6tvnews

collapse
...
Home / బిజినెస్ / ఎనర్జీ / గ్రీన్‌ ఎనర్జీలో రిలయన్స్‌ పెట్టుబడులు

గ్రీన్‌ ఎనర్జీలో రిలయన్స్‌ పెట్టుబడులు

2022-01-14  Business Desk

 

mukesh ambani-1
 

రిలయన్స్‌ ఇండస్ట్రీస్ గుజరాత్‌ ప్రభుత్వంతో ప్రాథమికంగా ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో రూ.5.95 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించింది. ప్రధానంగా గుజరాత్‌లో గ్రీన్‌ ఎనర్జీపై ఈ పెట్టుబడులు పెడుతుంది.  

 

నెట్ జీరో కార్బన్ ఫ్రీ రాష్ట్రంగా గుజరాత్ 

దీంతో గుజరాత్‌ నెట్‌ జీరో- కార్బన్‌ ఫ్రీ  రాష్ట్రంగా మారిపోతుంది. 2050నాటికి భారత్‌ నెట్‌ జీరో కార్బన్‌ ఫ్రీ దేశంగా మారిపోవాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల జరిగిన అంతర్జాతీయ వేదికలపై  ప్రధాని మోదీ హామీ కూడా ఇచ్చారు.  

 

దీంతో ముఖేష్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ వచ్చే పది నుంచి పదిహేను సంవత్సరాల్లో రాష్ర్టంలో రూ. 5 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టి 100 గిగావాట్ల రెన్యూవబుల్‌ పవర్‌ ప్లాంట్‌ను, గ్రీన్‌ హైడ్రోజన్‌ ఈకో సిస్టమ్‌ను అభివృద్ది చేస్తామని రిలయన్స్‌  తెలిపింది. 

   

భూ సేకరణ 

గుజరాత్‌ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ముందు 100 గిగావాట్ల రెన్యూవబుల్‌ ఎనర్జీ ప్రాజెక్టుకు కచ్‌, బనస్‌కాంతా, దేలోలా ప్రాంతాల్లో  భూసేకరణ ప్రారంభిస్తాయని కంపెనీ ప్రకటనలో పేర్కొంది.  అలాగే కచ్‌ ప్రాంతంలో ఈ ప్లాంట్‌ ప్రారంభించడానికి సుమారు 4.5 లక్షల ఎకరాల భూమి కావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిందని తెలిపింది.  

 

 పది లక్షల మందికి ఉపాధి 

రెన్యూవబుల్‌ ఎనర్జీలో పెద్ద ఎత్తున పెట్టుబడుల వల్ల రాష్ర్టంలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సుమారు పది లక్షల మందికి ఉపాధి కల్పించవచ్చునని ప్రకటనలో వెల్లడించింది.  వైబ్రెంట్‌ గుజరాత్‌ 2022 పెట్టుబడుల ప్రోత్సహం సందర్భంగా  రాష్ట్ర ప్రభుత్వంతో ఈ ఒప్పందం పై సంతకాలు జరిగాయి. 

 

గుజరాత్‌ విషయానికి వస్తే ప్రపంచంలోనే అతి పెద్ద రిఫైనరీ కాంప్లెక్స్‌ రిలయన్స్‌ కూడా గుజరాత్‌లోనే ఉంది. దాని వ్యవస్థాపకులు ముఖేష్‌ అంబానీ తండ్రి .. ధీరూబాయి అంబానీ స్వస్థలం కూడా గుజరాతే. 

 

చిన్న పరిశ్రమలకు చేయూత 

రెన్యూవబుల్‌ ఎనర్జీ.. లేదా పునరుత్పాదక ఇంధన కంపెనీల ద్వారా చిన్న మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్స హించవచ్చునని.. రెన్యూవబుల్‌ ఎనర్జీ ద్వారా కొత్త టెక్నాలజీకి మారిపోవచ్చునని వినూత్నమైన వ్యాపారాలు చేసుకోవచ్చునని కంపెనీ  తెలిపింది. 

 

రిలయన్స్‌ ఇండస్ట్రీస్ రూ.60వేల కోట్లతో సోలార్‌ పీవీ మోడ్యూల్స్‌ తయారీ కంపెనీని ఏర్పాటు చేస్తోంది. దీంతో  ఎలక్ట్రోలైజర్స్‌, బ్యాటరీస్‌,  ప్యూయెల్‌ సెల్స్‌ను ఉత్పత్తి చేస్తుంది.  

 

మరో రూ.25,000 కోట్లు ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులు విస్తరించడానికి, వచ్చే మూడు నుంచి ఐదు సంవత్సరాల్లో కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి వినియోగిస్తుందని ప్రకటనలో వివరించింది. దీంతో పాటు వచ్చే మూడు నుంచి ఐదు సంవత్సరాల కాలంలో రూ.7,500 కోట్లు జియో నెట్‌వర్క్‌ అప్‌గ్రేడ్‌ చేయడానికి వినియోగిస్తుంది. జియో త్వరలోనే 5జీ నెట్‌వర్కుకు మారిపోవాలని చూస్తోంది. దీంతో పాటు మరో రూ.3,000 కోట్లు వచ్చే ఐదు సంవత్సరాల కాలానికి రిలయన్స్‌ రిటైల్‌లో పెట్టుబడులు పెడుతుంది.  

 

గత కొన్ని నెలల నుంచి రిలయన్స్‌ ఇండస్ట్రీస్ తమ కొత్త ఎనర్జీ వ్యాపారం కోసం పెద్ద ఎత్తున పలు టేకోవర్లకు పాల్పడుతోందని ప్రకటనలో వివరించింది. అలానే హోటల్‌ ఇండస్ర్టీస్‌లో ప్రవేశించింది. న్యూయార్కులోని ఓ విలాసవంతమైన హోటల్‌ను టేకోవర్‌ చేసింది. అంతకు ముందు లండన్‌లో కూడా ఓ పెద్ద హోటల్‌ను బిడ్‌లో పాల్గొని  హస్తగతం చేసుకుంది.  


 


2022-01-14  Business Desk