collapse
...
Home / వినోదం / తెలుగు / డేంజ‌ర్ జోన్‌లోకి ఇండ‌స్ట్రీ వెళ్ళిపోతుందా? - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Te...

డేంజ‌ర్ జోన్‌లోకి ఇండ‌స్ట్రీ వెళ్ళిపోతుందా?

2022-05-13  Entertainment Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

 

herosf-1
కరోనా కార‌ణంగా ప్ర‌తి చోటా.. ప్ర‌తి ఇండ‌స్ట్రీలో.. ప్ర‌తి విష‌యంలో ప‌రిస్థితుల‌న్నీ కూడా బాగా మారిపోయాయి. క‌రోనా పాండ‌మిక్ వ‌ల్ల గ‌త రెండేళ్ళ‌లో సినీ ఇండ‌స్ట్రీలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. కొంత కాలం థియేట‌ర్లు మూసివేయ‌డం.. షూటింగ్‌లు ఆగిపోవ‌డం దీంతో ఇండ‌స్ట్రీ మొత్తం చాలా న‌ష్టాల భారిలో ప‌డిపోవ‌డం జ‌రిగింది.

ఇక‌ వినోదం కోరుకునే ప్రేక్షకులకు ఓటీటీలు పరిచయమయ్యాయి. ఇప్పటివరకు బిగ్ స్క్రీన్ మీద సినిమాలు చూసి ఎంజాయ్ చేసే ఆడియన్స్.. ఓటీటీలలో స్మాల్ స్క్రీన్ పై సినిమాలు చూడటానికి అలవాటు పడిపోయారు. ఫ్యామిలీ మొత్తం సినిమా హాల్‌కి వెళ్ళి సినిమాలు చూసే రోజులు పోయాయి. అయితే దానికి కార‌ణం లేక‌పోలేదు. ఓ ప‌క్క వైర‌స్ భ‌యం అయితే మ‌రో ప‌క్క టికెట్ రేట్ల బాధుడు ఎక్కువ‌యిపోయింది. ఈ స‌మ‌స్య‌లన్నిటితో ఫ్యామిలీలు థియేట‌ర్ల‌కు వెళ్ళి సినిమాలు చూడ‌డం ఎక్కువ‌గా అయిపోయాయి.

ఈ ఏడాదిలో తెలుగులో ఇప్పటి వరకు 35కి పైగా సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. అందులో అర డజను చిత్రాలు కూడా ప్రేక్షకాదరణ పొందలేదంటే పరిస్థితి ఎంత భ‌యంక‌రంగా ఉన్నాయో చూసుకోవ‌చ్చు. ఇక బాలీవుడ్ సిచ్యుయేషన్ మరీ దారుణంగా ఉంది. స్టార్ హీరోలు చేసిన సినిమాలు మినిమమ్ ఓపెనింగ్స్ రాబట్టలేకపోతున్నాయి.

ఎంత మంచి సినిమా తీసినా.. జనాలు థియేటర్లకు వచ్చి చూడటానికి పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు. కాకపోతే ఆర్‌.ఆర్‌.ఆర్‌. - కేజీయఫ్ 2 - పుష్ప వంటి మాస్ అండ్ యాక్షన్ జోనర్ సినిమాలను చూడటానికి ఇష్టపడుతున్నారు. దీనిని బట్టి ఒకప్పుడు రెగ్యులర్ గా సినిమాలకు వెళ్లే ఆడియన్స్ మనస్తత్వం పాండమిక్ తర్వాత పూర్తిగా మారిపోయిందని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో తాజాగా 'అశోకవనంలో అర్జున కల్యాణం' మూవీ సక్సెస్ మీట్ కి హాజరైన అగ్ర నిర్మాత అల్లు అరవింద్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమ చాలా సమస్యల్లో ఉందని.. కోలుకొని మళ్ళీ ముందుకు వెళ్లాలంటే ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని.. ఎప్పటిలాగే ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాలు చూడాలని ఆకాంక్షించారు.

ఇక చాలా మంది పెద్ద నిర్మాత‌లు కూడా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ పెట్టి సినిమాల‌న్నీ కూడా ఓటీటీలో విడుద‌ల చేస్తున్నారు. దీంతో బ‌య‌ట‌కు వెళ్ళ‌ణి ప్రేక్షుకులు ఇప్పుడు ఓటీటీలో సినిమా ఎప్పుడొస్తుందా? అని ఎదురు చూసే కాలం వచ్చేసింది'' అని అల్లు అరవింద్ అన్నారు.

'అశోకవనంలో అర్జున కల్యాణం' లాంటి సినిమాలు నాలుగొస్తే ఆ రోజులు తప్పకుండా తిరిగి వస్తాయని అల్లు అరవింద్ అభిప్రాయ పడ్డారు. అంతేకాక హిందీ సినీ పరిశ్రమ పరిస్థితి కూడా ఏమాత్రం బాలేదని.. స్టార్ హీరోలు చేసిన సినిమాలకు కూడా కనీస ఓపెనింగ్స్ ఉండటం లేదని అన్నారు.

''ఇప్పుడు నార్త్ లో ఎంత మంచి సినిమా రిలీజ్ అయినా ఫస్ట్ డే ఓపెనింగ్స్ ఉండటం లేదు. పెద్ద పెద్ద యాక్టర్స్ కు కూడా ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చిందో అర్థం కావడం లేదు'' అని మెగా ప్రొడ్యూసర్ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' విడుదల అవుతోంది. అది సూపర్ హిట్ అవ్వాలని.. అందరూ థియేటర్లకు వెళ్లి సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అల్లు అరవింద్ అన్నారు.

అల్లు అరవింద్ చెప్పిన దాంట్లో నిజం ఉందనేది అందరూ అంగీకరించే వాస్తవమే. కాకపోతే ఇప్పుడు సినీ అభిమానుల అభిరుచి చాలా మారిపోయింది. ఓటీటీలు విరివిగా కంటెంట్ అందిస్తుండంతో.. కొన్ని సెలెక్టివ్ సినిమాలు చూడటానికి థియేటర్లకు వెళ్తున్నారు. అధిక టికెట్ రేట్లు ఉండటంతో.. ఎలాగూ మూడు నాలుగు వారాల్లో ఓటీటీలో వచ్చేస్తుంది కదా అనే ధోరణిలో ఉంటున్నారు ప్రేక్షకులు.
 2022-05-13  Entertainment Desk