collapse
...
Home / లైఫ్ స్టైల్ / ఫ్యాషన్ / Fashion: లక్షణమైన కలంకారీ చీరలో కుందనపు బొమ్మ అందాలు - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | Ne...

Fashion: లక్షణమైన కలంకారీ చీరలో కుందనపు బొమ్మ అందాలు

2022-05-12  Lifestyle Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

మోడ్రన్ అవుట్‌ఫిట్స్‌తో మతులుపోగొట్టడమే కాదు చీరకట్టుతో అందరి చూపులను తనవైపు తిప్పుకోగలదు అందాల బుట్టబొమ్మ పూజా హెగ్దె. వరుసగా తెలుగుతమిళ సినిమాల రిలీజ్‌లతో బిజీ బిజీగా గడుపుతున్న ఈ చిన్నది ఫోటో షూట్‌ల కోసం కూడా కాస్త సమయాన్ని కేటాయి స్తూ ఫ్యాషన్ స్టేట్‌మెంట్స్‌ ఇచ్చేస్తోంది. ఈ చిన్నది ప్రస్తుతం బాలీవుడ్‌లో సర్కస్ సినిమాలో నటిస్తోంది. ఓ వైపు షూట్ పనులు చేసుకుంటూనే తాజాగా కలంకారీ చీరకు మ్యాచింగ్‌గా స్లీవ్‌లెస్ బ్లౌజ్ వేసుకుని ఓ ఫోటో షూట్‌ చేసి అదరగొట్టింది. ప్రస్తుతం పూజా చీరకట్టు సొగసులు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ముద్దుగుమ్మ అందాలను చూసి అభిమానులు మురిసిపోతున్నారు.

pooja hegde 1-1
 

 

కలంకారీ చీరలో ఖతర్‌నాక్ లుక్స్ : 

సినీ ఇండస్ట్రీలో ఫ్యాషన్ స్టైల్స్‌ను ఫాలో అవుతూ స్టైలిష్ వైబ్స్‌ను తీసుకువచ్చే స్టార్ హీరోయిన్‌ల జాబితాలో చేరిపోయింది ముద్దుగుమ్మ పూజా హెగ్దె. ఇటీవల రణవీర్‌ సింగ్జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌లతో కలిసి చేస్తున్న సర్కర్ సినిమా మొదటి పోస్టర్‌ను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా విడుదల చేసిన పూజాకు విభిన్న వస్త్రాలతో ప్రయోగాలు చేయడం అంటె ఎంతో ఇష్టం.మినీ డ్రెస్సెస్, కో-ఆర్డ్ సెట్స్ట్రెండీ ప్యాంట్‌సూట్స్‌ ఇలా ఒకటేమిటి ఆమె పర్సనల్ వార్డ్‌రోబ్‌లో విభిన్నమైన కలెక్షన్స్‌తో పాటు సాంప్రదాయ దుస్తులు అందరి ఫేవరేట్‌గా మారుతాయి అనడంలో ఎలాంటి సందే హం లేదు. తాజాగా ఈ బ్యూటీ తన ఫాలోవర్స్‌ను చీరకట్టుతో ఫిదా చేసింది. హ్యాండ్ పెయింటెడ్ పట్టు చీరకు జతగా స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి విభిన్న ఫోజులు ఇచ్చి చేసిన ఫోటో షూట్ పిక్స్‌ను పూజా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోల కింద బ్లిస్ అని క్యాప్షన్‌ను జోడించిం ది. ఈ ఆరు గజాల అందమైన చీరను పూజా హ్యాండ్‌ క్రాఫ్టెడ్ క్లాతింగ్ లేబుల్ అర్చనా జాజు షెల్ఫ్‌ నుంచి సేకరించింది.

pooja hegde-2
 

చీర ధర రూ.1లక్ష పైనే: 

చీర డిజైన్ వివరాలకు వస్తే పూజా తన ఫోటో షూట్ కోసం క్రీం కలర్ జరీ బూటీ పట్టు చీరను ఎంచుకుంది. బ్లూ, గ్రీన్, మస్టర్డ్, పింక్ షేడ్స్‌తో సహజ సిద్ధమైన డైస్ ఉపయోగించి చేయబడిన హ్యాంట్ పెయింటెడ్ కలంకారీ డిజైన్స్‌ ఎంతో ఆకట్టుకుంటాయి. బంగారపు ఫ్లోరల్ బ్లాక్ ప్రింట్స్‌, బార్డర్లలో వచ్చిన గోటా పట్టీ ఎంబ్రాయిడరీలు చీరకు అందమైన రూపును తీసుకువచ్చాయి. ఈ చీరకు మ్యాచింగ్‌గా క్రీం కలర్ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌ను వేసుకుంది. ఈ బ్లౌజ్‌కు కలంకారీ వర్క్జల్ ఎంబ్రాయిడరీని అందించారు డిజైనర్లు. డీప్ వి నెక్‌లైన్‌తో వచ్చిన ఈ బ్లౌజ్ మోడ్రన్‌ మహిళలను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ అందమైన చీర అర్చనా జాజు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. దీని ధర రూ. 1,08,999.

 

pooja hegde 3
 

ట్రెడిషనల్ లుక్‌తో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది: 

ఈ చీరకు తగ్గట్లుగా ట్రెడిషనల్ లుక్స్‌తో యూత్ మతులుపోగొట్టింది ముద్దుగుమ్మ. చేతులకు కుందన్ గాజులు వేసుకుంది. చెవులను అందమై న ముత్యాలతో పొదిగిన బంగారపు కుందన్ ఇయర్‌రింగ్స్‌తో అలంకరించుకుంది. చేతి వేళ్లకు ఉంగరాలుపాదాలకు పీప్‌ టో స్యాండిల్స్ వేసు కుంది.

ఇక ఫినిషింగ్ టచ్‌గా తన కురులను సైడ్ పాపిట తీసుకుని సముద్రపు అలలు ఊగినట్లు లూజ్‌గా వదులుకుంది. కనులకు సబ్టిల్ ఐ ష్యాడోస్లీక్ ఐ లైనర్మస్కరా వేసుకుంది. పెదాలకు పింక్ లిప్‌ షేడ్ దిద్దుకుని మెరిసేటి ఛర్మంతో ఎంతో గ్లామరస్‌గా కనిపించి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది.2022-05-12  Lifestyle Desk