భారతదేశ చరిత్రలో జనవరి 24వ తేదీ మరపురాని రోజు. భారత అణు పితామహుడిగా పేరుగాంచిన శాస్త్రవేత్త డాక్టర్ హోమీ జహంగీర్ భాబా ఇదే రోజున చనిపోయారు. గత 1966లో సరిగ్గా ఇదేరోజున జరిగిన విమాన ప్రమాదంలో చనిపోయారు. అప్పటికి ఆయన వయసు 56యేళ్ల. ముంబై నుంచి అమెరికాలోని న్యూయార్క్‌కు వెళ్తున్న విమానం.. యూరప్‌లోని ఆల్ప్స్ పర్వత శ్రేణిలో ప్రమాదానికి గురై కుప్పుకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న హోమీ భాభాతోపాటు 117మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ ప్రమాదం ఎలా జరిగిందనేదానిపై ఇంతవరకు సమాచారం లేకపోవడం విశేషం.
న్యూయార్క్ కు బయల్దేరడానికి మూడు నెలల ముందు భాభా చేసిన ప్రకటన సంచలనం రేపింది. తనకు అనుమతిస్తే కేవలం 18నెలల్లోనే ఆటంబాంబును తయారుచేసి చూపిస్తానని ప్రకటించారు. అయితే, అణు బాంబు తయారుచేస్తే తమకు ముప్పుగా పరిణమిస్తారన్న భయంతో భాభా ప్రయాణిస్తున్న విమానాన్ని అమెరికాకు చెందిన సీఐఏ అధికారులు కూల్చివేయించారన్న ఆరోపణలు అప్పట్లో ప్రముఖంగా వినిపించాయి.
హోమీ జహంగీర్ బాబాకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు.
Paying tribute to the "Father of India's nuclear program", Homi J. Bhabha today on his Punya Tithi.
He developed the nuclear program in India, insisted India's self reliance in Nuclear power.
His contribution to atomic energy research will always be remembered.#AmritMahotsavpic.twitter.com/A3PHiNhzqN— G Kishan Reddy (@kishanreddybjp) January 24, 2022