భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఐసీసీ మహిళా క్రికెటర్ ఆఫ్ ది ఇయర్-పురస్కారాన్ని గెలుచుకుంది. గత ఏడాది అన్ని ఫార్మాట్లలో కలిపి 22 అంతర్జాతీయ మ్యాచుల్లో 855 పరుగులు సాధించింది. అందులో ఒక శతకంతో పాటు 5 అర్ధ శతకాలు కూడా ఉన్నాయి. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో పరిమిత ఓవర్ల సిరీస్లలో భాగంగా భారత్ కేవలం రెండే మ్యాచ్లలో గెలుపొందిన రెండు విజయాల్లోనూ ఓపెనర్ స్మృతి కీలక పాత్ర పోషించింది. రెండో వన్డేల్లో 80 పరుగులతో అజేయంగా నిలిచిన ఆమె... చివరి టీ20 మ్యాచ్లో 48 పరుగులతో సత్తా చాటింది.
A year to remember 🤩
Smriti Mandhana's quality at the top of the order was on full display in 2021 🏏
More on her exploits 👉 https://t.co/QI8Blxf0O5pic.twitter.com/3jRjuzIxiT— ICC (@ICC) January 24, 2022