collapse
...
Home / ఆంధ్రప్రదేశ్ / చేపల వేట లేకున్నా.. నేనున్నా అంటున్న జగనన్న.. - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for...

చేపల వేట లేకున్నా.. నేనున్నా అంటున్న జగనన్న..

2022-05-13  News Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

ysr jagan(1)
 

చేపలవేటకు సంబంధించి ఇది నిషేధ సమయం.. చేపలనే నమ్ముకొని బతుకుతున్న మత్సకారుల కడుపు మాడే తరుణం.. లక్షకు పైగా ఉన్న మత్సకారుల కుటుంబాలకు ఇది కష్టకాలం.. ఇది మత్స్యకారులపై విధి విసిరిన గాలం.. కానీ ఈ కలిసిరాని కాలం లో సర్కారు మీతో కలిసి వస్తుంది.. అంటున్నాడు ముఖ్యమంత్రి వైయస్ జగన్. మత్స్యకారుల కుటుంబాలను ఆదుకునే దిశగా ముందడుగు వేసింది వైసీపీ ప్రభుత్వం. వరుసగా నాలుగో ఏడాది కూడా    మత్స్యకార భరోసా, మత్స్యకారుల అభివృద్ధిసంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఆయన ప్రకటించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఇదీ సహకారం..       

సముద్రాన్ని నమ్ముకొనిచేపలను పట్టుకుని    జీవనోపాధిని పొందడమే మత్స్యకారుల జీవితం. అయితే తుఫానులు, ఇతర ప్రకృతి బీభత్సాలు కారణంగా తరచు వారి ఉపాధికి ఆటంకాలు ఏర్పడతాయి సహజం. ఇదే రీతిలో ఏప్రిల్   15 నుంచి జూన్   14 వరకు సముద్రంలో చేపల వేట పై నిషేధం విధించారు. మత్స్యకారులు ప్రమాదాల బారిన పడకూడదనే ఉద్దేశంతో    ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిషేధ సమయంలో మత్స్యకారులు ఇబ్బంది పడకుండా వారిని ఆదుకోవాలని వైసీపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా సముద్ర వేటకు వెళ్లే   1,08,755 మత్స్యకారుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి   10 వేల చొప్పున   109 కోట్ల ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా ఓ ఎన్ జి పి    సంస్థ ద్వారా చేపడుతున్న పైప్లైన్ పనుల కారణంగా జీవన ఉపాధి కోల్పోయిన   23,458 కుటుంబాలకు కూడా సర్కార్ భరోసా ఇచ్చింది. వీరికి అందించే ఆర్థిక సహాయం తో కలిపి మొత్తం   217 కోట్లు ప్రభుత్వం మత్స్యకారుల కోసం ఖర్చు చేస్తుంది. కోనసీమలోని మురమళ్ళ గ్రామంలో శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా వీటిని మత్స్యకారులకు అందజేయనున్నారు. వైయస్సార్ సర్కార్ వచ్చాక మత్స్యకారులకు ఇప్పటిదాకా అందించిన ఆర్థిక సాయం   418 కోట్లకు చేరింది. అంతేకాకుండా మత్స్యకారులకు డీజిల్ ఆయిల్ సబ్సిడీ నిమిత్తం మార్ట్ కార్డులను కూడా ప్రభుత్వం జారీ చేస్తుంది. చేపల వేట లో మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు చెల్లించే పరిహారానికి   లక్షల నుంచి   10 లక్షలకు పెంచింది. రాష్ట్ర వ్యాప్తంగా   3,606 కోట్ల వ్యయంతో తొమ్మిది ఫిషింగ్ హార్బర్ లు, నాలుగు ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల నిర్మాణాలను వేదం గా కొనసాగిస్తోంది. కష్టకాలంలో ప్రభుత్వం తమకు అండగా ఉండటంతో మత్స్యకారులు ఊపిరిపీల్చుకున్నారు.

సర్కారు వారి సహకారం   

గత ప్రభుత్వాల తో పోల్చి చూస్తే వైయస్ జగన్ సర్దార్ వచ్చాక మత్స్యకారులకు సహాయసహకారాలు గణనీయంగా పెరిగాయి. చేపలు పట్టడం తప్ప మరో విద్య తెలియని మత్స్యకారులు విభక్తులు వచ్చినపుడల్లా తీవ్ర కష్టాలు పడేవారు. పూటగడవని దుస్థితిని ఎదుర్కొన్న మత్స్యకారులు ఎందరో ఉన్నారు. అయితే గత ప్రభుత్వాల హయాంలో    వీరికి అందివచ్చే సహకారం చాలా తక్కువగా ఉండేది. గత ప్రభుత్వం సముద్రంలో చేపల వేట పై నిషేధం విధించినప్పుడు మత్స్యకార కుటుంబాలకు కేవలం నాలుగు వేలు ఆర్థిక సహాయం మాత్రమే అందించేది. అది కూడా అందరికీ అందేది కాదు. అనీల వారికి అది ఏమాత్రం సరిపోయేది కాదు. కానీ వైసీపీ సర్కారు పూర్తిస్థాయిలో మత్స్యకారుల జాబితాను సిద్ధం చేసింది. తాము అందించే ఆర్థిక సహకారం ప్రతి కుటుంబానికి అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మరో వైపు మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు అందించే ఆర్థిక సహాయం ఐదు లక్షలు మాత్రమే ఉండేది. దానిని ప్రస్తుత ప్రభుత్వం పది వేలకు పెంచింది. దీనితోపాటు స్మార్ట్ కార్డుల జారీఅభివృద్ధి కార్యక్రమాల నిర్మాణాలు మత్స్యకారులకు మంచి భరోసా ఇస్తున్నాయి. సేద్యానికి కష్టకాలం ఉన్నట్లే మత్స్యకారుల కూడా తరచూ కష్టకాలం వస్తుంటుంది. రెక్కాడితే కానీ డొక్కాడని వీరి జీవితాలలో నిషేధ కాలం వచ్చిందంటే చాలు అంధకారం అలుముకుంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం మత్స్యకారులను ప్రత్యేకంగా గుర్తించింది. మత్స్యకారుల కుటుంబాలలో ఒక్కరు కూడా ఆకలితో ఉండకూడదని నిర్ణయించింది. ఎన్నికలకు ముందే మత్స్యకారుల కుటుంబాలలో వెలుగులు నింపుతాం అని ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల తర్వాత తన మాట నిలబెట్టుకున్నారు. ప్రస్తుతం తమకు అన్ని వస్తున్న ప్రోత్సాహం పట్ల మత్స్యకారుల కుటుంబాల నుంచి పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తమవుతోంది. జగన్ ప్రభుత్వం మత్యకారుల కుటుంబాల నుంచి ప్రశంసలు అందుకుంటోంది.2022-05-13  News Desk