6tvnews

collapse
...
Home / వినోదం / తెలుగు / చిరంజీవి పై బహిరంగ లేఖ

చిరంజీవి పై బహిరంగ లేఖ

2022-01-14  Entertainment Desk

chiru
ఆ నటుడు నేడు సినీపరిశ్రమలో రెక్కలు తెగిన పక్షి.!
కాలిపోయిన కార్బన్ లాంటివాడు.!
వెలసిపోయిన రంగుల వాల్ పోస్టర్ లాంటివాడు.

గతంలో అతనంటే సినీపరిశ్రమలో ఉన్న భయము గౌరవం ఆదరణ ఉండేవి, కానీ నేడు అతని గురించి మీడియా ద్వారా మరియు బయట అందరూ అనుకుంటున్నంత ఆదరణ గౌరవం లేదు.

అతను ఇప్పుడు సినీపరిశ్రమలో బయటకు కనిపించని ఏకాకి.
ఇప్పటికే సినీపరిశ్రమలోనూ బయట చాలామందికి ఆ విషయం తెలుసు, ఇది పూర్తిగా బయటపడాలంటే ఇంకొంత సమయం పడుతుంది.
ఆ బుడగ త్వరలో పేలడం ఖాయం.!
కాకపోతే... బయట అమాయక నిరుపేద సామాన్య మధ్యతరగతి జనాలలోనూ విద్యావంతులుగా పెద్దలుగా సంపన్నులుగా చలామణీ అయ్యేవారిలో కూడా సహజంగా ఉండే సినీ వేలంవెర్రి ఉండడం సహజం.
ఈ వేలంవెర్రె కొంపముంచుతుంది దిగజారుస్తుంది.
అందరికీ ఉన్నట్లే అతనికి కూడా అతనికున్న వ్యక్తిగత కుటుంబ ఇబ్బందులు వత్తిడిలు అతనికున్నాయి.
అతను మొఖమాటస్తుడు, బిడియస్తుడు, భయస్తుడు, పిరికివాడు, అతను ఉండాల్సిన స్థాయిలో హుందాగా పెద్దరికంగా ఉండడం అతనికి తెలియడంలేదు.
అతనిలో ఇంకా డబ్బు యావ, పదవుల వ్యామోహం, కీర్తి ఖండూతి రోజురోజుకూ తగ్గాల్సిందిపోయి పెరుగుతోంది, అవే అతనిని దిగజారుస్తున్నాయి.

అతనిపట్ల అతని కులంలో గతంలో ఉండే ఆదరణ గౌరవం మర్యాద ఈరోజు అతనికి లేవు. అతనిని నమ్మి అతనిని అనుసరించి ఆ కులం రాజకీయంగా పూర్తిగా కోలుకోలేని విధంగా దెబ్బతినిపోయింది, మరలా అతనిని నమ్మి అతని వెంట పరిగెత్తడం అసంభవం.
ఆ కులంలో అతనికంటే అతని తమ్ముడంటేనే కొద్దోగొప్పో నమ్మకం గౌరవం ఉంది.

సినీనటులను చూడడానికి వచ్చేవాళ్ళు అందరూ ఓట్లేస్తే ఈపాటికి దేశంలో పార్లమెంటు అసెంబ్లీలలో అందరూ నటులే ఉండేవారు.
అలాగే ఆనాడు అతను పార్టీ పెట్టి ప్రచారంకి వెళితే అతని పార్టీలో చేరిన విద్యావంతులు ధనికులు డాక్టర్లు లాయర్లు, అతనిని చూడడానికి వచ్చిన జనం అందరూ ఓట్లేసి ఉండుంటే అప్పుడే అప్రతిహతంగా ముఖ్యమంత్రి అయ్యుండేవాడు, కానీ ఆపార్టీ అభ్యర్థులకు చాలాచోట్ల కనీసం డిపాజిట్లు కూడా రాలేదు, అతను నిలబడిన ఒకచోట తన స్వస్థలంలో పరాభవంచెందాడు.
ఈ పరిస్థితులలో అతనిని మరలా కుల నాయకుడిగా చూపించి ఆ కులం సానుభూతి ఓట్లు తిరిగి పొందాలనే అధికారపార్టీ తాపత్రయం బెడిసికొట్టడం ఖాయం. ఎట్టిపరిస్థితుల్లోనూ అతనిని ఆకులం మావాడు అని అనుకోదు, ఇప్పటికే ఆ కులం అతని వలన చేతులు కాల్చుకుంది, తీవ్రంగా నష్టపోయింది.
నాడు నేడు బయట ఎక్కడైనా చిన్నపాటి టీవీ యాంకర్లు, టీవీ సీరియల్స్ నటులు, సినీ జూనియర్ ఆర్టిస్టులు కనిపిస్తేనే జనం వేలంవెర్రిగా ఎగబడి చూస్తారు, అటువంటిది ఏకొద్దిపాటి ప్రముఖ నటుడు కనిపిస్తే చూడడానికి రాకుండా ఉంటారా? వచ్చేవాళ్ళందరూ ఆనటుడి కులానికి చెందినవాళ్లే అయ్యుంటారా?
నేడు అతని కులంలో అతనికంటే అతని తమ్ముడికి వందరెట్లు అభిమానం నమ్మకం విశ్వాసం గౌరవం ఉన్నాయి.
ఆ నటుడుకంటే విజయవాడలో ఆకులానికే చెందిన ఆయువనాయకుడుకే అత్యంత ప్రజాదరణ ఆకులంలో ఫాలోయింగ్, నేడు ఆ యువనాయకుడు ఆకులానికి ఒక బ్రాండ్ ఇమేజ్. అతని మాటపట్ల విశ్వాసం నమ్మకం సానుభూతి ఉన్నమాట వాస్తవం. ఆ యువనాయకుడే ఆకులంలో నేడు అత్యంత ప్రభావంతమైనవాడు, ఆ పేరున్న నటుడికంటే ఆ యువనాయకుడుకి వేయిరెట్లు ప్రజాదరణ ఉన్నమాట వాస్తవం.
ఆకులానికి చెందిన అత్యంత సామాన్యులు కూడా విజయవాడలోని ఆయువనాయకుడిని చేరగలరు, మాట్లాడగలరు. ఆయువనాయకుడు కూడా తన దివంగత తండ్రిలాగానే చాలా సాదాసీదాగా ఉంటూ అందరితో కలిసిపోయే తత్వం కలిగినవాడు, అతనిమీద నేటివరకు ఎటువంటి ఆరోపణలు మచ్చ లేవు. కానీ..హైదరాబాదులో చలువరాతి సౌధంలో హంసతూలికాతల్పంపై సేదతీరే ఆనటుడిని ఆకులానికి చెందిన సామాన్యుడు కాదుకదా ఒకమోస్తరు అత్యంత సంపన్నుడు కూడా కలవలేరు. అతను ఎప్పుడూ అత్యంత సంపన్నులుతో ఎవరు అధికారంలో ఉంటే వారితో మాత్రమే కలుస్తాడు, అతనిచుట్టూ ఒక ప్రత్యేక భజనబృందం నిరంతరం ఉంటుంది, వాళ్లే అతనికి ప్రపంచం, అతనికి అతని కులంపట్ల ఎటువంటి సానుకూలత కులప్రేమ బహిరంగంగా కులంకోసం నిలబడం అనేది ఉండడం అసంభవమని కులస్తులు అంటున్నారు.
ఏదో సినీపరిశ్రమలో బ్రతుకుదెరువు కోసం ప్రాకులాడేవాళ్ళు, మొఖామాటం పడేవాళ్ళు మాత్రమే అతనిని బయటకు పొగుడుతారు, మనసులో తిట్టుకుంటారు, ఇది బహిరంగ రహస్యం....నేడు అతనిని పొగిడేవాళ్ళు అందరూ ఫిలింనగర్ దైవసన్నిధానంకి వచ్చి మాకు నిజంగానే ఆ నటుడు మీద అభిమానం ప్రేమ గౌరవం ఉన్నాయని ప్రమాణంచేసి చెబితే మనం నమ్మవచ్చు.

ఈ పరిస్థితులలో మరోసారి ఆ నటుడు ద్వారా అతని కులంవాళ్ళు అతనిని నమ్మి బొక్కబోర్లా పడడానికి ఆర్ధికంగా చేతులు కాల్చుకోవడానికి రాజకీయంగా నష్టపోవడానికి ఆకులం ముందుకురాదు, అతనిని నమ్మదు....ఇది సత్యం.
కాబట్టి అతనికి కనీసం ఇంగితజ్ఞానం ఉంటే అతను అధికారపార్టీ వేసే ఉచ్చులో పడకుండా దూరంగా ఉంటూ, అతను పెద్దరికంతో మెలుగుతూ గతం గురించి మరచిపోయి మౌనంగా ఉంటూ సినీనటుడుగా అతనిపని అతను చేసుకుంటూ ఉంటే జీవితాంతం అతనికున్న గౌరవం నిలబడుతుంది.
అమాయకంగా నేను గొప్పోడినని పగటికలలతో ఊహించుకుంటే అన్నివిధాలా మరింతగా అష్టపోతాడు, అధికారపార్టీ వాడుకుని వదిలేస్తుంది, అతను వాడుకోబడతాడు.

నేడు ఆ నటుడు అధికారంకోసం ఎంతకైనా తెగించే ఒక వర్గం విసిరిన ఉచ్చులోపడిపోయాడని, ఆ వర్గంవాళ్ళ ఆటలో అరటిపండు లాగా మారిపోయాడని, నిన్న ఆ నటుడు ఇలా చేయడంవలన ఆకులం పరువు మరింత పలచబడిందని. ఆ నటుడు ఆకులం పరువు అధికారపార్టీకి ఆవర్గానికి తాకట్టుపెట్టినట్లు ప్రవర్తించాడని లోకం కోడై కూస్తోంది.
ఆ అగ్రనటుడిని అధికారవర్గం పిలవగానే ముందూవెనకా ఆలోచించకుండా, సినీపరిశ్రమలో పెద్దలకు ఎవరికీ చెప్పకుండా సమావేశం పెట్టకుండా అమాయకంగా ఏకపక్షంగా పరిగెత్తుకుంటూ వచ్చేసి ఉచ్చులోపడి తనపరువుతో పాటుగా తనకులం పరువు ఆత్మగౌరవాన్ని కూడా తాకట్టుపెట్టేవిధంగా మంటగలిపిన విధంగా ప్రవర్తించాడని అందరూ అంటున్నారు.
కేవలం భోజనానికి పిలిస్తే వచ్చి భోజనంచేసి గౌరవంగా తిరిగి వెళ్ళిపోయి ఉంటే ఎవరికీ ఇలా మాట్లాడే అవకాశంలేదు, కానీ మేము భోజనం చేస్తూ సినీపరిశ్రమ సమస్యలు గురించి చర్చించామని త్వరలో అన్నీ సానుకూలంగా సావధానంగా పరిష్కారం అవుతాయని చెప్పడం, సినీపరిశ్రమ వాళ్ళు ఎవరూ ప్రభ్యత్వానికి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడకూడదని ఫత్వా జారీచేయడం ఆ నటుడి అవగాహనా రాహిత్యానికి అమాయకత్వానికి ఆబతనానికి నిదర్శనమని ఆయన అభిమానులు అంటున్నారు.
పరిశ్రమలో ఎవరికీ తెలియకుండా ఏకపక్షంగా వచ్చిన నువ్వు సినీపరిశ్రమలో ఇతరులను శాసించే హక్కు నీకెక్కడుంది? నీకంటే మేమేమి తక్కువ? మమ్మల్ని శాసించే ఆదేశించే హక్కు ఎవరికుంది? మా డబ్బుతో మేము సినిమాలు నిర్మించుకుంటాం, మాఇష్టానుసారంగా మేముంటాం, మీ సినిమాల విడుదలకోసమే నీ పదవులు కోసమే నువ్వు ఆబగా ఆత్రంగా పరిగెత్తుకుంటూ వెళ్ళావని, ముందస్తుగా ఎవరితో ఎటువంటి సమావేశం నిర్వహించకుండా, వచ్చిన తరువాత మాకు ఎవరికీ అక్కడ సారాంశం పారదర్శకంగా నిజాయితీగా ఏమీ చెప్పలేదని, మొన్న మమ్మల్ని మంత్రులు ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా దూషిస్తే ఆరోజు నువ్వెక్కడున్నావని? కొందరు సినీపరిశ్రమలో పెద్దలు రేపు అంటారని, నిలదీస్తారని ఫిలింనగర్ టాక్.
కేవలం ఒక్క భోజనానికే సినీపరిశ్రమని కులాన్ని రాకట్టుపెట్టేస్తావా? కేవలం ఒక్క భోజనానికే ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తుతావా? నీకు రాష్ట్రంలో ప్రస్తుత సమస్యలు ప్రజల కష్టనష్టాలు ఏమితెలుసు? రాజకీయాలు వదిలేసిన వాడివి, సినిమాలు చేసుకుంటున్నవాడివి, మరలా రాజకీయ పదవికి కక్కుర్తి పడుతున్నావా? అని అందరూ అనుకుంటున్నారు, ఆ నటుడి ప్రవర్తనని రాష్ట్ర ప్రజలు అతని కులస్తులు అందరూ ప్రశ్నిస్తున్నారు.
దీనివలన ఆయనకు అనవసరంగా నష్టమే ఎక్కువ జరిగింది, ఆయన పరువు పోయింది.
ఆయన మరోసారి అమాయకంగా ఆ వర్గం విసిరే ఇటువంటి ఉచ్చులో పడకుండా పిలవగానే పరిగెత్తుకుంటూ ప్రత్యేకవిమానంలో ఒక్కడే రాకుండా, ఒకవేళ వచ్చి ఆయన గౌరవం కులం పరువు పోకుండా జాగరూకతతో ఉంటారని ఆశిస్తూ..,
ఇది అతనిపట్ల అతని మంచితనంపట్ల ఉన్న అభిమానంతో అతని మంచికోరి ఒక శ్రేయోభిలాషిగా ఒక నిష్పక్షపాత విశ్లేషణ మాత్రమే.!

సుంకర వెంకటేశ్వర్ రావ్


2022-01-14  Entertainment Desk