collapse
...
Home / లైఫ్ స్టైల్ / ఫ్యాషన్ / జిల్ జిగేలుమంటున్న కళావతి చీర కట్టు - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu | N...

జిల్ జిగేలుమంటున్న కళావతి చీర కట్టు

2022-05-13  Lifestyle Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

keerthi suresh 1-1
 

కీర్తి సురేష్ ఫ్యాషన్ మంత్ర సింపుల్ గా ఉన్నా అవి చాలా ప్రభావవంతంగా కనిపిస్తుంటాయి. తన బాడి స్ట్రక్చర్ కు సెట్ అయ్యే దుస్తులను ధరించి అందరిలో స్పెషల్ అట్రాక్షన్ గా కనిపిస్తుంటుంది ఈ చిన్నది. లేటెస్ట్ ఫ్యాషన్ నుంచి ఎత్నిక్ లుక్స్ వరకు అన్నింటిని అంతే ఈజీ గా అలవాటు చేసుకుంటుంది. కీర్తి ఫ్యాషన్ డైరీలు ఎంతో అద్భుతంగా ఉంటాయంటున్నారు ఫ్యాషన్ ప్రియులు. ఆమె మారుకుతున్న కాలానికి అనుగుణంగా ఫ్యాషన్ ట్రెండ్స్ ఫాలో అవుతుంటుంది. కీర్తి ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్ ను ఒక్కసారి చెక్ చేస్తే ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు వీడియోలుఫోటో షూట్ పిక్స్ ఓ రేంజ్‌లో ట్రెండ్ అవుతుంటాయి. ఎత్నిక్ వేర్ లో ఫెస్టివ్ ఫ్యాషన్ స్టేట్‌మెంట్స్ ఇవ్వడంతో పాటుఫార్మల్ కో- ఆర్డ్ సెట్స్ తో బాస్ లేడీ లుక్ ను ప్రదర్శించి అందరి చూపును తన వైపుకు తిప్పుకుంటుంది ఈ ఫ్యాషన్ దివా. తాజాగా ఈ చిన్నది మరో అదిరిపోయే చీర కట్టుకుని అందరి మైండ్స్ బ్లాక్ చేసింది. ఓ ఫోటో షూట్ కోసం కీర్తి కట్టుకున్న ఈ చీర పిక్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. 

keerthi suresh 6
 

ఇన్‌స్టాగ్రమ్ ఎత్నిక్ స్టార్ కీర్తి సురేష్: 

చీర కట్టుకోవడం అంటే ఏ మగువకు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నిజానికి అలాంటి వారు భూమి మీద ఉండరంటే అతిశయోక్తి లేదేమో. 

ఎంతటి సెలబ్రిటీ అయినా ఈ ఎత్నిక్ వేర్ ధరించకుండా ఉండలేరు. ఇంకా చెప్పాలంటే చీరలు చాలా మంది సెలబ్రిటీల ఫేవరేట్ గా మారాయి. అలా విభిన్నమైన చీరలను కట్టుకుని శారీ స్టేట్‌మెంట్స్ ఇచ్చేస్తుంటుంది సౌత్ బ్యూటీ కీర్తి సురేష్‌. తాజాగా ఈ బ్యూటీ ఓ ఫోటో షూట్ కోసం అద్భుతమైన ఫాల్గుని షానె పికాక్ షీర్ బ్లష్ పింక్ చీరను కట్టుకుంది. ఈ చీరలో కీర్తి అందాలు చూపు తిప్పుకోనీయకుండా చేశాయి. షీర్ ఫ్యాబ్రిక్‌ను మిక్స్‌ చేసి మెరుపులను అద్ది ఈ చీరను ఎంతో అందంగా తీర్చి దిద్దారు డిజైనర్లు. మైళ్ల దూరం నుంచి చూస్తున్నా చీర అందాలు మిరిమిట్లు గొలుపుతున్నాయి. ఈ చీరకు మ్యాచింగ్‌గా వేసుకున్న స్వీట్ హార్ట్ నెక్‌లైన్ కలిగిన మెరుపుల బ్లౌజ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ మెరుపుల అదిరిపోయే అవుట్‌ఫిట్‌కు చాలా సింపుల్ జ్యువెల్లరీని పెట్టుకుంది కీర్తి. చెవులకు ఫ్లోరల్ స్టడ్స్ మినహా మరో ఆభరణాన్ని పెట్టుకోలేదు ఈ బ్యూటి. మేకప్ విషయంలోనూ చాలా సింప్లిసిటీని ఫాలో అయ్యింది. అయినా ఎంతో గ్లామరస్‌గా కనిపించి యూత్ మనసును దోచేసింది. 

 

keerthi suresh 3
 

తెల్ల చీరలో తారలా మెరిసిన కీర్తి సొగసులు: 

కీర్తి సురేష్‌ కట్టుకునే చీరలు ఎంతో ప్రత్యేకమైనవై ఉంటాయి. ఇటీవల ఈ చిన్నది కట్టుకుని తెల్లటి చీర మ్యాజిక్ చేసి అందరి చూపును దోచేసింది. సీక్విన్స్‌తో వచ్చిన ఈ చీరలో తారలా మెరిసింది కీర్తి. మెడలో వజ్రాల నెక్‌లెస్ చెవులకు ఇయర్‌రింగ్స్,చేతులకు గాజులుతలలో పూలు పెట్టుకుని సాంప్రదాయ ఆధునిక మహిళగా కనిపించి అందరినీ అలరించింది. ఈ చీరకు మ్యాచింగ్ వచ్చిన స్లీవ్‌లెస్ సీక్విన్ బ్లౌజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 

 

keerthi suresh 2
 

పాస్టెల్ గ్రీన్ చీరలో రెట్టింపైన సొగసులు: 

అంతకు ముందు ఓ ఫోటో షూట్ కోసం కీర్తి పాస్టెల్ గ్రీన్ చీరను కట్టుకుంది. సీక్విన్స్‌తో వచ్చి ఈ చీరలతో కీర్తి అందాలు రెట్టింపయ్యాయి. చీరంతా వచ్చి ఎంబ్రాయిడరీ సీక్విన్ డీటైల్స్ అందరిని ఆకర్షించాయి. మెడలో బంగారపు భారీ నెక్‌లెస్ వేసుకుని చెవులను అందమైన ఇయర్‌రింగ్స్‌తో అలంకరించకుని చేతికి గాజులుతలలో పూలు పెట్టుకుని క్యూట్ స్మైల్ తో అందరినీ కవ్వించింది ఈ బ్యూటీ 

keerthi suresh 4
 

రఫెల్డ్ చీరలో హల్ చల్ : 

ఇక అంతకు ముందు రఫెల్డ్ చీరలో హల్ చల్ చేసింది కీర్తి . కళావతి సాంగ్ కోసం ధరిచిన ఈ చీర నెట్టింట్లో తెగ వైరల్ అయ్యింది. అర్పితా మెహతా కలెక్షన్స్‌ను ఈ చీరను ఎన్నుకుంది ఈ ముద్దుగుమ్మ. ఫ్యాషన్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది. 

keerthi suresh 5
 2022-05-13  Lifestyle Desk