collapse
...
Home / ఆరోగ్యం / గుండె వ్యాధులు / Good Health: పరేషాన్ లు ఎక్కువ.. పరీక్షలు తక్కువ.. - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News...

Good Health: పరేషాన్ లు ఎక్కువ.. పరీక్షలు తక్కువ..

2022-05-10  Health Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

heartproblems
 

రక్తహీనతతో బాధ పడుతూ, దానిని నిర్లక్ష్యం చేసి గుండె సంబంధిత వ్యాధుల దాకా తీసుకు వస్తున్న పరిస్థితులు భారతదేశంలో గణ నీయంగా పెరుగుతున్నాయి.. కానీ ఇందుకు సంబంధించిన పరీక్షలను చేసుకొని ప్రమాదకర పరిస్థితుల నుంచి ముందస్తు జాగ్రత్తగా గట్టెక్కే అవకాశం ఉన్నప్పటికీ చాలా మంది ఈ దిశగా నిర్లక్ష్యం చేస్తున్నారు. తమ లో వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నప్పటికీ పరీక్షల కోసం ముందుకు రానివారి సంఖ్య  ఎక్కువగా ఉన్నట్లు ఇటీవల ఓ సర్వేలో తేలింది.

 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5 డేటా పేరిట నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దేశంలో హైపర్ టెన్షన్ తో బాధపడుతున్న వారి సంఖ్య మహిళల్లో 33 శాతం, మగవారిలో 46 శాతం ఉన్నట్లు  సర్వే ద్వారా వెలుగులోకి వచ్చింది. అయితే ఇందుకు సంబంధించిన పరీక్షల విషయంలో మహిళలు కేవలం 7 శాతం ఉండగా, మగవారు ఆరు శాతం మాత్రమే ఉన్నారు. ఇటీవల దేశంలో జరిగిన ఒక ఆరోగ్య సర్వే లో ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరు, ప్రతి నలుగురు మగాళ్లలో ఒకరు రక్తపోటుతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. ఈ రక్తపోటును తొలిదశలో నిర్లక్ష్యం చేస్తే క్రమంగా దీని వల్ల గుండె పరిమాణం పెరిగి గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. గుండెపోటుకు కూడా ఇది కారణం అవుతుంది. 

ఎన్ ఎఫ్ హెచ్ ఎస్ -5 డేటా ఆధారంగా జాతీయ నివేదిక ప్రకారం దేశంలో క్యాన్సర్ స్క్రీనింగ్ కవరేజ్ తక్కువగా ఉందని తేలింది. దేశ వ్యాప్తంగా కేవలం 1.2 శాతం  మహిళలు మాత్రమే గర్భాశయ పరీక్షలు చేయించుకుంటూ ఉండగా, 0.6 శాతం మంది రొమ్ము పరీక్షలు చేయించుకుంటున్నారు. మగవారిలో ఏడు శాతం మంది మాత్రమే నోటి పరీక్షలు చేయించుకుంటున్నారు. 2010లో కేన్సర్, డయాబె టిస్, కార్డియో వాస్కులర్ సంబంధిత వ్యాధులు, గుండె పోటు నివారణ, నియంత్రణల నిమిత్తం  జాతీయ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కానీ దీని గణాంకాలు పేలవంగా ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. పరీక్షలకు సంబంధించి ఆరోగ్య శాఖ ద్వారా నిర్ణీత వయసును 18 నుంచి 15 ఏళ్లకు తగ్గించారు. సర్వే ప్రకారం 15 ఏళ్లు పైబడిన స్త్రీల లో 21 శాతం మందికి, మగవారిలో 24 శాతం మందికి రక్తపోటు అధికంగా ఉన్నట్లు నిర్ధారించారు.

గ్లూకోజ్ స్థాయి ఇలా..   
ఈ సర్వే ద్వారా నిర్వాహకులు భారతీయుల రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిని కూడా పరిశీలించారు. మహిళలతో పోలిస్తే మగవారిలోని ఈ స్థాయి కొంచెం ఎక్కువగా ఉందని నిర్ధారించారు. 15 ఏళ్ల కు మించిన వయసు ఉన్న మహిళల్లో ఆరు శాతం మంది అధిక గ్లూకోజ్ స్థాయిని కలిగి ఉండగా, మగవారిలో ఇది 14 శాతం అధికంగా ఉంది. అంతేకాకుండా మతాల వారీగా కూడా అంచనా వేశారు. క్రైస్తవ మతంలో గ్లూకోజ్ స్థాయి విషయంలో మహిళలే ఒక శాతం ఎక్కువగా ఉన్నారు. మహిళల్లో 18 శాతం ఈ స్థాయి ఉండగా పురుషుల్లో 17శాతం మాత్రమే ఉంది. రాష్ట్రాల వారీగా తీసుకుంటే మహిళల్లో గ్లూకోజ్ స్థాయి అతి తక్కువగా లడక్ లో ఆరు శాతం ఉండగా, అత్య ధికంగా కేరళలో 21 శాతం ఉంది. ఇక మగవారి విషయానికి వస్తే జమ్మూ కాశ్మీర్ లో అతి తక్కువగా  ఏడు శాతం ఉండగా, గోవా, కేరళలలో 22 నుంచి 24 శాతం వరకు ఉంది.

మరణాల రేటు ఇలా.   
సర్వేలో భాగంగా ఎన్ ఎఫ్ హెచ్ ఎస్-5 రెండు దశల్లో సర్వే నిర్వహించారు. క్రూడ్ మరణాల రేటు కు సంబంధించి ఈ సర్వే జరిగింది. ఇందులో భాగంగా 7,24,115 మంది మహిళలను, 1,01,839 పురుషులను సర్వే లోకి తీసుకున్నారు. మొత్తం 6,36,699 ఇళ్ల నుండి సమాచారాన్ని సేకరించారు. తొలిదశలో 17 రాష్ట్రాలు, ఐదు కేంద్రపాలిత ప్రాంతాలలో సర్వే నిర్వహించగా, రెండవ దశలో 11 రాష్ట్రాలు మూడు యూటీల  నుంచి  సర్వే కొనసాగింది. 2019 జూన్ నుంచి 17 నుంచి 2021 ఏప్రిల్ 30 వరకు ఈ సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ద్వారా ప్రతి వెయ్యి మందిలో తొమ్మిది మంది మగవారు, ఎనిమిది మంది మహిళలు మృత్యువాత పడుతున్నట్లు నిర్ధారించారు.

ఈశాన్య, పశ్చిమ, ఉత్తర రాష్ట్రాలలో మరణాల రేటు తక్కువగా ఉండగా, నాగాలాండ్, తమిళనాడు  రాష్ట్రాలలో ఎక్కువగా ఉన్నట్లు గుర్తిం చారు. ఆరోగ్య పరీక్షలపై పట్టణాలలో ఉన్న చైతన్యం గ్రామీణ ప్రాంతాలలో లేకపోవడం వల్లనే మరణాల రేటు పెరుగుతుందని చెబు తున్నారు. చాప కింద నీరులా శరీరంలో ప్రవేశించి ప్రాణాంతక పరిస్థితులను తెచ్చిపెట్టే రక్తపోటు విషయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకునేలా చైతన్యం తీసుకురావాలని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆరోగ్య శాఖకు నివేదిక కూడా అందిం చారు. ఆరోగ్యశాఖ ప్రస్తుతం దీనిపై కసరత్తులు చేసి రక్తపోటు నివారణ దిశగా ప్రజలను మమేకం చేసి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టే దిశగా అడుగులు వేస్తోంది.2022-05-10  Health Desk