collapse
...
Home / అంతర్జాతీయం / టిబెట్ లో విద్యావిధానానికి చైనా షాక్ - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu |...

టిబెట్ లో విద్యావిధానానికి చైనా షాక్

2022-05-12  International Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

china-10
 

టిబెట్ పౌరుల ఆలోచనలను వలసీకరించే చివరి ఉపకరణంగా విద్యను ఉపయోగిస్తున్న చైనా అనే అంశంపై ఇటీవల ఒక అంతర్జాతీయ  వెబినార్‌ జరిగింది. దీనిలో పాల్గొన్న కొంతమంది నిపుణులు టిబెటన్ల అస్తిత్వానికే గండికొడుతున్న చైనా విద్యావిధానం పట్ల భయాందోళనలు వ్యక్తం చేశారు. టిబిటెన్ ప్రజలను డీటిబెటనైజ్ (టిబెటన్ అస్తిత్వాన్ని లేకుండా చేయడం) చేయడానికి చైనా అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఈ నిపుణుల అభిప్రాయం. దీంతో ఈ అంశంపై ప్రపంచం,  ప్రపంచ ప్రభుత్వాలు సీరియస్‌గా ఆలోచించాలని వీరు కోరుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం రెసిడెన్షియల్ పాఠశాలల గొలుసు ద్వారా చైనా ప్రభుత్వం కేంపె యిన్ మొదలుపెట్టేసింది. వలసవాద,  కమ్యూనిస్టు సాధనాల ద్వారా ఈ పాఠశాలల్లో టిబెటన్లను చైనా అధికారులు బ్రెయిన్ వాష్ చేస్తు న్నారని టిబెట్ ప్రెస్ నివేదించింది.

 ధర్మశాలలోని టిబెట్ పాలసీ ఇనిస్టిట్యూట్‌లో రీసెర్చ్ ఫెలోగా ఉంటున్న కర్మా టెంజెన్ పరిశోధన,  ఆనాటి చైనా చైర్మన్ మావో జెడాంగ్ టిబెట్‌ను ధ్వంసం చేసిన విధానం గురించి చెబుతోంది. సాంస్కతిక విప్లవ కాలంలో చైనా విద్యా విధానం టిబెట్ సంస్కృతిని హరించి వేసిందని , తర్వాతి సంవత్సరాల్లో కొత్త విద్యా విధానం ప్రారంభించారని కర్మా టెంజెన్ పరిశోధనా వ్యాసం తెలిపింది.

నూతన విద్యావిధానంలో చైనా ప్రధాన లక్ష్యం ఏమిటంటే, టిబెట్ భాషను నిర్మూలించి,  టిబెటన్ విద్యార్థులకు చైనీస్ మాండరిన్ భాష ను విద్యా , బోధనా మాధ్యమంగా రుద్దడమే. చైనా యజమానులతో పోలిస్తే టిబెటన్లు అధీనులని,  తక్కువ స్థాయివారని ముద్రిస్తున్న తప్పుడు,  పక్షపాత చరిత్ర పాఠాలను యువకులకు బోధిస్తున్నారు.  ఇది టిబెటన్ల మనస్సులను వలసీకరించే అసలు సిసలు సాధనంగా తనవంతు పాత్ర పోషిస్తోంది.

టిబెట్ సాలిడారిటీ సహ వ్యవస్థాపకుడు ఎలేనార్ బైర్న్ రొసెన్‌గ్రెన్ రూపొందించిన మరో నివేదిక ప్రకారం 86 వేల మంది టిబెటన్ పిల్లలను చైనా బోర్డింగ్ పాఠశాలల్లో చేరేలా బలవంతం చేశారు. వారిని తమ కుటుంబాలనుంచి పూర్తిగా వేరుపర్చారు. ఇక పోతే టిబెటన్ల సాంస్కృతిక అస్తిత్వాన్ని రద్దుపర్చి చైనా కమ్యూనిస్టు అస్తిత్వాన్ని చేపట్టేలా వాళ్లను మలుస్తున్నారు.

బ్రిటన్ లోని ఫ్రీ టిబెట్ సంస్థకు చెందిన జాన్ జోన్స్ అనే అతను చైనా నిర్వహిస్తున్న టిబెట్ బోర్డింగ్ స్కూల్స్‌లో అమలవుతున్న ప్రస్తుత చైనా విద్యావిధానాన్ని దుయ్యబట్టారు. ఇది దురాక్రమణ బలగానికి సంబంధించిన వ్యాధి చిహ్నం అన్నారాయన. ఈ పాఠశాలలనుంచి తప్పించుకోవడానికి వీలులేకుండా చైనాయువతను దాచి ఉంచేశారు. స్థానిక ఆలయంలోకి కానీ,  ఏదైనా టిబెట్ పర్వదినం వేడుకల్లో కానీ పాల్గొనకుండా వీరిని కట్టడి చేశారు. టిబెట్ పిల్లల మనస్సులను రీప్రోగ్రామ్ చేయడానికి ఈ పాఠశాలలు విద్యను ఉపయోగిస్తున్నాయని జాన్ జోన్స్ చెప్పారు.

టిబెట్‌లోని చైనీస్ బోర్డింగ్ స్కూల్స్ ద్వారా టిబెట్ పిల్లలకు బలవంతంగా విద్య నేర్పించడం అనేది టిబెటన్ ప్రజల హృదయాలను గెల్చుకోవడంలో చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ వైఫల్యం అనే చెప్పాల్సి ఉంది. టిబెట్‌లో వలసపాలనను స్థాపించడంలో చైనాపాలకుల పరాజయానికి ఇది తార్కాణం అని చెప్పవచ్చు. ఏడు దశాబ్దాల వలసపాలన తర్వాత కూడా టిబెట్ ప్రజలను చైనా పాలకులు గెల్చుకోవడంలో విఫలమైన తర్వాత , తమ జీవితకాలంలో దలైలామాను ఎన్నడూ చూడని , ఫ్రీ టిబెట్‌ను చూడని టిబెటన్ యువత టిబెట్‌లో చైనా పాలనకు వ్యతిరేకంగా ముందుపీఠిన ఉండి ప్రదర్శనలు చేస్తారని , ఆత్మాహుతులకు పాల్పడతారని చైనా యజమానులు అసలు ఊహించి ఉండరు.2022-05-12  International Desk