హైదరాబాద్ నుంచి ఆలయ నగరం తిరుపతికి మధ్య దూరం 580 కిలోమీటర్లు. ఇప్పుడు కొత్తగా నిర్మిస్తున్న 174 కిలోమీటర్ల హైవే కారణంగా ఈ రెండింటికి మధ్య దూరం వంద కిలోమీటర్లు తగ్గనుంది. 480 కిలోమీటర్ల దూరం ఉండే ఈ కొత్త హైవే వల్ల వంద కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గుతుంది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆధ్రప్రదేశ్ మధ్య లింకు ఏర్పరుస్తున్న కొత్త జాతీయ రహదారిని అడ్డదారిలో నిర్మించడానికి కేంద్రప్రభుత్వం ఎట్టకేలకు ఆమోదం తెలిపింది.
ఈ మార్గంలో 174 కిలోమీటర్ల స్ట్రెచ్‌ని రూ. 1,700 కోట్ల వ్యయంతో నిర్మించడానికి డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్టు)ని కేంద్ర రహదారులు, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆమోదించింది. తెలుగు రాష్ట్రాల మధ్య హైవేకి అనుసంధానించడానికి ఉద్దేశించిన ఈ ప్రతిపాదన 2020 నుంచి పెండింగులో ఉంది.
480 కిలోమీటర్ల తగ్గిపోనున్న దూరం
ఇప్పుడు హైదరాబాద్, తిరుపతి మధ్య దూరం 580 కిలోమీటర్లు. ఒకసారి హైవే నిర్మాణం పూర్తయ్యాక ఈ రెండు మహా నగరాల మధ్య దూరం 480 కిలోమీటర్ల దూరానికి తగ్గిపోతుంది. మొత్తం మీద ప్రయాణ దూరం గంట వరకు తగ్గిపోతుంది. సోమశిల వద్ద కృష్ణా నదిపై కొత్త వంతెన నిర్మాణం కొల్హాపూర్ హైవే (167 కిలోమీటర్లు) అని పిలుస్తున్న కొత్త హైవే ప్రాజెక్టులో భాగంగా ఉంటుంది.
తెలంగాణ లోని నాగర్ కర్నూలు జిల్లా నుంచి వయా తాడూరు, నాగర్ కర్నూలు, కొల్లాపూర్ బైపాస్ రోడ్ల మీదుగా సాగే కల్వకుర్తి సమీపంలోని కోట్ర జంక్షన్ నుంచి ఈ హైవే నిర్మాణం ప్రారంభమవుతుంది. ఈ హైవే కర్నూలు జిల్లాలోని ఎర్రమఠం, ఆత్మకూర్, వెలుగోడు, కరివెన్, నంద్యాల బైపాస్ రోడ్ గుండా సాగిపోతుంది. ఈ నూతన హైవే నంద్యాల హైవే మీది ఎన్ హెచ్40 జంక్షన్‌కి కనెక్ట్ చేస్తుందని జాతీయ రహదారికి చెందిన ఉన్నతాధికారులు చెప్పారు.
ఈ కొత్త రహదారి కర్నూలు, కడపను తాకకుండానే హైదరాబాద్, తిరుపతి మధ్య కనెక్టివిటీని కలిగిస్తుందని ఒక అధికారి తెలిపారు. ఎన్హెచ్ఏఐ (నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా) ఒక నెలలో హైవే ప్రాజెక్టుకు టెండర్లను ఆహ్వానిస్తుంది. అయితే హైవే అధారిటీ ముందున్న అతిపెద్ద సవాలు ఏదంటే కొత్త ప్రాజెక్టుకోసం భూ సేకరణే. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన తర్వాత నాగర్ కర్నూల్లో ప్రతిపాదిత హైవే చుట్టూ ఉన్న భూముల ధరలు చుక్కలంటున్నాయని అధికారులు చెప్పారు.
కొత్తగా ఆమోదించిన ఈ హైవే నాగర్ కర్నూల్, కొల్హాపూర్, ఆత్మకూర్, నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గాల గుండా సాగుతుంది. అటవీ రిజర్వు భూములను మాత్రం రెండు రాష్ట్రాల ప్రభుత్వాలతో సంప్రదించిన తర్వాత స్వాధీనపర్చుకుంటామని అధికారులు చెప్పారు.