మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ దూకుడు పెంచుతున్నాడు. రంగ రంగ వైభవంగా అనే సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమౌతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
హీరో హీరోయిన్లపై రొమాంటిక్ సన్నివేశాలతో కూడిన టీజర్ స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంది. ఒక అమ్మాయి ట్రీట్ ఇవ్వాలనుకుంటే తనతో పాటు ఏమీ తీసుకురావలసన అవసరం లేదు తెలుసా అంటూ హీరోయిన్ చెప్పే డైలాగ్ చాలా ఎట్రాక్టివ్ గా ఉంది. హీరోకి హీరోయిన్ బట్టర్ ఫ్లై కిస్ ఇచ్చే సీన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ టీజర్ లో ఉన్న సీన్లను చూస్తుంటే యూత్ ను టార్గెట్ గా పెట్టుకుని నిర్మించిన సినిమాలా చాలా స్పష్టంగా అర్ధమౌతోంది. BVSN ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి గిరీశాయ దర్శకత్వం వహించాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ కి జోడీగా కేతిక శర్మ నటించింది.