collapse
...
Home / ఆరోగ్యం / ప్రత్యామ్నాయ వైద్యవిధానాలు / నోటి మాత్ర‌తో క‌రోనా కి క‌ట్ట‌డి - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu | News...

నోటి మాత్ర‌తో క‌రోనా కి క‌ట్ట‌డి

2022-05-10  Health Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

tabletf
గ‌త మూడేళ్ళుగా క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచ దేశాల్ని ప‌ట్టి పీడిస్తున్న సంగ‌తి తెలిసిందే . అయితే దీనికి మందును క‌నుక్కోవ‌డం కోసం ఎన్నో ప‌రిశోధ‌న‌లు చేశారు. బ‌యోటెక్ కంపెనీలాంటివి కొన్ని ఫార్మా సంస్థ‌లు ఎన్నో ప‌రిశోధ‌న‌లు చేసి వ్యాక్సిన్‌ని క‌నిపెట్టాయి. అమెరికాకు సంబంధించి ఆస్ట్రాజ‌నికా దాన్నే భార‌త‌దేశంలో కోవిషీల్డ్ కింద వేశారు. స్పూత్‌నిక్ వ్యాక్సిన్ ర‌ష్యా క‌నిపెట్టింది. ఇక మ‌న భార‌త దేశానికి భార‌త్ బ‌యోటెక్ వ్యాక్సిన్‌ని క‌నిపెట్టింది  కోవ్యాగ్జిన్ ని డెప‌లప్  చేశారు. ఇలా ప్ర‌పంచ దేశాల‌న్నీ కూడా ఎన్నో ప‌రిశోధ‌న‌లు చేసి ఈ వ్యాక్సిన్ల‌ను క‌నుక్కోవ‌డం జ‌రిగింది.

మ‌రి ఇ ప్పుడు ఈ క‌రోనా నివార‌ణ కొర‌కు మాత్రల రూపంలో కొవిడ్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు.. దీని వల్ల కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చని చెబుతున్నారు. కరోనా వ‌చ్చిన పేషంట్ల‌ నోటి నుంచి వ‌చ్చే తుంపర్ల సంఖ్యను ఈ సరికొత్త టీకా గణనీయంగా తగ్గిస్తుందని తమ అధ్యయనంలో తేలినట్టు అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ పరిశోధకులు  ద్వారా తెలిపారు. అడినోవైరస్‌ను వాహకంగా ఉపయోగించుకునేలా అభివృద్ధి చేసిన ఈ టీకాను నోటీ ద్వారా తీసుకోవచ్చని శాస్త్ర‌వేత్త‌లు పేర్కొన్నారు.

శ‌రీరంలో ఉండే రక్తం, ఊపిరితిత్తుల్లో ఈ మాత్ర‌ యాంటీబాడీలుగా తయారు చేస్తుందన్నారు. ఫలితంగా ఈ నోటి టీకా కరోనా వైరస్ నుంచి  రక్షణ కల్పిస్తుందని వివరించారు. అంతేకాదు, ఇంజక్షన్ ద్వారా తీసుకునే టీకాతో పోలిస్తే ఈ నోటి టీకా ‘ఇమ్యునోగ్లోబ్యులిన్-ఎ (ఐజీ-ఎ)ను అధికంగా ఉత్పత్తి చేస్తున్నట్టు చెప్పారు. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, మాట్లాడేటప్పుడు మ‌న నోటి నుంచి వ‌చ్చే తుంపర్ల  వైరస్ కణాల సంఖ్యను తగ్గించడంలో ఐజీ-ఎ కీలక పాత్ర పోషిస్తుందని పరిశోధకులు తెలిపారు.

కరోనా లక్షణాలు తీవ్రంగా ఉన్నవారిలో మరణాలు లేదా ఆస్పత్రిలో చేరే ప్రమాదాన్ని సగానికి తగ్గించడంలో నోటి ద్వారా తీసుకునే మాత్ర చాలా వ‌ర‌కు సత్ఫలితాలను ఇచ్చిందని ఇటీవల క్లినికల్ ట్రయల్స్‌లో తేలింది. 'మోల్నుపిరావిర్' మాత్రను కోవిడ్-19 సోకినవారికి రెండు పూట్ల ఇచ్చి పరీక్షించారు.

ఈ ప్రయోగంలో సానుకూల ఫలితాలు వచ్చాయని అమెరికాకు చెందిన ఔషధ తయారీదారీ సంస్థ 'మెర్క్' తెలిపింది. రాబోయే రెండు వారాల్లో అమెరికాలో ఈ ఔషధం అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేtabletf
స్తామని ఆ సంస్థ తెల‌ప‌డం "శుభసూచికమే", అయితే యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ఈ డేటాను సమీక్షించేవరకు జాగ్రత్త వహించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చీఫ్ మెడికల్ అడ్వైజర్ డాక్టర్ ఆంథోనీ ఫౌచీ కోరారు.

అయితే మొద‌ట్లో ఈ మాత్రను ఇంఫ్లుయెంజా చికిత్స కోసం అభివృద్ధి చేసిన‌ట్లు స‌మాచారం. తరువాత దీని లక్షణాలను మార్చి కోవిడ్-19 చికిత్స కోసం సిద్ధంచేశారు. కరోనావైరస్ శరీరంలో వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు, దాని జన్యు కోడ్‌లో లోపాలను ప్రవేశపెట్టగలిగేలా ఈ మాత్రను రూపొందించారు. అంటే ఇది శరీరంలోకి ప్రవేశించి, లోపల ఉన్న వైరస్ జన్యువులను ఛిన్నాభిన్నం చేస్తుంది. మొత్తం 775 మంది రోగులపై చేసిన అధ్యయనంలో.. మోల్నుపిరావిర్ తీసుకున్న రోగుల్లో 7.3% మంది మాత్రమే ఆస్పత్రిలో చేరారు.

 2022-05-10  Health Desk