6tvnews

collapse
...
Home / వినోదం / తెలుగు / వెరీ ఫ్రూట్ ఫుల్ మీటింగ్

వెరీ ఫ్రూట్ ఫుల్ మీటింగ్

2022-01-13  Entertainment Desk

Chiru jagan
సీఎం జగన్ తో జరిపిన చర్చలు సంతృప్తికరంగా జరిగాయని మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. త్వరలోనే అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం వస్తుందనే నమ్మకం తనకుందని చిరంజీవి ధీమా వ్యక్తం చేశారు. అన్ని సమస్యలను సీఎం గారి దృష్టికి తీసుకువెళ్లానని..వాటన్నిటినీ పరిగణలోకి తీసుకున్నారని చిరంజీవి తెలిపారు. పరిశ్రమనుంచి, ఎగ్జిబిటర్ల నుంచి, కార్మికుల సమస్యలు అన్నీసీఎం జగన్ వద్ద ప్రస్తావించానని మెగాస్టార్ వివరించారు. తాను చేసిన సూచనలను కమిటీ ముందు పెడతానని, కమిటీ రిపోర్టు వచ్చిన తర్వాత తనను మరోసారి ఆహ్వానిస్తానని సీఎం తెలిపినట్లు చిరంజీవి వివరించారు. 

దంపతులిద్దరికీ ధన్యవాదాలు 

పండగ పూట విందు భోజనానికి ఆహ్వానించి నాతో సంభాషించిన తీరు, తనపై ఆప్యాయత కనబరిచిన విధానం కానీ..అత్యంత సంతృప్తినిచ్చినట్లు చిరంజీవి తెలిపారు. శ్రీమతి భారతిగారు దగ్గరుండి వడ్డించడం చాలా ఆనందంగా ఉందని చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. దంపతులిద్దరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని మెగాస్టార్ తెలిపారు.


2022-01-13  Entertainment Desk