6tvnews

collapse
...
Home / బిజినెస్ / ఫైనాన్స్ / మార్చి లోనే ఎల్‌ఐసీ ఐపీవో ఇష్యూ

మార్చి లోనే ఎల్‌ఐసీ ఐపీవో ఇష్యూ

2022-01-15  Business Desk

lic
 

దేశంలోని అతి పెద్ద బీమా కంపెనీ లైఫ్‌ ఇన్యూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా మెగా పబ్లిక్‌ ఆఫర్‌కు రంగం సిద్దం చేసుకుంది. మార్చి రెండవ వారంలో ఐపీఓకు రానుందని బ్యాంకు అధికారులతో పాటు ప్రభుత్వ అధికారులు   తెలియజేశారు. ప్రభుత్వం ఐపీవో ద్వారా తమ వాటాను విక్రయించి మార్కెట్‌ నుంచి రూ.90 వేల కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.  

ప్రభుత్వ అధికారులు ప్రస్తుతం ఎల్‌ఐసీ కంపెనీ విలువ కట్టే పనిలో నిమగ్నమయ్యారు.  కాగా ఎల్‌ఐసీ ప్రస్తుతం 450 బిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువ ఆస్తులను నిర్వహిస్తోంది. కంపెనీ విలువను లెక్కగట్టిన తర్వాత మార్కెట్‌ నుంచి ఎంత మొత్తం సేకరించాలో ఆ తర్వాత నిర్ణయిస్తారని ప్రభుత్వంతో పాటు బ్యాంకింగ్‌ అధికారులు తెలియజేశారు.  

ప్రస్తుతం ఎల్‌ఐసీ విలువ కట్టే అంశంలో అధికారులు నిమగ్నమయ్యారు. ఒక్కసారి ఈ తంతు పూర్తయితే మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబికి ముసాయిదాను పంపిస్తారు. ప్రభుత్వం విధించిన డెడ్‌లైన్‌లోగా కంపెనీ విలువను లెక్కగడతామని ఈ వ్యవహారాలనుచూస్తున్న అధికారులు తెలిపారు. మొత్తానికి ఈ నెలాఖరు నాటికి ఈ తంతు పూర్తవుతుందని బ్యాంకింగ్‌ వర్గాలు చెబుతున్నాయి.  

ప్రస్తుతం ఎల్‌ఐసీ కంపెనీ విలువ కట్టే పనిలో అధికారులు నిమగ్నమైఉన్నారు. ఒక వేళ ఇన్వెస్టర్ల ఎల్‌ఐసీ వాస్తవ విలువను అంగీకరిస్తే.. ఎల్‌ఐసీ కూడా దేశంలోని అతి పెద్ద కంపెనీలైన రిలయన్స్‌ ఇండస్ర్టీ, టీసీఎస్‌ స్థానాన్ని సరసన చేరుతుంది. ప్రస్తుతం ఈ రెండు కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.17 లక్షల కోట్లు, రూ.14.3 లక్షల కోట్లుగా ఉన్నాయి.  

రెండేళ్లుగా వదంతులు…

గత రెండేళ్ల నుంచి ఎల్‌ఐసీ ఐపీవోకు వస్తోందని పెద్ద ఎత్తున వదంతులు వచ్చాయి.  అయితే ఎల్‌ఐసీ ఐపీవో అంటే మాటలు కాదు పెద్ద ఎత్తున కసరత్తు చేయాల్సి ఉంటుంది. దీనికి పలువురి మద్దతు కావాల్సి ఉంటుంది. ముఖ్యంగా యాంకర్‌ ఇన్వెస్టర్లతో పాటు రిటైల్‌ ఇన్వెస్టర్లు మద్దతు తప్పనిసరి.  

 దేశంలో లక్షలాది మంది ఎల్‌ఐసీ పాలసీదార్లున్నారు. వారికి షేరు ధరపై డిస్కౌంట్‌ ఇచ్చే అవకాశం ఉంది. రిటైల్‌ కస్టమర్ల నుంచి మంచి స్పందన వస్తుందని మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  మొత్తానికి ఇన్సిస్టిట్యూషనల్‌, యాంకర్‌ ఇన్వెస్టర్లు ఆసక్తి కనబరిస్తే ఎల్‌ఐసీ ఐపీవో  సక్సెస్‌ కావడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.  ఆర్థికమంత్రిత్వశాఖ కానీ ఎల్‌ఐసీ కానీ దీనిపై స్పందించలేదు.  

దేశంలోనే అతి పెద్ద బీమా కంపెనీ ఎల్‌ఐసీ. అలాగే బీమా కంపెనీలో అత్యధిక వాటా కలిగింది కూడా ఎల్‌ఐసీనే. కాగా ప్రభుత్వరంగానికి చెందిన ఈ బీమా కంపెనీ నుంచి ప్రభుత్వం తమ వాటాలను విక్రయించుకుని వచ్చిన మొత్తాన్ని ఈ ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటును భర్తీ చేసుకోవచ్చని ఆలోచిస్తోంది.  

 ఎల్‌ఐసీకి సింగపూర్‌లో అనుబంధ సంస్థ ఉంది. అలాగే బహ్రేన్‌, కెన్యా, శ్రీలంక, నేపాల్‌, సౌదీ అరేబియా, బంగ్లాదేశ్‌లో జాయింట్‌ వెంచర్‌లో వ్యాపారం చేస్తోంది. 

రోడ్‌షోలను వచ్చే నెల నుంచి ప్రారంభించబోతోంది. ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల్లో అంతా వర్చువల్‌లోనే జరిగే అవకాశం ఉందని  విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.  గత ఏడాది ప్రభుత్వం పది ఇన్వెస్టమెంట్‌ బ్యాంకులను నియమించింది. వాటిలో గోల్డ్ మన్ సాచెస్‌, సిటీ గ్రూపు, ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్‌ లను ఈ ఐపీవోను నిర్వహించాలని కోరింది.  


 


2022-01-15  Business Desk