collapse
...
Home / చదువు / దెబ్బకు దెబ్బ: చైనా టూరిస్టులకు ఇకపై వీసాలుండవు - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News fo...

దెబ్బకు దెబ్బ: చైనా టూరిస్టులకు ఇకపై వీసాలుండవు

2022-04-27  International Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

visa
 

చైనా జాతీయులకు టూరిస్ట్ వీసాలను భారతదేశం నిలిపేసింది. ప్రపంచ ఎయిర్ లైన్స్ సంస్థ ‘ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్ (ఐఎటిఎ) తన క్యారియర్లకు ఈ సమాచారం తెలిపింది. ‘పీపుల్స్ రిపబ్లిక్ లోని చైనా జాతీయులకు ఇచ్చిన టూరిస్ట్ వీసాలు ఇకపై చెల్లవు’ అని ఐఎటిఎ ఒక ప్రకటనలో వెల్లడించింది. దేశంలో ఉండేవారు లేదా భూటాన్, మాల్దీవులు, నేపాల్ నుంచి వచ్చే వారు లేదా భారతదేశం జారీ చేసిన రెసిడెన్షియల్ పర్మిట్ లేదా వీసా, ఇ--వీసా ఉన్నవారిని, ‘ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా’ కార్డు (ఓసిఐ) లేదా బుక్ లెట్ ఉన్నవారిని, లేదా ఇండియన్ ఆరిజిన్ కార్డు (పిఐఓ), డిప్లమాటిక్ పాస్ పోర్ట్ ఉన్నవారిని మాత్రమే ఇకపై భారతదేశంలోకి అనుమతిస్తారని ఐఎటిఎ ఏప్రిల్ 20న జారీచేసిన ప్రకటన పేర్కొంది. పదేళ్ల వరకు చెల్లే వీసాలు కూడా ఇకపై చెల్లవు. గ్లోబల్ ఎయిర్ లైన్స్ బాడీకి దాదాపు 290 దేశాల సభ్యులున్నారు. అంతర్జాతీయ ఎయిర్ ట్రాఫిక్ లో 80 శాతం పైగా ఈ దేశాల నుంచే జరుగుతుంది. 

చైనాలో వేలాదిమంది  భారతీయ విద్యార్థులు

భారతీయ విద్యార్థులు తమ దేశంలోకి రావడానికి చైనా మళ్లీ నిరాకరించడంతో ఇండియా ఈ చర్య తీసుకుంది.  చైనాలో ఉన్న 22,000 మంది భారతీయ విద్యార్థులు కరోనా మహమ్మారి కారణంగా 2020లో స్వదేశానికి వచ్చారు. వారంతా చైనా యూనివర్శిటీల్లో చదువుతున్నవారు. తిరిగి అక్కడికి వెళ్లి క్లాసులకు హాజరు కావాలి. కానీ, భారత ప్రభుత్వం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా చైనా నిరాకరించింది. తాజాగా మరోసారి చైనా తిరస్కరించింది. దాంతో ఇండియా చైనా పౌరులపై ఈ వేటు వేసింది.
‘భారతీయ విద్యార్థులు తిరిగి చైనా వెళ్లి చదువుకునేందుకు వీల్లేకుండా చైనా కఠినమైన ఆంక్షలు విధించింది. ఇందువల్ల వేలాది మంది భారతీయ విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుంది’ అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ (ఎం.ఇ.ఎ) ప్రతినిధి ఆరిందం బాగ్చీ గత నెలలో ఒక ప్రకటనలో తెలిపారు. 

మాట తప్పిన చైనా  
భారతీయ విద్యార్థులు తిరిగి చైనాకు వచ్చి చదువుకునేందుకు చేస్తున్న ఏర్పాట్లను పరిశీలిస్తున్నామని కూడా చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ఫిబ్రవరి 8న పేర్కొందని ఆయన గుర్తు చేశారు.‘కానీ ఇవ్వాళ్టి దాకా ఈ విషయంలో చైనా నుంచి ఎలాంటి స్పష్టమైన జవాబు రాలేదు. 
గత ఏడాది సెప్టెంబర్ లో దుషన్ బేలో జరిగిన సమావేశంలో మన విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జయశంకర్ ఈ అంశాన్ని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈ దృష్టికి తీసుకెళ్లినట్టు బాగ్చీ చెప్పారు. షాంఘై సహకార సంస్థ (ఎస్.సి.ఓ) తజిక్ రాజధాని దుషన్ బేలో ఏర్పాటు చేసిన మహాసభ సందర్భంగా రెండు దేశాల విదేశాంగ మంత్రులూ కలుసుకొని చర్చించుకున్నారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సానుకూల వైఖరిని అవలంబించమని, వారు చదువులు కొనసాగించే వీలు కల్పించమని చైనాను కోరుతూనే ఉంటాము’ అని గత నెలలో చేసిన ప్రకటన పేర్కొంది. 

ఏ దేశాలకు దీర్ఘకాలిక టూరిస్ట్ వీసాలు?  
ఇప్పటి నిబంధనల ప్రకారం అమెరికా, జపాన్ జాతీయులకు దీర్ఘ కాలిక టూరిస్ట్ వీసాలు జారీచేస్తారు. ఇప్పటికే చెల్లుబాటులో ఉన్న టూరిస్ట్ వీసాల గడువును పాత తేదీ ప్రకారం పదేళ్ల వరకూ పొడిగిస్తారు అని మార్చి 16న విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది. ఇక ఇ--వీసాలు కూడా జారీ చేస్తున్నారు. 2019 మాన్యువల్ ప్రకారం 156 దేశాల పౌరులు కొత్త ఇ– టూరిస్ట్ వీసాలకు అర్హులు. అలాగే టూరిస్ట్, ఇ– టూరిస్ట్ వీసాలతో నిర్ణీత ‘సీ ఇమిగ్రేషన్ చెక్ పోస్టులు (ఐపి లు) లేదా విమానాల ద్వారా ఐసిపి ఎయిర్ పోర్టుల నుంచి మాత్రమే భారతదేశంలోకి రావలసి ఉంటుంది. ‘వందే భారత్ మిషన్’ లేదా ‘ఎయిర్ బబుల్’ స్కీమ్ లేదా డిజిసిఎ విమానాలు లేదా పౌర విమానయాన శాఖ విమానాలలో వారు రావచ్చు. టూరిస్ట్ వీసా ఉన్నా భూమి సరిహద్దుల నుంచి లేదా సముద్ర మార్గం ద్వారా భారతదేశంలోకి ప్రవేశించడానికి అనుమతించరు.2022-04-27  International Desk