6tvnews

collapse
...
Home / ఆరోగ్యం / మహిళల ఆరోగ్యం / నాప్కిన్‌ ఫ్రీ గ్రామంగా కేరళ కుగ్రామం

నాప్కిన్‌ ఫ్రీ గ్రామంగా కేరళ కుగ్రామం

2022-01-14  Health Desk

cups 2
 

కేరళలోని ఓ చిన్న గ్రామంలో రికార్డు బద్దలు కొట్టింది. ఎర్నాకుళం జిల్లాలోని ఓ చిన్న గ్రామం కుంబలాంగి దేశంలోనే మొట్టమొదటి నాప్కిన్‌ ( మహిళలు నెలసరికి వాడే ప్యాడ్‌) ఫ్రీగా రికార్డు సాధించిందని కేరళ గవర్నర్‌ అరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌చెప్పారు.      

సుమారు 5,000 మేనుస్ట్రుల్ కప్‌లను బాలికలకు, మహిళలకు పంపిణీ చేసి వారికి సుమారు మూడు నెలల పాటు వలంటీర్లు శిక్షణ ఇచ్చారు. ఈ కప్‌లు వినియోగించడం వల్ల ప్రయోజనాల గురించి  నిర్వాహకులు  మహిళలకు అర్ధమయ్యేలా వివరించారు.      

అందరమైన ఈ చిన్న గ్రామం కుంబలాంగి ఇతరులకు రోల్‌మోడల్‌ కావాలని ఆకాంక్షించారు గవర్నర్‌.. ఇలాంటి స్కీం వల్ల మహిళల్లో సాధికారిత పెరుగుతుంది మనోధైర్యాన్ని ఇస్తుందన్నారు. దీంతో గ్రామాలే కాదు. మన దేశం కూడా అభివృద్ది చెందుతాయని గవర్నర్‌ తన ప్రసంగంలో చెప్పారు.      

ఎర్నాకుళం ఎంపీ హిబీ ఈడెన్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ, "అవెల్కీ' అంటే ఆమెకు అని అర్ధం .. దీన్ని ప్రధానమంత్రి సంసద్‌ ఆదర్శ గ్రామ యోజన కింది ప్రచారం మొదలుపెట్టారు.  ఈ పథకంపై గత కొన్ని నెలల నుంచి పెద్ద ఎత్తున  పనిచేశామని ఎంపీ చెప్పారు. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, హిందుస్తాన్‌ లైఫ్‌ కేర్‌ లిమిటెడ్‌  మేనేజ్‌మెంట్‌ అకాడమీలను కూడా భాగస్వాములు చేశామన్నారు ఎంపీ. తమ ప్రధాన ఉద్దేశం మహిళలు మేనుస్ట్రుల్  కప్‌లను వినియోగించడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు పొందుతారు అనే విషయం మహిళలకు వివరించిచెప్పి వారి భయాలను తొలగించామని వివరించారు. ఈ తరహా కప్స్ ఇప్పటికే కెన్యా లాంటి పలు దేశాల్లో మహిళల ఆదరణ చూరగొన్నాయి.     

పర్యావరణకు అనుకూలం     

ఎంపీ మాట్లాడుతూ సింథటిక్‌ నెప్కిన్‌ వల్ల పర్యావరణానికి హాని చేకూరుతుందని.. మహిళలు లేదా విద్యార్థులకు ఈ కప్‌ల ద్వారా వ్యక్తిగత శుభ్రత చేకూరుతుందన్నారు. చాలా మంది ఈ ప్రాజెక్టుకు సహకరించారన్నారు. వారిలో సినీ నటి పార్వతి కూడా తమకు సహాయ సహకారాలు అందించారన్నారు.      

నెప్కిన్‌ వెండింగ్‌ మిషన్‌లను పలు స్కూల్స్‌లోఏర్పాటు చేసినా సాంకేతిక లోపాల కారణంగా పలు ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు ఎంపీ. దీంతో మహిళలకు కప్‌లను అందజేస్తే ఎలా ఉంటుందో అనే ఆలోచన రావడం దీనిపై పెద్ద ఎత్తున అధ్యయనం చేయడం, వెంటనే నిపుణల సలహా తీసుకోవడం జరిగిందన్నారు. దీనికి నిపుణులు చెప్పిన విషయం ఏమిటంటే కప్‌లను కొన్ని సంవత్సరాల పాటు వాడుకోవచ్చు. పరిశుభ్రంగా కూడా ఉంటుందని తెలిపారు యువ పార్లమెంటేరియన్‌.      

శుభ్రతతో పాటు సురక్షితం...     

నిపుణుల అంచనా ప్రకారం మేనుస్ర్టుల్‌ కప్‌లు సురక్షితం తో పాటు వ్యక్తిగత శుభ్రత కూడా ఉంటుందని చెబుతున్నారు. సాధారణంగా మహిళలు వాడేప్యాడ్‌ కంటే కప్‌లు సురక్షితం.. కాగా ఈ కప్‌లు మెడికల్‌ గ్రేడ్‌ సిలికాన్‌, లాటెక్స్‌తో తయారు చేయబడింది. పది సంవత్సరాల పాటు పనిచేస్తాయి. అతి తక్కువ ఖర్చుతో పర్యావరణానికి అనుకూలమైన ప్రాడక్టు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనమూ మారాలని  ఎంపీ అన్నారు. ముందుగా కోచి తీరప్రాంతాల్లో వీటిని పంపిణీ చేసి శిక్షణ కూడా ఇచ్చామన్నారు.      

కుంబలాంగి అనే చిన్న గ్రామం కోచి శివార్లలో ఉంటుంది. ఒక ద్వీపం లాంటి గ్రామం ...చుట్టూ నీటితో నిండి ఉంటుంది. దేశంలో మొట్టమొదటి  ఈకో టూరిజం గ్రామంగా పేరుకెక్కింది. సంప్రదాయ చైనీస్‌ నెట్స్‌గా ఈ ప్రాంతానికి పేరుంది.       


2022-01-14  Health Desk