చంద్రుడిని చూశారు.. క్రమంగా చంద్రుడిని తాగుతారు.. చంద్రమండలం లో అడుగుపెట్టారు.. ఇప్పుడు ఏకంగా చంద్రునిపై సేద్యం సాధ్యమేనని గుర్తించారు.. అక్కడ మరో వ్యవసాయ ప్రపంచాన్ని సృష్టించేందుకు నడుం బిగించారు.. ప్రపంచ శాస్త్రవేత్తలు సాధించిన ఈ ఘనత అత్యాధునిక ప్రపంచంలో ఓ అరుదైన ఘనత.. దీనిపై 50 సంవత్సరాలుగా జరుగుతున్న పరిశోధనలు మొత్తానికి మంచి ఫలితాలనే ఇచ్చాయి. అప్పట్లో చంద్రమండలం నుంచి తెచ్చిన మట్టి లో మొక్కలను పెంచడం ద్వారా అక్కడ వ్యవసాయం చేయవచ్చని శాస్త్రవేత్తలు గుర్తించారు. వివరంగా ముందుకు వెళితే..
ఇలా మొదలైంది..
యూఎస్ ఆర్టెమిస్ మిషన్ ద్వారా మానవులు చంద్రమండలంపై కి వెళ్లాలని ప్రయత్నించినప్పుడు చైనా, రష్యా చేతులు కలిపి ఇక్కడ మానవ ప్రపంచాన్ని నిర్మించేందుకు గల అవకాశాలను సంపూర్ణంగా పరిశీలించాయి. ఇందులో భాగంగానే ఇక్కడ వ్యవసాయానికి గల అవకాశాలను పరిశీలించడం జరిగింది. ఇందులో భాగంగానే చంద్రుడి నుంచి సేకరించిన మట్టిలో తొలిసారిగా శాస్త్రవేత్తలు మొక్కలను పెంచడం, ఈ ప్రయత్నం విజయవంతం కావడం మరో కోణాన్ని ఆవిష్కరించింది. దీనికి సంబంధించి అపోలో యుగపు వ్యోమగాముల ను భూమి పైకి తీసుకు వచ్చిన శాస్త్రవేత్తలు 50 సంవత్సరాల తర్వాత సాంకేతికత ద్వారా విజయాన్ని సాధించగలిగారు. మొట్టమొదటిసారిగా పోషకాలు లేని చంద్రమండలంలో పరిశోధకులు ఉద్యానాల ఏర్పాటుపై అధ్యయనం చేశారు. ఈ క్రమంలోనే అరబి డోప్సిస్ థాలియానా అనే ఆఫ్రికా సాగును ఇక్కడ సాగు చేశారు. ఇది ఆవాలు, కాలీఫ్లవర్ లాంటి జాతి మొక్కలకు సంబంధించిందని నాసా వెల్లడించింది. ఫ్లోరిడా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్ర వేత్తల బృందం ఈ పురోగతి సాధించడం విశేషం. ఈ పరిశోధన ఎన్ ఏ ఎస్ ఏ కు సంబంధించిన దీర్ఘకాలిక మానవ అన్వేషణ లక్షాలకు ఎంతో కీలకమని శాస్త్రవేత్తలు తెలిపారు. భవిష్యత్తులో అంతరిక్షంలో నివసించే, లేదా పనిచేసే వ్యోమగాముల కోసం ఆహార వనరులను అభివృద్ధి చేయడానికి చంద్రుడు లేదా అంగారక గ్రహం పై ఉన్న వనరులను ఉపయోగించవలసి ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు. మొక్కల పెరుగుదల, వ్యవసాయ పరిశోధనల ఆవిష్కరణ దిశగా నాసా పనితీరు కూడా ఇది అద్దం పడుతోంది. భూమిపై ఆహార కొరత ఉన్న ప్రాంతాలలో పరిస్థితులను అధిగమించేందుకు ఈ ప్రయోగం సహకరిస్తుందని నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ nelson వెల్లడించారు.
పెరుగుతున్న సాధ్యమేనా..
చంద్ర మండలం నుంచి తెచ్చిన మట్టిలో మొక్కలను పెంచడం ఇక్కడ ఫలించిన ప్రయత్నం. కానీ నేరుగా చంద్రుని పై మొక్కలు పెంచవచ్చా అన్న ప్రశ్నలకు ఇంకా సంపూర్ణ స్థాయిలో సమాధానం దొరకలేదు. ప్రస్తుతం శాస్త్రవేత్తలు దీనికి సరైన జవాబు వెతుకుతున్నారు. చంద్రునిపై సంపూర్ణ వ్యవసాయం సాధ్యమవుతుందా, చంద్రమండలంలో మానవులు ఎక్కువకాలం ఉండేందుకు అవకాశాలు ఎలా ఉన్నాయి.. అన్న అంశాలపై ప్రస్తుతం పరిశోధన కొనసాగుతోంది. అయితే చంద్రుడి నేల మాత్రం సాగుకు యోగ్యమైన దేనని, ప్రాథమికంగా ఇది నిరూపించబడిందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. మనం నివసించే సౌర వ్యవస్థ గురించి మరింత అన్వేషించడానికి, తెలుసుకోవడానికి, చంద్రమండలం లో లభ్యమైన వనరులను సద్వినియోగం చేసుకోవడానికి ఉన్న అవకాశాలు అన్నింటిని శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. శాస్త్రవేత్త లు అపోలో 11,12,17 మిషన్ల ద్వారా భూమి పైకి తీసుకు వచ్చిన చంద్రుడి మట్టికి నీరు, విత్తనాలను జోడించి రోజువారీ పోషకాలను నిర్వహిస్తూ ఎట్టకేలకు సత్ఫలితాలను సాధించగలిగారు. రెండు రోజుల తర్వాత క్రమంగా అవి మొలకెత్తడం ప్రారంభించాయి. ఇరవై రోజుల తర్వాత జరిగిన అధ్యయనంలో చంద్రుని మట్టి నమూనా మంచి ఫలితాలను ఇచ్చినట్టు తేల్చారు. ఇది పరిశోధనను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు దోహదం చేస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ పురోగతి భవిష్యత్తులో కచ్చితంగా చంద్రుడిపై పంటలను పండించడానికి తలుపులు తెరుస్తుందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేశారు.