మోడల్ , నటి యామీ గౌతమ్ ఫ్యాషన్ స్టైల్స్ అందరినీ అట్రాక్ట్ చేస్తాయి. మోనోక్రోమ్ లుక్ నుంచి ఎత్నిక వేర్ అవుట్‌ఫిట్స్ వరకు అన్ని రకాల దుస్తులు ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటాయి. తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్‌ను ఓసారి గమనిస్తే తన వార్డ్ రోబ్ ఎంత ట్రెండీగా స్టైలిష్‌గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఈ బ్యూటీ బాడీ హగ్గింగ్ అవుట్‌ఫిట్ వేసుకుని ఫ్యాన్స్‌ను ఫిదా చేసేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రస్తుతం చిన్నదాని ట్రెండీ అవుట్‌ఫిట్ పిక్స్ ట్రెండ్ సెట్ చేస్తున్నాయి.
బాడీ హగ్గింగ్ డ్రెస్‌లో యామీ గౌతమ్ సో హాట్ :
తన లుక్స్ రోజు రోజుకు మరింత అట్రాక్టివ్‌గా కనిపించేందుకు బాలీవుడ్ బ్యూటీ యామీ గౌతమ్ విభిన్నమైన అవుట్‌ఫిట్స్‌తో ప్రయోగాలు చేస్తుంటుంది.
డిజైనర్ దుస్తుల నుంచి ట్రెండిషనల్ అవుట్‌ఫిట్స్ వరకు పెర్ఫెక్ట్గా తనకు సెట్ అయ్యేలా ఎన్నుకోవడంలో ఈ బ్యూటీ ఎప్పుడూ నిరుత్సాహపరచలేదు.
తాజాగా ఈ చిన్నది ఓ ఫోటో షూట్ కోసం ధరించిన పసుపు పచ్చని బాడీ హగ్గింగ్ డ్రెస్ ఇప్పుడు ఫ్యాషన్ ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది. తొడవరకు చీలికతో ఉన్న ఈ అవుట్‌ఫిట్ కుర్రకారు మనసును దోచేస్తోంది. యామీ ఫిగర్‌కు కరెక్ట్‌గా సూట్ అయ్యేలా ఈ డ్రెస్‌ను రూపొందిం చారు డిజైనర్లు. పసుపు రంగు కూడా యామికి సరికొత్త అందాన్ని తీసుకువచ్చింది.
ఫ్యాషన్ గేమ్‌ను సరికొత్త లెవెల్‌కు తీసుకెళ్తున్న యామీ:
యామీ గౌతమ్ తన ఫ్యాషన్ గేమ్‌ను సరికొత్త లెవెల్‌కు తీసుకెళ్తోంది, ప్రతి దానికి న్యాయం చేస్తోంది. అందులో ఓ అందమైన అవుట్ఫిట్టే ఈ పసుపు రంగు బాడీ హగ్గింగ్ డ్రెస్. ప్లంగింగ్ నెక్లైన్, షోల్డర్ స్ట్రాప్ డీటైల్స్‌తో తొడ భాగంలో ఉన్న హై స్లిట్ ఈ డ్రెస్‌కు స్టైలిష్ లుక్‌ను తీసుకు వచ్చాయి. ఈ అందమైన ట్రెండీ అవుట్‌ఫిట్‌ను యామీ గౌతమ్ రితి రాహుల్ షాహ్ క్లాతింగ్ లేబుల్ నుంచి సేకరించింది. ప్రముఖ స్టైలిస్ట్ అల్లియా అల్ రుఫాయ్ యామికి స్టైలిష్ లుక్స్‌ను అందించింది. ఈ డ్రెస్‌కు తగ్గట్లుగా ట్రెండీగా కనిపించేందుకు యామి తన సిల్కీ కురులను లూజ్‌గా వదిలేసింది. ఫ్రెష్ డివీ మేకప్ వేుకుని సింపుల్‌గా రెడీ అయ్యింది. ఎలాంటి ఆభరణాలు లేకుండా చాలా సింపుల్ మేకప్‌తో ఎంతో హాట్‌గా కనిపించింది.
ఎరుపు రంగు కో-ఆర్డ్ సెట్‌తో అదరగొట్టింది:
అంతకు ముందు యామీ గౌతమ్ ఎరుపు రంగు కో-ఆర్డ్ సెట్ ధరించి అందరి చూపును తనవైపు తిప్పుకుంది. రఫెల్డ్ స్లీవ్స్ కలిగిన క్లోస్డ్ నెకటాప్ వేసుకుని దానికి మ్యాచింగ్‌గా హై రైజ్ ట్రౌజర్స్‌ను ధరించి చేసిన ఫోటో షూట్ పిక్స్ కూడా నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి. సింపుల్ మేకప్‌తో స్టన్నింగ్ లుక్స్‌తో ఈ చిన్నది తన అందాలతో యూత్ మతులు పోగొట్టింది.
జంప్ సూట్లో స్టైలిష్ లుక్స్ :
ఇటీవలె ఈ బ్యూటీ మోనోక్రోమ్ జంప్ సూట్ వేసుకుని అదరగొట్టింది. డీప్ వి నెక్లైన్తో నడుము వద్ద వచ్చిన స్టైలిష్ బెల్డ్ ఈ జంప్ సూట్‌కు మరింత అందాన్ని అందించాయి. కింద నుంచి పైకి ఒకే రంగులో ఉన్న ఈ జంప్‌సూట్‌లో ఎంతో అందంగా కనిపించింది ఈ చిన్నది. తన కురు లకు వేవీ లుక్స్ వచ్చేలా లూజ్‌గా వదిలి, సింపుల్ మేకప్‌తో, పాదాలకు హీల్స్ వేసుకుని మెరిసేటి ఛర్మంతో ఎంతో మెస్మరైజింగ్ లుక్స్‌తో చంపేసింది.
సమ్మర్ కోసం ఫ్లోరల్ మిడి డ్రెస్ :
ఇక వేసవి వేళ కూల్ ఫ్యాషన్ స్టేట్మెంట్స్ చేసింది ఈ భామ. ఫ్లోరల్ మిడి డ్రెస్ వేసుకుని అందరి చూపును తనవైపు తిప్పుకుంది. తెలుపు, పసుపు రంగుల కాంబినేషన్లో వచ్చిన ఈ అవుట్‌ఫిట్ ఫ్యాషన్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది.
లాంగ్ ట్రెంచ్ కోట్ లుక్స్ అదుర్స్:
ఇక తన సినిమా దస్వీ ప్రమోషన్స్ కోసం అప్పట్లో యామి గౌతమ్ స్టైలిష్ లాంగ్ ట్రెంచ్ కోట్ ను వేసుకుంది. ఈ అవుట్‌ఫిట్‌కు ఉన్న మల్టిపుల్ బటన్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి.