ప్రతి వ్యక్తి జీవితంలో విద్య ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మంచి విద్య మనకు మానవ విలువలు, జీవితం గురించి నేర్పుతుంది. ప్రాచీనా భారత సమాజంలో విద్య ఒక ముఖ్యమైన అంశంగా ఉండేది. నలంద, తక్షశిల, కాంచీపురం విశ్వవిద్యాలయాల స్థాపనం అలాంటిదే. ప్రాచీన భారత దేశంలో అలాంటి ఎన్నో విశ్వవిద్యాలయాలు అనేక అధ్యయనాంశాలకు వీలు కల్పిస్తున్నాయి. ప్రస్తుత విద్యా రంగంలో మనం బహుముఖ అధ్యయనాల అవసరం గురించి మాట్లాడుకుంటున్నాం. జాతీయ విద్యావిదానం 2020లో మనం దీన్ని చూడగలం.
ప్రాచీన కాలం నుంచి ఈనాటి వరకు విద్యను మనదేశంలో సరస్వతీ దేవితో పోల్చుతున్నాం. అనేక మంది పండితులు, మహర్షులు ఆమెను ఆరాధించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సరస్వతి కశ్మీర్ దేవతతో ముడిపడి ఉంది. ఆదిశంకరాచార్య వర్ణించిన కశ్మీర పుర వాసిని అనే వర్ణనలో మనం దీన్ని చూడగలం. ఈమె విజ్ఞానం, నీరు, నదితో ముడపడిన వేదకాల నాటి దేవతగా సరస్వతి భాసించేది. ఈమె బ్రహ్మ సహధర్మచారిణి. సరస్వతి చేతిలో వీణ, పుస్తకం, కమలం, పాశం, అంకుశంతో విగ్రహాలు చెక్కారు, చిత్రాల గీశారు. సరస్వతి వాహనం హంస. మధ్యయుగ కర్నాటకలో ఈమె పేరుతో అనేక ఆలయాలు, విగ్రహాలు వెలిశాయి.
ఈ కాలంలో దాదాపు అన్ని ప్రముఖ ఆలయ సముదాయాలు పాఠశాలలను కలిగి ఉండేవి. వీటిని సరసతి మఠాల అని పిలిచేవారు. కర్నాటకలో మధ్యయుగంలో అన్ని వయసుల వారికి విద్యనేర్పే పర్యాయపదంగా ఈ మఠాల ఉండేవి. కల్యాణ చాళుక్య యుగ కాలంలో అనేక సరస్వతి మఠాలు, పాఠశాలల గురించి ప్రస్తావనను శాసనాల్లో చెక్కారు. అయితే కుషాణుల కాలంలోనే అంటే క్రీస్తు శకం 1, 2 శతాబ్దాల ప్రారంభంలోనే సరస్వత చిత్రం రూపొందింది.
కర్నాటకలో సరస్వతి మఠాలు ప్రధానంగా శివాలయాలతో ముడిపడి ఉండేవి. ఇవి ఎక్కువగా దక్షిణ భాగంలో ఉండేవి. ఆ రోజుల్లో ఇవి విద్యా కేంద్రాలుగా విలసిల్లేవి. గ్రామం లేదా అగ్రహారంలోని ఆలయాలకు ఇవి అనుసంధానమై ఉండేవి. మధ్యయుగాల్లో అన్ని పాలక వంశాలు విద్యాకు అమిత ప్రాధాన్యతను ఇచ్చేవి. విద్యార్థులక సహాయం చేయడం ఉత్కృష్ట కార్యంగా భావించబడేది. ఇది విద్యాదాతకు సౌభాగ్యాన్ని ఇస్తుందని భావించేవారు. నాటి రాజులు విశ్వవిద్యాలయాలను (ఘటిక స్థలం) నెలకొల్పి జ్ఞానవంతులైన అధ్యాపకులను నియమించేవారు. ఈ గురువులకు భూమి కేటాయించేవారు. పాఠశాలల్లో బోధనకు గాను వారికి నగదు సమర్పించుకునేవారు.
ఆరోజుల్లో ఆశ్రమ పాఠశాలలు కూడా ఉండేవి. పిల్లలన సంరక్షణను గురువులు స్వీకరించి కొన్ని సంవత్సరాల పాటు వారికి బోధించేవారు. కర్నాటకలో కాలముఖ శైవతత్వం ప్రబలంగా ఉన్న రోజుల్లో మఠాలు వృద్ధి చెందాయి. ఈ పాఠశాలలను నడపడంలో కాలముఖ గురువులే కీలక పాత్ర పోషించేవారు. వీరిలో బహుముఖ పండితులు ఉండేవారు. వివిధ విద్యా శాఖల్లో వీరు ప్రత్యేక జ్ఞానం సంపాదించేవారు. వీరు ఆలయ నిర్వాహకులుగా కూడా పనిచేశారు. రోజువారీ ఆలయ పాలనను వీరు జాగ్రత్తగా నిర్వహించేవారు.
వర్తమాన శకం 1000 నుంచి విద్యార్థులకు తిండికి, బట్టలకు విరాళాలు ఇస్తున్న వారి పేర్లను అనేక శాసనాలు పేర్కొంటూ వచ్చాయి. వివిధ వేదాలు, పురాణాలు, మీమాంస, తర్క శాస్త్ర, బౌద్ధ సాహిత్యం, ప్రభాకర, న్యాయ తదితర సబ్జెక్టుల్లో ప్రత్యేక జ్ఞాన సాధనకు విరాళాలిచ్చిన వారి పేర్లను కూడా ఈ శాసనాలు పేర్కొన్నాయి. ఆలయాల్లో భాగంగా గురుకుల పాఠశాలలు కూడా ఉండేవి. గుల్బర్గా జిల్లాలోని కల్గి, నాయగి, యాద్గిర్ జిల్లాలోని ముద్నూరు, ఎవురు, కులగెరి వంటి ప్రాంతాలు, కొప్పల్ జిల్లాలోని యెల్బుర్గా తాలూకాలోని ఇతగి, బాగల్కోట్ లోని బదామి తాలూకాలోని బేలూరు, గడగ్ పట్టణంలోని త్రికూటేశ్వర ఆలయం, షిమోగా జిల్లాలోని బల్లిగవి వంటి ప్రాంతాల్లో అనేకమంది విద్యార్థులు అధ్యయనం చేసేవారు. పైగా విద్యతో ముడిపడిన అనేక స్థలాలు ఇంకా ఉండేవి.
కల్యాణ్ చాళుక్య, హోయసల రాజుల కాలంలో విద్యకు గొప్పగా సహకరించారు. త్రికూటేశ్వర త్రిపురుష ఆలయం నిర్మితమైన ప్రతి చోటా ఒక సరస్వతి ఆలయ మఠం కూడా దానికి అనుబంధంగా ఉంటుంది. అందుచేత, శాశ్వత జ్ఞాన దేవత అయిన సరస్వతి మధ్యయుగ కర్నాటకలో ఒక వ్యవస్థగా మారింది.