collapse
...
Home / ఆరోగ్యం / చర్మ సంరక్షణ / Good Health: స్కిన్ అలెర్జీకి కారణాలేంటి? ఎలా బయటపడవచ్చు? - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News...

Good Health: స్కిన్ అలెర్జీకి కారణాలేంటి? ఎలా బయటపడవచ్చు?

2022-05-11  News Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

skincare

స్కిన్ అలెర్జీ రావడానికి ఇదీ అదీ అని కారణం చెప్పలేం. మనం తీసుకునే ఆహారం కారణంగా రావచ్చు. ఔషధం, గాలి, నీరు, కీటకాలు, వంటివి కూడా అలెర్జీకి కారణం కావచ్చు. రోజురోజుకీ వాయుకాలుష్యం పెరిగిపోతోంది. దీని ప్రభావం చర్మంపై పడుతుంది. చర్మం ముడుతలు పడడం, ఒంటి నిండా మచ్చలు రావడం వంటి అనేక సమస్యలు ఏర్పడతాయి. ఇక ఏసీల్లో ఉండేవారు.. ఎండలో తిరగాలంటే రెండు రకాల వాతావరణానికి హార్మోన్స్ తట్టుకోలేకపోతున్నాయి. ఇక నిద్ర లేమి కూడా చర్మంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఒకొక్కసారి దురద, దద్దుర్లు వంటి సాధారణ చర్మ సమస్యలు ఏర్పడి.. ఇబ్బంది పెడుతుంటాయి. ఇక మనం తీసుకునే ఆహారం పడకున్నా కూడా అలెర్జీ సర్వసాధారణంగా వస్తుంది. కీటకాల కాటు వలన, కాంటాక్ట్ అలెర్జీలు కూడా ఉన్నాయి. మనలోని రోగనిరోధక వ్యవస్థ బయటి పరిస్థితులకు సైతం ప్రభావితమవుతూ ఉంటుంది.

మనకు చర్మ అలెర్జీ ఎందుకు వస్తుంది? కారణాలు :

చర్మ అలెర్జీకి గల కారణాలపై డెర్మటాలజిస్ట్‌లు ఏం చెబుతున్నారంటే.. “చర్మ అలెర్జీలు ఒక రకమైన హైపర్సెన్సిటివిటీ రియాక్షన్‌ను కలిగి ఉంటాయి. ఇవి ప్రధానంగా వేరుశెనగ, పాలు, గుడ్డు, సోయా, గోధుమలు వంటి సాధారణ అలెర్జీ కారకాలతో సంబంధం కలిగి ఉంటాయి. పాయిజన్ ఐవీ, నికెల్ వంటి లోహాలు, రబ్బరు పాలు, దుస్తులు, సంరక్షణకారులను, మందులు, సువాసన కొన్నిసార్లు అలంకరణ వస్తువుల వల్ల కూడా అలెర్జీ వస్తుంది. అలెర్జిక్ కాంటాక్ట్ డెర్మటైటిస్ అని కూడా పిలువబడే ఒక రకమైన కాంటాక్ట్ డెర్మటైటిస్ వలన స్కిన్ అలర్జీలు సంభవిస్తాయి. అయితే అలెర్జీల విషయంలో రోగనిరోధక వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. సాధారణంగా రోగనిరోధక వ్యవస్థ ఏదైనా అలెర్జీ కారకాల నుంచి మన శరీరాన్ని రక్షిస్తుంది. ఏదైనా అలెర్జీకి గురవుతున్నప్పుడు వెంటనే శరీరం గుర్తించి యాంటీ బాడీలను ఉత్పత్తి చేస్తుంది. రోగనిరోధక శక్తి దాడి కణాలను (లింఫోసైట్‌లు) లక్ష్యంగా చేసుకుని నాశనం చేస్తుంది’’ .

ఈ సింపుల్ చిట్కాలతో స్కిన్ అలెర్జీ నుంచి బయటపడవచ్చు..

స్కిన్ అలెర్జీ నుంచి బయటపడటానికి ఆయుర్వేదం ఎన్నో చిట్కాలను సూచిస్తోంది. కొబ్బరినూనెలో గంధం పొడిని కలిపి ఈ మిశ్ర మాన్ని అలెర్జీ ఉన్న చోట రాస్తే అది క్రమంగా తగ్గిపోతుంది. వేపచెట్టు బెరడు కషాయం తాగినా చర్మ వ్యాధులు తగ్గుతాయి. మెట్టతామర ఆకు పసరు, నిమ్మకాయ రసం కలిపి ఈ మిశ్రమాన్ని ఎఫెక్టెడ్ ప్రదేశంలో రాస్తే చర్మ వ్యాధి నయమవుతుంది. మోదుగ విత్తనాలు నిమ్మరసంతో కలిపి అరగదీసిన ఆ మిశ్రమాన్ని చర్మానికి రాసినా చర్మరోగాలు తగ్గుతాయి. నల్ల ఉమ్మెత్త రసం రాసినా చర్మరోగాలు తగ్గిపోతాయి. ఎర్రగన్నేరు వేరు నేతిలో వేసి మరిగించి ఆ తైలాన్ని అప్లై చేసినా చర్మ సమస్యలు నయమవుతాయి. నల్లజీలకర్ర, నీలి ఆకులు మెత్తగా నూరి చర్మానికి అప్లై చేసినా చర్మరోగాలు తగ్గుతాయి. పనస చెట్టు ఆకులు నూరి ఆ పేస్ట్ చర్మానికి అప్లై చేసినా ఎటువంటి స్కిన్ అలెర్జీ అయినా మాయమై పోతుంది. దురదతో ఉండే చీముపొక్కులుతో ఇబ్బంది పడేవారు తాటి కల్లుతో బియ్యపు పిండి కలిపి పులియబెట్టి రాస్తే ఉపశమనం కలుగుతుంది.
 2022-05-11  News Desk