6tvnews

collapse
...
Home / జాతీయం / History: సంక్రాంతి వేళ ... మరాఠా వీరులకు చేదు అనుభవం

History: సంక్రాంతి వేళ ... మరాఠా వీరులకు చేదు అనుభవం

2022-01-14  News Desk

matata
 

 

మూడవ పానిపట్ యుద్ధం. భారత దేశ చరిత్రలో మరుపురాని ఘట్టం. మరాఠా వీరుల పోరాట పటిమ దురాక్రమణదారు, దోపిడీదారు అయిన ఆఫ్ఘన్ పాలకుడు అబ్దాలీ మొరటు సైనుకలతో జరిగిన ఈ పోరాటం 18 శతాబ్దంలో ప్రపంచంలోనే అత్యంత ఘోరమైనదనిగా పేరు సంపాదించిందీ పానిపట్ పోరాటం. ఈ పోరాటంలో ప్రారంభంలో మరాఠా వీరులు విజయం దిశగా సాగినా చివరికి ఆఫ్ఘన్ మూకలను అడ్డుకోలేకపోయాయి.  

పీష్వా సదాశివరావు భావు 

అది 1761వ సంవత్సరం. జనవరి 14వ తేదీ. మకర సంక్రాంతి సమయం. పీష్వా వంశానికి చెందిన సైనికాధికారి సదాశివరావు భావు. ఆ సమయంలో ఆఫ్ఘన్ పాలకుడు అహ్మద్ షా అబ్దాలీ మరో సారి ఇండియాపై దురాక్రమణకు తెగబడ్డాడు. దోపిడీ చేయడమే లక్ష్యంగా అబ్దాలీ అప్పటికే మూడు సార్లు (1749, 1752, 1757 – ఈ సమయంలోనే ఆయన సైన్యం ఢిల్లీ వరకు చొరబడగలిగింది. మొఘల్ పాలనలో 200 ఏళ్ల సంపద మొత్తాన్ని దోచుకెళ్లాడు.) ఇండియాపై సైన్యాన్ని నడిపించాడు. ఆయనకు నజీబుద్దౌలా, రోహిల్లా నాయకులు హఫీజ్ రెహమత్, దుండే ఖాన్, ఇంకా అవధ్ నవాబు షుజావుద్దౌలా అండగా నిలిచారు. ఇలాంటి శత్రువును దేశంలోని ప్రతి ఒక్కరూ ప్రతిఘటించాల్సిన అవసరం ఉందని ఆనాటి పీష్వా సదాశివరావు భావు అభిప్రాయపడ్డారు.  

ఆఫ్ఘన్ ముష్కరులను అడ్డుకున్న మరాఠాలు 

ఢిల్లీ వరకు ఆఫ్ఘన్ ముష్కరులు చేరకుండా అడ్డుకునే బాధ్యతను మరాఠా వీరులు, సదాశివరావు భావు చేపట్టారు. 1758లో ఆఫ్ఘన్ మూకలను లాహోర్ నుంచి వెనక్కి తిప్పకొట్టగలిగారు. పరిసరాలలో మరాఠా పతాకం ఎగురవేయగలిగారు. అదే సమయంలో ఇరాన్ చక్రవర్తి షా కు పంపిన రహస్య సందేశంలో అవతలి వైపునుంచి ఆఫ్ఘన్ భూభాగంపై దాడి చేయాలని సూచించాడు. ఈ క్లిష్ట సమయంలోనే నజీబ్ సాయం తీసుకోవడం మంచిదని సూచించాడు. అయితే నజీబ్ వీరికి ద్రోహం చేసి ఆఫ్ఘన్ల వెంట నిలిచాడు. అలాగే అవధ్ పాలకుడు షౌజుద్దౌలా (ఈయన తండ్రి మరాఠా ప్రాపకంతో స్థిరపడినవాడే, అయినా) అడ్డంతిరిగాడు.  

స్థానిక రాజుల అనైక్యతతో…. 

ఇక ఈ ఆఫ్ఘన్ పాలకుడు అబ్దాలీ నిజానికి ఏ పాలకుడు కాదు. 1737 వరకు నాదిర్ షా వద్ద సహాయకుడు. ఆయన మరణానంతరం తనను తాను పాలకుడుగా ప్రకటించుకున్నాడు. అప్పటికే నానాసాహెబ్ పీష్వా, ఆయన సన్నిహితుడు సదాశివ రావు భావు నిజాం పాలకులపై విజయం సాధించి ఆ రాజ్యాన్ని అధీనంలోకి తెచ్చుకున్నారు. ఉత్తర దిశగా అబ్దాలీ దాడుల గురించి తెలియగానే సదాశివరావు స్వయంగా నాయకత్వం వహించి యుద్ధ భూమికి కదిలాడు. ఉత్తరాదిన ఉన్న ఇతర రాజులందరి సహకారం కోరాడు. కానీ స్థానిక రాజులు అందరూ కలిసి రాలేదు. ఫలితంగా 1761 జనవరి 14 (మకర సంక్రాంతి వేళ) నేరుగా అబ్దాలీ సైన్యంపై దాడి చేశాడు. సైనికుల సంఖ్య చూస్తే ఆఫ్ఘన్ బలగం చాలా ఎక్కువ. బాంబుల దాడులు, సైనికుల వీరావేశం మనధ్యాహ్నం అయ్యే సరికి బలహీనమై పోయింది. మరాఠాల ప్రతాపం ముందు చాలా మంది ఆఫ్ఘన్ సైనికులు లొంగిపోయారు. అయితే మధ్యాహ్న సమయానికి వారంతా మళ్లీ ఎదురుతిరిగి మరాఠా సైన్యంపై భీకరంగా దాడులు చేశారు. సదాశివరావు భావూ చివరి క్షణం వరకు పోరాడి ప్రాణాలు కోల్పోయాడు.  

సంక్రాంతి అనగానే దేశ చరిత్రలో గుర్తుకొచ్చేది…ఆఫ్ఘన్ ముష్కరుల దాడి. 


 


2022-01-14  News Desk