collapse
...
Home / ఆంధ్రప్రదేశ్ / కృష్ణా / ప్ర‌శ్నా ప‌త్రాల లీకుల‌కు కార‌ణం ఎవరు ? - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu...

ప్ర‌శ్నా ప‌త్రాల లీకుల‌కు కార‌ణం ఎవరు ?

2022-05-10  News Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

exam paper

 

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పదవ తరగతి పరీక్షల  ప్రశ్న పత్రాలు రోజుకొకటి చొప్పున లీకవుతున్నాయి. వాటిని వాట్సప్‌ల ద్వారా యథేచ్ఛగా షేర్‌ చేస్తున్నారు. ఈవిధంగా లీకవడం ప్రభుత్వ వైఫల్యం అంటూ... ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తుండగా... ప్రభుత్వ పెద్దలు మాత్రం కార్పొరేట్‌ కాలేజీలు వ్యూహాత్మకంగా ఇలా లీక్‌ చేస్తు త‌మ‌కు చెడ్డ‌పేరు తీసుకువ‌స్తున్నాయని ప్ర‌త్యారోప‌ణ‌లు చేస్తు న్నారు. అది కూడావిప‌క్ష తెలుగు దేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి నిర్వ‌హిస్తున్న నారాయ‌ణ‌, చైత‌న్య‌లేనంటూ ముఖ్య‌మంత్రి బ‌హిరంగంగానే ప్ర‌క‌టించారు. అదే ఇప్పుడు నిజమైన  దాఖ‌లాలు కనిపిస్తున్నాయి.

అస‌లు ఈ పేప‌ర్ల లీకేజీ వ్య‌వ‌హారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గుట్టు చప్పుడు కాకుండా జ‌రిగేది. కొన్ని చోట్ల మాస్ కాపీయింగ్‌ల‌కు పేరు ప్ర‌ఖ్యాతులు కూడా ఉండేవి. ఈ సెంట‌ర్ల‌లో100 శాతం ఉత్తీర్ణ‌త‌ వ‌స్తుండ‌టంతో చాలా మంది ఆ సెంట‌ర్ల‌లోప‌రిక్ష‌లు రాసేందుకు ఉత్సాహం చూపేవారు. అయితే అప్ప‌టి ప్ర‌భుత్వాలు వీటిపై ప్ర‌త్యేక దృష్టి పెట్ట‌డంతో వాటి హ‌వా త‌గ్గింది. 

 1996-1999ల మధ్య ఎంసెట్‌ పేపర్‌ లీకేజీ కావ‌టం సంచ‌ల‌న‌మైంది.  కోడెబ్రహ్మం అనే వ్యక్తి పేరు పతాక స్థాయి వార్తలలో వినపడింది. అది మెద‌లుకుని లీకేజీల వార్తలు వినపడుతూనే వున్నాయి. రెండు సంవత్సరాల కిందట తెలంగాణలో ఇంటర్మీడియట్‌ జవాబు పత్రాలను దిద్దే కార్యక్రమం తప్పుదోవ పట్టి అర్హులు ఫెయిల్‌ అవగా... అనర్హులకు మంచి మెరిట్‌ మార్కులు వచ్చిన విష‌యం వెలుగుచూసిన ఘటన పెద్ద దుమారం రేపిన విష‌యం తెలిసిందే. వీటిలో ఫెయిల్‌ అయిన ఇరవై మంది విద్యార్థులు మనోవేదనతో  ఆత్మహత్యలకు పాల్పడిన విష‌యం ప్ర‌స్తావ‌నార్హం.

ఇక‌ ఓపెన్‌ యూనివర్సిటీ లు, ఓపెన్‌ స్కూల్స్ పరీక్షలు అంతా ఓపెన్‌ అనేలా త‌యార‌వుతుండ‌టం ఆందోళ‌న క‌లిగించేదే. ప‌లు స్టడీ సెంటర్ల ను నిర్వ‌హించే వ్య‌క్తులు మాఫియా మాఫియాగా ఏర్ప‌డి మాస్‌ కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తున్నారు. పైగా... నకిలీ సర్టిఫికెట్ల భాగోతం అప్పుడప్పుడు వెలుగుచూస్తూనే వుంటుంది.   మూడు నాలుగు నెలల కిందట తెలంగాణలో ఈ నకిలీ సర్టిఫికెట్ల కుంభకోణం భారీ ఎత్తున బయటపడింది.

వాస్తవానికి   వంద శాతం అక్షరాస్యత సాధించే ల‌క్ష్యంతో   విద్యారంగానికి ప్రతియేటా దేశవ్యాప్తంగా లక్షలాది కోట్లు విడుదల చేస్తున్నారు. కానీ ప్రభుత్వ పాఠశాలలను, కళాశాలలలో క‌నీస మౌళిక‌వ‌స‌తులుప‌ట్టించుకోవ‌ట్లేదు. ఏపిలో నాడు నేడు పేరుతో భ‌వ‌నాల‌కు రంగులు వేసారు మిన‌హా అందులో పాఠాలు చెప్పే పంతుళ్ల నియామ‌కాన్ని మాత్రం విస్మరించార‌న్న‌ది చేదు నిజం. దీనికి తోడు అధికార గ‌ణం విచ్చలవిడిగా  కమీషన్లకోసం కక్కుర్తిపడుతూ ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలకు అనుమతులు ఇస్తుండ‌టంతో  విద్యావ్యవస్థ లో  మాఫియా చొచ్చుకు వ‌చ్చేసింది.

ఏటా లాభాలు కురిపించే ప‌రిస్థితి ఈ వ్య‌వ‌స్ధ‌లో ఉండ‌టంతో అన్ని రాజకీయ పార్టీల  నాయకులు   కాన్సెప్ట్‌ స్కూల్స్‌, మోడల్‌  స్కూల్స్‌, పబ్లిక్‌ స్కూల్స్‌ వంటి రకరకాల పేర్లతో పుట్టగొడుగుల్లా ఏర్పాటు చేస్తున్నారు. ఇవి ఏయేటికాయేడు పెరుగుతున్నా  యంటే ఈ విద్యా మాఫియాకు ప్ర‌భుత్వ అండ‌దండ‌లెంత ఉన్నాయో అర్ధం చేసుకోవ్చు. ఈ క్ర‌మంలో  నూరు శాతం ఫలితాలు  సాధించాం అనే ప్రచారం కోసం   పేపర్‌ లీకేజీలు, మాస్‌ కాపీయింగ్‌లకు పాల్ప‌డ‌టం నిత్యకృత్యయిపోయింది.

విద్య ప్ర‌యివేటీక‌ర‌ణ దిశ‌గా స‌ర్కారే ప్రోత్స‌హిస్తుంటే  ప్రభుత్వ స్కూళ్లలో ప‌నిచేసే టీచ‌ర్లు కూడా మెక్కుబ‌డిగా ప‌ని చేస్తున్నారు.  పైగా ప్ర‌భుత్వ స్కూల్స్ విలీనం కూడా స‌ర్కారు బ‌డుల‌కు విద్యార్ధుల‌ను దూరం చేస్తోందని చెప్ప‌క త‌ప్ప‌దు..కార్పొరేట్ విద్య మీద మోజుతో ప్ర‌భుత్వ ఉద్యోగులు కూడా త‌మ పిల్ల‌ల్ని ప్ర‌యివేట్‌ పాఠశాలకు పంపిస్తుండ‌టంతో అవి విద్యార్థులతో కిక్కిరిసి కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల టీచర్లు తమ పిల్లలను ప్రైవేట్‌ కాన్వెంట్‌ స్కూళ్ల లో, ఇతర కార్పొరేట్‌ ప్రైవేట్‌ పాఠశాలలనందు చేర్పిస్తున్నారు. 

ఈ వ్య‌వ‌హారాన్ని తీవ్రంగా ప‌రిగ‌ణించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇక‌పై ల‌మ రాష్ట్రంలో ప‌నిచేసే ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులతో  స‌హాఉద్యోగుల‌ పిల్లలు సైతం ప్రభుత్వ పాఠశాలల్లోనే చదవాల్సందేన‌ని  ప్ర‌త్యేక  సర్క్యులర్‌ను విడుద‌ల చేయ‌టం హ‌ర్ష‌ణీయం.  

ఇప్పుడుఇదే తరహాలో తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు ఆదేశాలివ్వ‌టం ఒక్క‌టే మార్గం. త‌ద్వారానే ప్రైవేట్‌ స్కూళ్ల వైపరీత్యానికి బ్రేకులు ప‌డ‌టంతో పాటు ప్రభుత్వ పాఠశాలల పనితీరును మెరుగుపరిచేలా చ‌ర్య‌లు చేప‌ట్టాలి.  మాస్‌ కాపీయింగ్‌, పేపర్‌ లీకేజీలకు పాల్పడే యాజమాన్యాల మీద, వ్యక్తుల మీద పీడి, టాడా వంటి బలమైన చట్టాలు ప్రయోగించడంద్వ‌రానే  అస్తవ్యస్థ విద్యావ్యవస్థను ప్రక్షాళన చేయగ‌ల‌మ‌ని పాల‌కులు గుర్తించాలి. మ‌రి మ‌న‌ పాలకులు నిజంగా అలా చేస్తారా..?   లేదా అన్న‌ది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న .
 2022-05-10  News Desk