collapse
...
Home / తెలంగాణ / రైల్వే ప్రాజెక్టులు ఆలస్యానికి కారణం మీరే - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telu...

రైల్వే ప్రాజెక్టులు ఆలస్యానికి కారణం మీరే

2022-01-24  News Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

kishan
రైల్వే ప్రాజెక్టుల  విషయంలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తోందని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషణ్ రెడ్డి స్పందించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. రైల్వే ప్రాజెక్టుల నిధుల విషయంలో కేంద్రం అన్యాయం చేస్తోందని టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు పదేపదే ఆరోపిస్తున్నారనిఅందుకే తాను ఈ లేఖ రాయాల్సి వస్తోందని వివరించారు. తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన కొన్ని రైల్వే ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేని కారణంగానే ఆలస్యం అవుతున్నాయని కిషన్ రెడ్డి  తన లేఖలో స్పష్టం చేశారు. తెలంగాణకు కేటాయించిన ప్రాజెక్టుకు రాష్ట్ర సర్కారు భరించాల్సిన వ్యయాన్నికావల్సిన భూకేటాయింపులను త్వరగా పూర్తిచేయాలని కోరారు.

నరేంద్ర మోడీ ప్రధానిగా వచ్చాక తెలంగాణకు నిధుల కేటాయింపు రెట్లు పెరిగిందని కిషన్ రెడ్డి తన లేఖలో తెలిపారు. 2014-15 బడ్జెట్ లో తెలంగాణకు కేటాయింపులు రూ.250 కోట్లు కాగా, 2021-22 నాటికి కేటాయింపులు రూ.2,420 కోట్లకు పెరిగాయని వివరించారు. తెలంగాణలో రైల్వే నెట్  వర్క్ 194 రూట్ కిలోమీటర్లు పెరిగినట్టు కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ క్రమంలో ఏయే ప్రాజెక్టులు ఆలస్యం అవుతున్నాయో అన్నింటిని ఆయన తన లేఖలో వివరంగా ప్రస్తావించారు.

 



2022-01-24  News Desk