collapse
...
Home / అంతర్జాతీయం / Pakistan: హింసా మార్గం ప‌డుతున్న బలూచిస్థాన్ ఉద్య‌మం - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | N...

Pakistan: హింసా మార్గం ప‌డుతున్న బలూచిస్థాన్ ఉద్య‌మం

2022-05-13  News Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

book

రక్తపుటేరులు పారిస్తున్న పాకిస్థాన్ పై బలూచిస్థాన్ అప్రతిహత యుద్ధాన్ని చేస్తునే ఉంది. బులూచ్ లిబరేషన్ ఆర్మీ చేసిన దాడుల్లో పాక్ సైనికులు ప్రాణాలుకొల్పోతున్న విష‌యం తెలిసిందే.   బలూచ్ విద్యార్థులు   బలూచిస్తాన్‌లో ఉన్నా,  పాకిస్తాన్‌లో  ఇతర ప్రాంతంలో చ‌దువుకుంటున్నా ఎవ‌రు  ఎప్పుడూ కిడ్నాప్ చేస్తారో,  చంపేస్తారో అనే భయం వెంటాడుతోంది. దీంతో త‌మ రోజువారి కార్య‌కాలాపాల‌ను చేసుకోవ‌టానికే కాదు క‌నీసం స్వేచ్ఛగా తిరగలేని ప‌రిస్థితి నెల‌కొందన్న‌ది బలూచ్ ప్ర‌జ‌ల ఆందోళ‌న‌. 

అయితే తాజాగా  కరాచీ యూనివర్సిటీ లో పాఠాలు భోదించే ప్రొఫ‌స‌ర్‌తో పాటు మ‌రి ముగ్గురు బులుచ్‌ యువకులు కరాచీ - క్వెట్టా నుండి కిడ్నాప్ కావ‌టం ఇప్ప‌డు సంచ‌ల‌న‌మ‌వుతోంది. ఈ ఘ‌ట‌న‌వెనుక పాక్ హ‌స్తం ఉంటుంద‌న్న ఆరోప‌ణ‌లు ఎక్కువ‌గా వినిపిస్తున్న నేప‌థ్యం లో బలూచిస్తాన్ ఉద్య‌మం గురించి ప్ర‌పంచ వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంది.

నిజానికి  పాకిస్తాన్‌లోని చాలా ప్రాంతాలకు గ్యాస్‌ను స‌ర‌ఫ‌రా చేసే డేరా బుగ్తీ   ప్రాంత ప్రజలు క‌నీస తాగునీటి వ‌స‌తికి కూడా నోచుకోక పోవ‌ టంతో  మురికి నీటినే తాగవలసి వస్తోంది. దీంతో  ప్రజలు కలరా, ఇతర వ్యాధుల బారినపడుతు మ‌ర‌ణిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. దీనిపైనా నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ ప్రాంత ప్ర‌జ‌ల‌కుఎప్ప‌టిక‌ప్పుడు ఇచ్చిన‌ హామీల అమ‌లు మృగ్యంకావ‌టంతో ఆందోళ‌న‌లు మ‌రింత పెరుగుతున్నాయి. 

ఈక్ర‌మంలోనే పాకిస్తానీ సీక్రెట్ సర్వీసెస్ చేత బలూచ్ వ్య‌క్తుల అపహరణ జ‌రుగుతునే ఉంది. వీటి సంఖ్య పెరిగి పోతూఉండ‌టంతో వారిని తిరిగిత‌మ చెంత‌కు చేర్చాల‌ని ఆయా కుటుంబాలు దశాబ్దానికి పైగా నిరసనలు చేస్తున్నా ఫ‌లితం లేదు. ఈ  అక్రమ కిడ్నాప్‌లకు వ్యతిరేకంగా, సరిహద్దు వాణిజ్యాన్ని తెరిచి, మ‌రింత సులభతరం చేయాలని స‌రిహ‌ద్దు ప్రాంత‌మైన గ్వాదర్ ప్రజలు  చేస్తున్న‌ నిరసనలకు కూడా అంతే లేకుండాపోయింది.  

పాకిస్ధాన్ అణచివేత దాష్టిక‌ విధానాలకు వ్య‌తిరేకంగా ఎన్నోఏళ్లుగా బలూచ్ ప్రజలు పోరాటం చేస్తునే ఉన్నారు. ఇక్క‌డ పంజాబ్, పాకి స్తాన్‌లోని ఇతర ప్రాంతాల నుండి వచ్చిన చాలా మంది సర్దార్, నవాబ్‌లుగా పిలుచుకునే బలూచ్ గిరిజన కుటుంబాలే ఉన్నాయి.  వారు తమ న్యాయమైన హక్కులను డిమాండ్ చేస్తుపోరాటం చేస్తున్నా ఫ‌లితంఉండ‌టంలేదు.   

1960 నుండి నేటి వరకు జ‌రిగిన  బలూచ్ ఉద్యమ చరిత్రను ప‌రిశీలిస్తే  అది పూర్తిగా శాంతియుత ప్రజాస్వామ్య పోరాటం గా  క‌నిపించినా క్ర‌మ క్ర‌మంగా   బలూచ్ ఉద్య‌మం హింసామార్గం ప‌డుతుంద‌న్న ఆందోళ‌న ఇప్పుడుఅంద‌రిలో ఉంది. దశాబ్దం చివరి వరకు, బలూచ్‌లు మాండ్, టర్బత్, డేరాబుగ్తి, కహాన్, కరాచీ, క్వెట్టా మరియు బలూచిస్తాన్‌లోని ఇతర ప్రాంతాలలో భారీ సమావేశాలు జ‌రుగుతున్నాయి. షహీద్ ఫిదా అహ్మద్ బలూచ్ నుండి గులాం మహ్మద్ బలూచ్ వరకు   అనేక మంది నేత‌లు   మాట్లాడుతునే ఉన్నారు.

అయితే ఈ శాంతియుత ర్యాలీలు, బహిరంగ సభలు, నిరసనలకు ప్రతిస్పందనగా కొన్ని  అసాంఘిక శ‌క్తులు ఉద్య‌మంలోకి చొర‌బ‌డిన‌ట్టు ఆందోళ‌న నెల‌కొంది కూడా. వీరు ప్ర‌ధానంగా పాకిస్తాన్  స్వాతంత్ర అనుకూల రాజకీయ పార్టీల నేత‌ల‌ను, సంస్థల నాయకులను ఎంచుకుని కిడ్నాప్‌లు చేయ‌టం,   వారిని చిత్రహింసలకు గురిచేసి చంపి, ఛిద్రమైన మృతదేహాలను వీధుల్లో పడేయ‌టం ప‌రిస్థితుల‌ను చిన్నా భిన్నంగా మార్చేస్తున్నాయి.  పాక్ క్రూరత్వానికి వ్యతిరేకంగా జ‌నం గొంతులు పెంచడం కోస‌మే ఇది అనుకున్నా...ఫ‌లితం మాత్రం హింస దిశ‌గా ప‌య‌నించే ఆస్కారం క‌నిపిస్తోంది.

బలూచిస్తాన్ స్వాతంత్రం కోసం శాంతియుతంగా, రాజకీయంగా పోరాడుతున్న సంస్ధ‌ల‌పై బలూచ్ రాజకీయ పార్టీలపై  పాకిస్తాన్ న్యాయ వ్యవస్థ నిషేధించింది.  వీటిపై చట్టవిరుద్ధమైన అపహరణలు , హత్యల ఆరోప‌ణ‌లున్నావారు తమ పోరాటాన్ని విడిచిపెట్టలేదు, ఇవ‌న్నీ కేవ‌లం బూటకపు ఆరోపణలతో వారిని నిషేధించడంలో పాకిస్తాన్ దళాలు విజయం సాధించి ఉండవచ్చు కానీ బలూచ్ ప్రతిఘటనను అంతం చేయలేర‌ని ఈ ప్రాంత ప్ర‌జ‌లు భావిస్తున్నారు. పైగా  ఉద్య‌మం రోజురోజుకు మరింత బలపడుతోంది. 

ఈ   ఉద్య‌మాన్ని  ఎన్నాళ్లు శాంతియుతంగా పోరాడాలి? అన్న ప్ర‌శ్న కూడా త‌లెత్తింది. మ‌రోవైపు జ‌రుగుతున్న హింస‌తో  బలూచ్‌లను ఆయుధాలు తీయమని ఎవరు బలవంతం చేశారు? అనే ప్ర‌శ్న అంద‌రి మ‌దిలో ఉద‌యిస్తోంది.

1948లో బలూచిస్తాన్‌ను పాకిస్థాన్‌లో బలవంతంగా విలీనం చేసింది ఎవరు? బలూచ్ నాయకత్వంతో పదే పదే వాగ్దానాలను ఎవరు ఉల్లంఘించారు? వృద్ధ నవాబ్ అక్బర్ ఖాన్ బుగ్తీని ఎవరు చంపారు? శాంతియుత రాజకీయ నాయకుడు గులాం మహ్మద్ లాలా మునీర్ -షేర్ మహ్మద్ బలోచ్‌లను ఎవరు చంపారు? బలూచ్ వనరులను ఎవరు దోచుకుంటున్నారు? చాఘిలోని జనసాంద్రత ప్రాంతంలో అణు పరీక్షలు ఎవరు నిర్వహించారు? అన్న ప్ర‌శ్న‌లు ఇప్పుడు వినిపిస్తున్నాయి. 

ఇక  కాశ్మీర్‌కు స్వేచ్ఛగా ఉండేందుకు హక్కు ఉందని పాక్   విశ్వసిస్తున్న‌ప్పుడు, బలూచిస్తాన్ ఎందుకు  ఆ ప‌ని చేయకూడదన్న‌ది వారి భావ‌న‌ పాలస్తీనాకు స్వేచ్ఛగా ఉండే హక్కు ఉందని భావిస్తున్న వారు బలూచిస్తాన్ కు ఎందుకు ఉండ‌ద‌న్న నిల‌దీత ఆరంభ‌మైంది. 

బలూచ్‌లు వేరే దేశాన్నో, అక్క‌డి భూమినో, ఓ ప్రాంతాన్నో, వనరులను ఆక్రమించుకోవడానికి ఉద్య‌మం చేయ‌టం లేద‌ని,  తమ సొంత ప్రాంతాన్ని పాక్ నుంచి రక్షణ కోసం ఆయుధాలు ఎత్తుకున్నారని కొంద‌రు చెపుతారు. నిజ‌మే  దేశాన్ని, కుటుంబాన్ని, రక్షించుకోవడం నేరం కాదు క‌నుక వారి వాద‌న‌ల‌కు మ‌ద్ద‌తు ల‌భిస్తోంది..

 2022-05-13  News Desk