6tvnews

collapse
...
Home / ఆంధ్రప్రదేశ్ / ఏపీలో మరే సమస్యలూ లేవా?

ఏపీలో మరే సమస్యలూ లేవా?

2022-01-13  News Desk

AP CM Jagan
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలువాదాలువివాదాలువిమర్శలను లోతుగా పరిశీలిస్తే విభజనానంతర రాష్ట్రానికి ఏ సమస్యలూ లేవా అనే సందేహం కలుగుతోంది. ఆర్థిక సమస్యలుతక్షణ జీవిత సమస్యలు ఇవన్నీ పక్కకు పోయి సినిమా టిక్కెట్ల ధరలపైనే మొత్తం ప్రతిపక్షాలుఆయా పార్టీల అభిమానులుమీడియా కేంద్రీకరించి చర్చోపచర్చలు చేస్తున్నాయి. ఇది పరోక్షంగా అధికారంలో ఉన్న పార్టీకి ఎంత మేలు చేస్తోందంటే రోజువారీ పాలనలో ఎదురవుతున్న సమస్యలను ప్రస్తావించే వారే లేకుండా పోతున్నారు. 

ప్రతిపక్షాలుప్రభుత్వంమీడియావివిధ సామాజిక బృందాలుప్రజానీకం కలిసి రాష్ట్రంలో ఎలాంటి మౌలిక సమస్యలూ లేవనిపించేలా సంచలనాత్మక అంశాల చుట్టూనే తిరుగుతూ కాలం వెళ్లబుచ్చుతున్నాయి. చిన్న ఉదాహరణ చూద్దాం. గత నెలరోజులుకు పైగా ఏపీ రాజకీయం మొత్తంగా సినిమా టిక్కెట్ల ధరల తగ్గింపుపైనే నడుస్తోందంటేసకల మీడియా మాధ్యమాలు దీనికి మించిన సమస్య మరేదీ లేదనేలా ఈ ఒక్క అంశంపైనే చర్చను కొనసాగిస్తున్నాయంటే ఏపీ రాజకీయం ఎక్కడ చిక్కుకుని పోయిందో అర్థమవుతుంది. 

క్రియాశీలక ప్రతిపక్షమెక్కడ

నిత్యావసర ధరలను పట్టించుకునే వారు లేరు. పెట్రోలు ధరలపై ఆందోళనల ఊసేలేదు. మౌలిక వసతుల కల్పనకు అత్యవసరమైన సిమెంట్ఇసుకఇటుకలుఉక్కుఇనుము వంటి ఉత్పత్తుల ధరలు చుక్కలుంటుతున్నా అడిగే నాథుడే లేడు. ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గృహ నిర్మాణ పథకం అడుగు ముందుగు కదలకపోయినా ఎవరికీ పట్టదు. ఇక సంవత్సరాలుగా నానుతున్న అమరావతిమూడు రాజధానులుపోలవరం వంటి కీలక అంశాలను ప్రభుత్వంప్రతిపక్షాలే కాదు.. చివరకు ప్రజలు కూడా దాదాపుగా మర్చిపోయినట్లుంది. ఏ చిన్న సమస్య ఎదురైనా సరే తామున్నామంటూ ప్రజల తరపున వాణి వినిపిస్తూ వీధుల్లోకి వచ్చి ఆందోళనలు నిర్వహించాల్సిన ప్రతిపక్షం కానీవామపక్షాలు కానీ మౌనం పాటిస్తున్న వాతావరణం ఇప్పుడు ఏపీలో రాజ్యమేలుతోందంటే అతిశయోక్తి కాదు.

ఒకప్పుడు రాజకీయ పక్షాలు సమస్యలను విస్మరిస్తే ప్రజల పక్షాన నిలిచి గంటలకొద్దీ చర్చలు కొనసాగిస్తూ అధికారంలో ఉన్న పార్టీని నిలదీస్తూ ప్రజలను చైతన్యపరిచిన మీడియా ఇప్పుడు ఏపీలో రెండుగా చీలిపోయి అనవసర అంశాలపై పొద్దు పుచ్చుతూ ప్రజాజీవితాన్ని ఎంటర్‌టైన్ చేస్తూండటం కంటే మించిన ఘోరం మరొకటి లేదనిపిస్తుంది. సినిమాకు మించిన తక్షణ సమస్య మరొకటి లేదన్నట్లుగా రాత్రింబవళ్లు ఏపీలో తగ్గించిన సినిమా టిక్కెట్ల ధరలపై సినీ ప్రముఖుల వివాదాస్పద ప్రసంగాలపై చర్చలు కొనసాగించడం అనేది ప్రజాచైతన్యాన్ని మొద్దుబారుస్తోంది. 

సంచలనాత్మక అంశాలకే పెద్దపీట

ఈ పరిణామాల నేపథ్యంలో అటు ప్రభుత్వమూ పట్టించుకోకఇటు ప్రతిపక్షాలూ వీధుల్లోకి రాకప్రజలూ తమ సమస్యలపై స్పందించక ఏపీ రాజకీయం వినోదప్రాయమైన ఘటనల చుట్టూ తిరుగుతోంది. మీడియా ప్రేరేపించే సంచలనాత్మక అంశాల చుట్టూనే మన రోజువారీ జీవితం తెల్లారిపోతోందంటే ప్రజాస్వామ్యానికివ్యవస్థ మనుగడకు అంతకుమించిన ప్రమాదం లేదు. ఇప్పటికే సంక్షేమ పథకాల చుట్టూనే తిరుగుతూ నిర్మాణసేవారంగాల్లో అభివృద్ధికి అత్యవసరమైన పెట్టుబడి కల్పనలో ఏపీ వెనుకబడిపోయింది. ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్షం నాలుగు రాళ్లేయడంవాటిని తిప్పి కొడుతూ ప్రభుత్వం అంతా పారా హుషార్ అనే చందాన బతికేస్తుంటే ప్రజల మౌలిక సమస్యలు గాల్లో కలిసిపోక తప్పదు.

కదిలిక లేని ప్రభుత్వం

ఇవన్నీ పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పంచిపెడుతున్న ప్రభుత్వ నిధుల వల్ల ఏపీ ప్రజల సమస్యలన్నీ తీరిపోయి వినోదాత్మక అంశాలకు ప్రాధాన్యమిస్తున్నారనే ప్రమాదకర భావన బలపడుతోంది. ప్రపంచీకరణ ప్రభావ పలితంగా గత కొన్ని దశాబ్దాలుగా ప్రజలువివిధ సామాజిక బృందాలు సమస్యల పరిష్కారం కోసం వీధుల్లోకి రావడం ఆపేశారు. రాజకీయ పార్టీలు మొక్కుబడిగా చేసే పోరాటాలు ప్రభుత్వాన్ని స్పందింప జేయడం లేదు. ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్రం సస్య శ్యామలంగా ముందుకెళుతోందనే ప్రభుత్వ వాణి మాత్రమే మిగిలి తామేం చేసినాచేయకున్నా చెల్లిపోతుందని పాలకులు భావించే కాలం ఏర్పడటానికి ఎన్నో రోజులు పట్టదు.

ప్రజలు తమ సమస్యలపై కదలనంతవరకుప్రతిపక్షాలు మొక్కుబడి పోరాటాలు మాని ప్రత్యక్ష పోరాటంలోకి దిగనంతవరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇలాగే తిరుగుతుంటాయి. ఇది రాజకీయ పక్షాలకుప్రజలకు కలిగించే ప్రమాదం కంటే ప్రజాస్వామ్య వ్యవస్థ చలనానికి కలిగించే ప్రమాదమే ఎక్కువనిపిస్తుంది. అందుకే పాలకులుప్రతిపక్షాలుమీడియా కాదు.. ప్రజలు పారాహుషార్‌గా ఉంటూ, తన దైనందిన జీవిత సమస్యల పట్ల బాధ్యత పడాల్సినస్పందించవలసిన సమయం ఆసన్నమైంది.


2022-01-13  News Desk