటర్లను పక్కన పెడతారని ఆయన తెలిపారు. మొత్తానికి మన దేశంలో సెకండ్‌ హ్యాండ్‌ కార్లు అమ్మే కంపెనీలు కూడా బిలియన్‌ డాలర్ల కంపెనీలుగా మారడాన్ని బట్టి చూస్తే దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని చెప్పవచ్చునని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.   


 


2022-01-13  Business Desk